Monday, July 18, 2016

తీయని గులాబీలు

మైదా-అరకేజీ 
వరిపిండి-అరకేజీ
గోడుమపిండి-పావుకేజీ
యాలకులపొడి-చెంచ
వంటసోడా-చిటికెడు
చక్కర-అరకెజీ
నూనె-వేయించుకోడానికిసరిపడా
గిన్నెలోనూనెతప్ప మిగిలినపదార్ధములను ఒక్కోటితీసుకోవాలి.అన్నిటినిఒకసారి
కలిపి ఆతరువాత సరిపడానీటితోదోసపిండిలా చేసుకోవాలి.బాండిలో సరిపడానూనె
వేసిబాగావేడి చేయాలి.తరువాతగులాబీలు వేసేకాదనుపిండిలోముంచి వేడినూనెలో
ఉన్చేయాలి.పిండివేగగానేకాడ నుంచి విడిపోయి పువ్వుల వస్తుందిఇలామిగిలినపిండినికూడాచేసుకోవాలి

Sunday, July 17, 2016

వెన్న జంతికలు

బియ్యంపిండి -అరకేజీ 
కారం -ఒక టీ స్పూన్ 
పసుపు -అర టీ స్పూన్ 
వెన్న -రెండువంద లు గ్రాములు
వాము-ఒక టేబుల్ స్పూన్
మినపప్పు-యాభయ్ గ్రాములు
నూనె-వేయించడానికి సరిపడా
ఉప్పు-కొద్దిగా
కొత్తిమీర-రెండురెమ్మలు
స్టవ్వెలిగించి కడాయిపెట్టుకునివేడి చేసుకోవాలి.అందులో మినపప్పువేసిలో ఫ్లేమ్లో
అయిదు నిమిషాల వరకువేయించాలి.వేయించిన మినపప్పునుచల్లార్చి
మిక్సి జార్లోకి తీసుకొనిమెత్తచేసుకోవాలి.grindచేసుకున్నపిండిని ఒకప్లేట్ లోజల్లించుకోవాలి.
బియ్యంపిండిలో మిక్సిపట్టినమినపప్పునువేసుకోవాలి.స్టవ్ వెలిగించి ఒకగిన్నెపెట్టి
అందులో వెన్నవేసిబాగాకాగాబెట్టాలి.అడినురగ వచ్చేంతవరకు.
కాగినవెన్ననుపిండిలో వేసుకోవాలి.తర్వాతపసుపు,కారంఉప్పు,వామువేసుకోవాలి
కొత్తిమీరనుబాగాచిన్నగాకట్చేసిఅందులోవేసిపిండిలోపదార్దాలను బాగాకలిసేలాకలుపుకోవాలి.
పొడిపొడిగవచ్చినతర్వాతకొంచెంనీరుకలుపుకునిజంతికలపిండిలబాగాకలుపుకోవాలి
జంతికల గొట్టంలో నక్షత్రపు ఆకారంలోఉన్నమరనుపెట్టి మనంవేయించుకునేగరిటెనుబోర్లించిదానిపైనరౌండ్గఅనుకునివేడిఅయిననూనెలోతిప్పివేసుకోవాలి.మీడియం ఫ్లేమ్లోపెట్టిరెండువైపులావేయించుకోవాలి

Thursday, July 14, 2016

మెంతిగుండ

మెంతులు ఆరోగ్యానికి, షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచివని మనకు తెలిసిందే ! అయితే, చేదుగా ఉండటంవల్ల వాటిని పోపుల్లో తప్ప మరెక్కడా వాడము. అయితే వీటినే 'మెంతి గుండ' గా తయారుచేసి పెట్టుకుంటే, అనేకరకాల ఉపయోగాలు ఉన్నాయి. అవి చెప్పే ముందు తయారీ విధానం చూద్దాము.
మెంతి గుండ
---------------
ఆవాలు - 4 స్పూన్లు
మెంతులు - 4 స్పూన్లు
ఎండుమిర్చి - 10-15
నూనె - ఒక స్పూన్
ముందుగా మూకుడులో నూనె వేసి, పైవన్నీ వేసేసి ఎర్రగా వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా పొడి చేసి, ఆరాకా ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలి. నిజానికి మన పూర్వీకులు ఇళ్ళలో ఎప్పుడూ దీన్ని సిద్ధం చేసి ఉంచేవారు.
ఉపయోగాలు
------------------
౧.ఉప్పులో వేసిన లేక తాజా గోంగూర, నిమ్మకాయ, చింతకాయ, ఉసిరికాయ, మెంతిబద్దలు(దీనికి మాత్రం మిక్సీ అక్కర్లేదు, చిన్నచిన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు వాడచ్చు), వంటి వాటికి క్రింది ఫార్ములా వాడెయ్యచ్చు.
మిక్సీలో మెత్తగా రుబ్బిన పచ్చడి + రెండు స్పూన్ల మెంతి గుండ + ఒక స్పూన్ కారం + తగినంత ఉప్పు - కలిపేసి, నూనెలో ఆవాలు, జీలకర్ర, ఇంగువ పోపు వేసేస్తే, తాజా పచ్చళ్ళు తయారవుతాయి.
౨. దప్పళం, తోటకూర పులుసు, పులిహోర వంటివి కలిపేటప్పుడు ఒక చెంచా మెంతి గుండ వేస్తే, ఆ రుచే వేరు.
౩. అప్పటికప్పుడు ఇడ్లీ, దోశ లోకి పచ్చడి చెయ్యాలంటే - ఇలా ప్రయత్నించి చూడండి.
తరిగిన మామిడికాయ ముక్కలు + 2 స్పూన్ల మెంతి గుండ + రెండు చెంచాల బెల్లం పొడి + 2 పచ్చిమిర్చి, కాస్త కొత్తిమీర - మిక్సీ తిప్పేసి, పోపేస్తే చక్కటి మామిడికాయ పచ్చడి తయారు. ఒకసారి రుచి చూస్తే, మరి వదలరండోయ్.

Wednesday, July 13, 2016

వేరుశెనగ '' పాయసం ''

కావలసినవి: వేరుశెనగపప్పు వందగ్రాములు, పాలు అరలీటరు, కి స్‌మిస్ 25గ్రాములు, తెల్లగోధుమలు వందగ్రాములు, నెయ్యి రెండుస్పూన్లు, పెసలు యాభైగ్రాములు, పంచదార రెండువందల గ్రాములు, జీడిపప్పు పలుకులు తగినన్ని.

తయారీ: ముందుగా వేరుశెనగపప్పును మిక్సీలో వేసి తగినన్ని నీళ్లుపోస్తూ మెత్తగా రుబ్బుకుని వడగట్టి పాలు తయారుచేసుకోవాలి. ఇలా ఒక కప్పు పాలు తీయాలి. గోధుమలు, పెసలు కుక్కర్‌లో ఉడి కించి చల్లారనివ్వాలి. జీడిపప్పును కొద్దిగా నెయ్యి వేసి వేగించాలి. మిగతా నెయ్యిలో ఉడికించిన గోధుమలు, పెసలు వేసి కొద్దిగా వేగించి అందులో వేరుశెనగపాలు, మామూలు పాలు, చక్కెర వేసి బాగా మరిగించాలి. చివరగా వేగించిన జీడిపప్పు, యాలకులపొడి, కిస్‌మిస్‌లు వేసి బాగా కలిపిదించుకోవాలి.

Tuesday, July 12, 2016

కిచిడి

బియ్యం -ఒక కప్పు 
పెసరపప్పు -అరకప్పు (బియ్యాన్ని,పెసరపప్పును ఒకగిన్నేలోవేసుకోవాలి.అవి
రెండుకలిపిబాగాకడగాలి.దానినిముప్పై నిముషాలు నానబెట్టుకోవాలి)
ఉల్లిపాయ-ఒకటి
పచ్చిమిర్చి-రెండు,చిన్నగాకట్చేసి పెట్టుకోవాలి
బంగాళదుంప-ఒకటి
టొమాటోలు-మూడు
కార్రోట్-ఒకటి మీడియంసైజు
నెయ్యి-రెండుటేబుల్స్పూన్స్
జీలకర్ర-అరటీస్పూన్
కరివేపాకు,కొత్తిమీర-రెండురెమ్మలు
అల్లంవెల్లుల్లిపేస్టు-ఒకటీస్పూన్
అల్లంముక్క-చిన్నముక్క
మసాలకారం-ఒకటీస్పూన్
మిరియాలపొడి-చిటికెడు
ఉప్పు-రుచికిసరిపడా
కుక్కర్ తీసుకునిబాగానానిన బియ్యం,పెసరపప్పును వేయాలి.కారెట్,పచ్చిమిర్చి
,ఉల్లిపాయముక్కలువేసుకోవాలి.టమాటో ముక్కలు వేసుకోవాలి.
రెండుకప్పులనీళ్ళుపోసుకోవాలి.రుచికిసరిపడా ఉప్పువేసుకోవాలి.
అల్లంవెల్లుల్లిపేస్టు వేసుకోవాలి.మిరియాలపొడి వేసుకోవాలిమసాలకరంలేకుంటేగరంమసాలా వేసుకోవచ్చు.ఒకటీస్పూన్
నెయ్యివేసుకోవాలి.మూతపెట్టిఉడికించుకోవాలి.
స్టవ్వెలిగించిమీడియంఫ్లేమ్లోపెట్టి మూడువిసిల్స్ వచ్చేదక ఉడికించుకోవాలి
ఆవిరి పోయినతరువాతమూతతీసి చూస్తెకూరముక్కలు,పెసరపప్పు,అన్నం
బాగాఉడికిఉంటాయి.
స్టవ్వెలిగించికడాయి పెట్టి వేడిచేసినెయ్యివేసుకోండి.నేతి తో తాలింపు పెట్టుకుంటే
రుచిబాగుంటుంది.జీలకర్రవేసుకోవాలి.కట్చేసిపెట్టుకున్న అల్లంముక్కలువేసుకోవాలి
ఒకనిమిషం పాటువేపాలి.కరివేపాకువేసుకోవాలి.బాగాఉడికినకిచిడిని
లో ఫ్లేమ్లోపెట్టివేపుకోవాలిఒకగిన్నెతీసుకొని అందులోకిచిడి వేసుకోవాలి
పైనకొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి

Wednesday, July 6, 2016

• మజ్జిగ ఇడ్లీ

* కావలసినవి:
బొంబాయిరవ్వ: రెండున్నర కప్పులు, మజ్జిగ: 4 కప్పులు, నూనె: 3 టేబుల్‌స్పూన్లు,
ఉప్పు: రుచికి సరిపడా, మినపప్పు: టీస్పూను, సెనగపప్పు: టీస్పూను, ఆవాలు: టీస్పూను, తాజా కొబ్బరితురుము: 2 టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి: రెండు(సన్నగా తరగాలి), కరివేపాకు: 2 రెబ్బలు, ఇనో ఫ్రూట్‌ సాల్ట్‌: టేబుల్‌స్పూను.
* తయారుచేసే విధానం:
* ఓ గిన్నెలో బొంబాయిరవ్వ, మజ్జిగ, 2 టేబుల్‌స్పూన్ల నూనె, ఉప్పు వేసి కలిపి అరగంటసేపు పక్కన ఉంచాలి.
* చిన్న పాన్‌లో మిగిలిన నూనె వేసి కాగాక, మినప్పప్పు, సెనగపప్పు, ఆవాలు వేసి వేయించాలి. ఇప్పుడు కొబ్బరితురుము, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఓ నిమిషం వేయించి రవ్వ మిశ్రమంలో కలపాలి. ఇష్టమైతే క్యారెట్‌ తురుము, జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోవచ్చు. చివరగా ఫ్రూట్‌సాల్ట్‌ వేసి దానిమీద కొద్దిగా నీళ్లు పోయాలి. బుడగలు రాగానే పిండిమిశ్రమంలో కలిసేలా మృదువుగా కలపాలి.
ఇప్పుడు మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి ఇడ్లీ కుక్కర్‌లో సుమారు 8 నుంచి 10 నిమిషాలు ఆవిరిమీద ఉడికించి దించాలి.

• బీరకాయ గారెలు

* కావలసినవి:
బీరకాయలు: పావుకిలో, మినప్పప్పు: 200గ్రా., పండుమిర్చి:నాలుగు, పచ్చిమిర్చి: మూడు, ఉప్పు: రుచికి సరిపడా, కరివేపాకు: రెబ్బ, అల్లం తురుము: 2 టేబుల్‌స్పూన్లు,జీలకర్ర: టీస్పూను, నూనె: తగినంత

* తయారుచేసే విధానం:
మినప్పప్పుని రాత్రే నానబెట్టాలి.బీరకాయ తొక్కుతీసి ముక్కలుగా కోసి పక్కన ఉంచాలి.పండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలుగా కోయాలి. వీటికి అల్లంతురుము, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర చేర్చి మిక్సీలో రుబ్బాలి. తరవాత బీరకాయ ముక్కలు, నానబెట్టిన పప్పు వేసి మెత్తగా రుబ్బాలి.మిశ్రమాన్ని గారెల మాదిరిగా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి.

Sunday, June 19, 2016

చిక్కుడు రొట్టెలు

చిక్కుడుకాయ ముక్కలు-కప్పు
బియ్యంపిండి-రెండుకప్పులు
ఉల్లిముక్కలు-కప్పు
కొత్తిమీరతురుము-రెండుటీస్పూన్స్
ఉప్పు-తగినంత
నూనె-రెండు టీస్పూన్స్
పచ్చిమిర్చి-రెండు
జీలకర్ర-టీస్పూన్
కరివేపాకు తురుము-రెండు రెబ్బలు
కారం-అరటీస్పూన్
చిక్కుడుకాయ ముక్కలనుఉడికించి తీయాలి.గిన్నెలో బియ్యంపిండి,ఉడికించినీళ్ళు
వంపేసిన చిక్కుడుకాయముక్కలు,ఉల్లిముక్కలు,పచ్చిమిర్చిముక్కలు
జీలకర్ర ,కొత్తిమీరతురుము,కారం,ఉప్పు,కరివేపాకు తురుము తగినన్ని
నీళ్ళు పోసిముద్దలా కలుపుకోవాలి.స్టవ్మీద పెనం పెట్టికలుపుకున్న పిండిని మనకుకావలసిన సైజులో మందపాటిరొట్టెల వత్తుకునిపెనంమీదవేసి నూనెవేసి
రెండువైపులా కాల్చుకోవాలి.

రాగి ఉతప్పం

రాగిపిండి-రెండుకప్పులు
జీలకర్ర-టీస్పూన్
పెరుగు-అరకప్పు
అల్లంతురుము-టేబుల్స్పూన్
ఉప్పు-రుచికిసరిపడా
టమాటోముక్కలు
-కప్పు
ఉల్లికాడలు,కాప్సికం ముక్కలు-కప్పు
రాగిపిండిలో పెరుగుఅల్లంతురుము,సన్నగాతరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు
ఉప్పు,టమాటో ముక్కలు,ఉల్లికాడలు,సన్నగాతరిగినకాప్సికం ముక్కలుఅన్నివేసికలపాలి.తరువాతతగినన్నినీళ్ళుపోసి దోసె పిండిల కలుపుకోవాలి.ఇప్పుడుఈమిశ్రమాన్ని పెనంమీద ఉతప్పం ల వేసి నూనెవేసి
రెండువైపులా కాల్చుకోవాలి

పండిపోయిన దొండకాయలతో పచ్చడి

కావలసిన పదార్ధాలు:
--------------------------
పండిన దొండకాయ ముక్కలు - పావు కిలో
పచ్చిమిర్చి (3), కాస్త కొత్తిమీర
పసుపు- చిటికెడు
నానబెట్టిన చింతపండు- తగినంత(దొండపండులో పులుపు ఉంటుంది కనుక అంతగాపట్టదు)
మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి (4)
పంచదార - అర చెంచా
ఉప్పు- తగినంత
తయారీ విధానం
------------------
ముందుగా పోపు వేసుకుని, వేగాకా దొండకాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, వేసి, మూతపెట్టి మగ్గనివ్వాలి.ఇష్టమైన వాళ్ళు ఇందులో కాసిన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. ఇది మగ్గాకాచింతపండు కూడా వేసి, మిక్సీ తిప్పేస్తే, రుచికరమైన దొండకాయ పచ్చడి రెడీ. పైన మళ్ళీ పోపు వేయించి వేసుకుంటే బాగుంటుంది.
 


మినప చెక్కలు

మినపప్పు-అరకిలో
బియ్యం-పావుకిలో
ఎండుమిర్చి-అయిదు
మిరియాలు-టీ స్పూన్
ఇంగువ-చిటికెడు
జీలకర్ర-టీ స్పూన్
కరివేపాకు-రెండురెబ్బలు
ఎండుమిర్చిలేదా పచ్చిమిర్చి-పది
ఉప్పు-రుచికి సరిపడా
నూనె-వేయించుకోడానికి సరిపడా
మినపప్పు,బియ్యం కడిగి రాత్రి అంత నాననివ్వాలి.ఉదయ్యాన్నే నీళ్ళు వంపివడగట్టి
మిరియాలు,పచ్చిమిర్చి,ఉప్పుచేర్చి మెత్తగారుబ్బుకోవాలి.తరువాత
జీలకర్ర,సన్నగాతరిగిన కరివేపాకు వేసికలపాలి.
పిండిముద్దనుచిన్నచిన్నఉండలుగాచేసి ప్లాస్టిక్ కాగితంమీదచేతికినూనె తీసుకునిచెక్కల మాదిరిగా పలుచగా ఒత్తి కాగిన నూనెలో వేయించి
తీసుకోవాలి



Monday, June 13, 2016

బీరకాయ బజ్జీలు

బీరకాయ-ఒకటి
సెనగపిండి-రెండుకప్పులు
బియ్యంపిండి-రెండుటేబుల్స్పూన్స్
ఉప్పు-తగినంత
కారం-టీస్పూన్
వంటసోడా-చిటికెడు
వాము-అరటీస్పూన్
నూనె-వేయించుకోడానికి సరిపడా
ముందుగా బీరకాయ పైపొట్టుతీసి పలుచనిగుండ్రని ముక్కలుగాకోసుకోవాలి.
ఒకగిన్నెలోసెనగపిండి,బియ్యంపిండి,కారం,ఉప్పు,వాము,వంట సోడావేసిబజ్జి ల
పిండిలజారుగా కలపాలి.ఇప్పుడుస్టవ్వెలిగించి బాణలి పెట్టిఅందులోనూనెపోసివేడిఅయ్యాక సెనగపిండిమిశ్రమంలో బీరకాయ ముక్కలను
ఒక్కోదాన్నిముంచికాగిననూనెలో వేసివేయించితీసుకోవాలి

డేట్స్ మరియు వాల్నట్స్ లడ్డు

ఖర్జూరం-అయిదు
వాల్నుట్-రెండు
ఇలాచి-తగినంత
ఖర్జూరంలోని గింజలను తీసేసి ముక్కలుగా చేసుకోవాలి.వాల్నుట్ ను పగలగొట్టి
లోపల ఉన్నది తీసుకోవాలి.ఇలాచి తీసుకునివీటినిఅన్నిటిని grind చేసిపొడిల
చేసుకోవాలి.ఈమిశ్రమాన్ని కొంచెంకొంచెం లడ్డు సైజులో గుండ్రంగా తయారుచేసుకోవాలి.
ఇందులోపంచదార ఆవసరం లేదు.ఎందుకంటే ఖర్జూరం లోతీపిఉంటుందికాబట్టి

Saturday, June 11, 2016

మెంతి చక్లి-

బ్రెడ్ slices-నాలుగు
పెరుగు-అరకప్పు
మైదా-పావుకప్పు
సెనగ పిండి-పావుకప్పు
కారం-అరటీస్పూన్
నువ్వులు-టీస్పూన్
మెంతితురుము-అరకప్పు
అల్లంతురుము-టీస్పూన్
నూనె-వేయించుకోడానికిసరిపడా
బ్రెడ్ slices నునలిపిపోడిలాచేసుకోవాలి.అందులోనేపెరుగు,మైదా,సెనగ పిండి,కారం
నువ్వులు,మెంతితురుము,అల్లంఅన్నివేసిజంతికలపిండిలకలుపుకోవాలి.
తరువాతస్టవ్వెలిగించి బాణలి పెట్టినూనెపోసుకుని కాగినతర్వాతపిండిముద్దను
జంతికల గొట్టంలో పెట్టికావలసిన ఆకారంలో వత్తి ఎర్రగా వేయించి తీసివేయాలి

Thursday, June 9, 2016

క్యాప్సికం బోండాలు |.



 (కావాల్సిన పదార్థాలు)
బేబీ క్యాప్సికం-10,
ఆలు-4,
ఉల్లిపాయ తరుగు-ఒక కప్పు,
అల్లం తరుగు-ఒక టీ స్పూను,
పచ్చిమిర్చి తరుగు-ఒక టీ స్పూను,
పుదీనా తరుగు-అర కప్పు,
ఉప్పు-రుచికి సరిపడా,
శనగపిండి-ఒక కప్పు,
వాము- అర టీ స్పూను,
నూనె- వేయించడానికి సరిపడా,
నిమ్మరసం-ఒక టేబుల్‌ స్పూను
.
(
తయారీ)
ఆలుని మెత్తగా ఉడికించి తొక్క తీసి మెదపాలి. కడాయిలో ఒక టేబుల్‌ స్పూను నూనె వేసి ఉల్లి, అల్లం, పచ్చి మిర్చి, పుదీనా తరుగుల్ని వేగించాలి. మెదిపిన ఆలు, తగినంత ఉప్పు కూడా కలిపి దించి, చల్లారాక నిమ్మరసం చల్లాలి. శనగపిండిలో వాము చిటికెడు ఉప్పు వేసి తగినంత నీటితో చిక్కగా కలుపుకోవాలి. క్యాప్సికం తొడిమల్ని, లోపలి గింజల్ని తీసేసి అందులో ఆలు మిశ్రమాన్ని కూరి, శనగపిండి జారులో ముంచి నూనెలో దోరగా వేగించాలి. ఈ బోండాలు టమోటో సాస్‌తో చాలా రుచిగా ఉంటాయి.

Tuesday, June 7, 2016

అలసందలు మసాలా కర్రీ::

కావల్సిన పదార్థాలు:
అలసందలు: 1cup
టమోటో పేస్ట్ : 1cup
ధనియాలా పొడి: 1tsp
పోపు దినుసులు: 1tsp
గరం మసాలా: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
పుదీనా : కొద్దిగా
తరిగిన ఉల్లిపాయ ముక్కలు: 1/4cup
కొత్తిమీర : కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
కరివేపాకు : రెండు రెమ్మలు
ఎండు మిరిపకాయలు : 2
తరిగిన పచ్చిమిర్చి: 2
పసుపు : చిటికెడు
నూనె: 3tbps
తయారుచేయు విధానం:
1. ముందుగా అలసందలను రెండు గంటల పాటు నానబెట్టి, కుకర్ లో ఒక విజిల్ వచ్చేవరకు. ఉడికించాలి. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు , జీలకర్ర వేసి వేసి చిటపటాలాడించాలి.
2. తర్వాత అందులోనే ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు: తరిగిన పచ్చిమిర్చి వేసి వేగించాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకొన్న అలసందలు వేసి ఫ్రై చేయాలి.
4. పోపుతో అలసందులు బాగా మిక్స్ అయిన తర్వాత అందులో చిటికెడు పసుపు వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
5. కొద్దిసేపు వేగిన తరవ్ాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకూ వేగించాలి.
6. తర్వాత టమోటో పేస్ట్ , కొద్దిగా అవసరం అయితే నీళ్ళు కూడా పోసి మిక్స్ చేయాలి.
7. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం మిశ్రమం కలగలుపుకోవాలి. మీడియం మంట మీద మూత పెట్టి కర్రీ చిక్కబడే వరకూ ఉడికించాలి.
8. చిక్కబడుతున్న సమయంలో ధనియాల పొడి, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేసి, కర్రీ దగ్గర పడే వరకూ ఉడికించాలి. అంతే అలసందలు మసాలా కర్రీ రెడీ . గార్నిషింగ్ గా కొత్తిమీర చిలకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే అలసందల కర్రీ రెడీ..

Chana Masala curry

కావల్సిన పదార్థాలు: 

శెనగలు - 300 gms (soaked) 
పచ్చిమిర్చి - 4 to 5 
ఉల్లిపాయలు - 1 cup
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1/2 teaspoon
ధనియాల పొడి - 1/4th teaspoon
టమోటోలు - 2
గరం మసాలా పౌడర్ - 1/2 teaspoon
రెడ్ చిల్లీ పౌడర్ -1/2 teaspoon
జీలకర్ర - 1/4th teaspoon
ఆవాలు - 1/4th teaspoon
కొత్తిమీర - 4 to 5
నూనె: సరిపడా
ఉప్పు: రుచికి తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒకటి రెండు గంటలు ముందు నానబెట్టిన శెనగలు వేసి, అందులోనే కొన్ని నీళ్ళు పోసి, 3నుండి 4విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి.
2. చెన్నా పూర్తిగా మెత్తగా ఉడికిన తర్వాత, ఎక్సెస్ వాటర్ వంపేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత మిక్సీ జార్లో 2 టమోటోలు ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి.
4. ఇప్పుడు పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించుకోవాలి.
5. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, కారం, టమోటో గుజ్జుగా వేసి మిక్స్ చేయాలి.
6. ఉప్పు తర్వాత మిక్స్ చేసి ఉడికించాలి, చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

Corn Dosa

కావలసిన పదార్దాలు
(Ingredients for Corn Dosa or Jonna Dosa) :
శుబ్రం చేసిన జొన్నలు : రెండు కప్పులు
మినపప్పు : కప్పున్నర
బియ్యం : అరకప్పు
వంటసోడా : అర టీ స్పూన్
ఉప్పు : సరిపడా
నూనె : అరకప్పు
అల్లం, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు : కప్పు
జీలకర్ర : టీ స్పూన్
తయారుచేయు విధానం :
(Preparation Method for Jonna Dosa)
1) ఆరు గంటలు ముందు జొన్నలు, మినపప్పు, బియ్యం విడివిడిగా నానబెట్టాలి.
2) తరువాత నీళ్ళు వంపి మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలో ఉప్పు కలిపి రాత్రంతా పక్కనపెట్టాలి.
3) ఉదయానికి ఈ పిండి పులుస్తుంది. కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసి పిండిని పలుచగా కలుపుకోవాలి.
4) ఇప్పుడు పిండిలో వంటసోడా కలపాలి.
5) స్టవ్ మీద పాన్ పెట్టి కొంచెం పిండి గరిటతో తీసి పాన్ మీద దోశలా వేసి ఫైన జీలకర్ర, ఉల్లి, మిర్చి,అల్లం ముక్కలు జల్లాలి. ఇవి లేకుండా ప్లెయిన్ కూడా దోశ వేసుకోవచ్చు. దోశ చుట్టూ నూనె వేసి రెండు ప్రక్కలా దోరగా కాల్చాలి.
* అంతే ఎంతో రుచిగా ఉండే జోన్నదోశలు రెడీ.

Monday, June 6, 2016

బంగాళాదుంప మసాలా కూర::

కావలసిన పదార్ధాలు : 
బంగాళాదుంపలు : పావుకేజీ 
జీలకర్ర : అర టీ స్పూన్ 
మెంతులు : పావు టీ స్పూన్
పసుపు : పావు టీ స్పూన్
కారం : అర టీ స్పూన్
ఉప్పు : సరిపడా
నూనె : ఒక కప్పు
ఉల్లిపాయ – : ఒకటి
పచ్చిమిర్చి : మూడు
ఆవాలు : టీ స్పూన్
ఎండిమిర్చి : నాలుగు
వెల్లుల్లి రెబ్బలు : నాలుగు
కరివేపాకు : రెండు రెమ్మలు

తయారుచేయు విధానం :
1) ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండి మిర్చి విడివిడిగా వేపి ఉంచాలి.
2) ఇప్పుడు బంగాళాదుంపలు కడిగి పొట్టుతీసిన ముక్కలు నీళ్ళలో వేసి పక్కనవుంచాలి.
3) స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడి చెయ్యాలి.
4) నూనె కాగిన తరువాత బంగాళాదుంప ముక్కలు వేసి ఎర్రగా వేయించి పక్కన పెట్టాలి.
5) ఇప్పుడు పొడిగా వేపి ఉంచిన మెంతులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండిమిర్చి, వెల్లుల్లి అన్నికలిపి వీటికి చింతపండు చేర్చి మెత్తగా నూరాలి.
6) ఇప్పుడు ముక్కలు వేయించిన పాన్ లో రెండు టీ స్పూన్లు నూనె వేడి చెయ్యాలి.
7) కాగాక కరివేపాకు, పచ్చిమిర్చిముక్కలు, ఉల్లిముక్కలు వేసి దోరగా వేగాక పసుపు, ఉప్పు వేసి నూరిన మసాల వేసి వేయించాలి.
8) ఒకసారి కలిపి, వేయించిన బంగాళాదుంప ముక్కలు వేసి కలిపి ఒక నిముషం ఆగి స్టవ్ ఆపాలి.
* అంతే బంగాళాదుంపల మసాలా కూర రెడి.

దోసకాయ పచ్చడి:

కావలసినవి పదార్ధాలు :
దోసకాయ : ఒకటి
ఎండిమిర్చి: ఆరు (పచ్చిమిర్చితో కూడా చెయ్యొచ్చు)
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
పోపుదినుసులు : టేబుల్ స్పూన్
ఉప్పు : తగినంత
వెల్లుల్లి రేకలు : ఆరు
చింతపండు : ఉసిరి కాయంత
తయారుచేయు విధానం ::
1) దోసకాయను చెక్కు తీసి ముక్కలుగా చేయాలి.
2) స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చేసి ఎండిమిర్చి, మినపప్పు, సెనగపప్పు వేసి దోరగా వేపాలి.
3) ఇవి తీసి అదే నూనెలో దోసకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి.
4) మిక్సి జార్లో వేపిన మిశ్రమాన్ని, ఉప్పు, వెల్లుల్లిని చింతపండు వేసి మెత్తగా మిక్సి చెయ్యాలి. దీనిలో మగ్గిన దోసముక్కలు వేసి ఒక సెకన్ తిప్పాలి (మిక్సి బటన్ అన్ చేసి ఆఫ్ చెయ్యటం).
5) దోసకాయ మెత్తగా అయితే బాగుండదు. కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది.
6) ఇప్పుడు స్టవ్ మీద కళాయిలో నూనె వేసి పోపుదినుసులు, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేగాక, పచ్చడి పోపు వెయ్యాలి.
**అంతే దోసకాయ పచ్చడి రెడి.**

గోధుమ పిండి అట్లు::


కావలసిన పదార్దాలు :
గోధుమ పిండి : రెండు కప్పులు
మైదా : టేబుల్ స్పూన్
ఉల్లి ముక్కలు : కప్పు
పచ్చిమిర్చి,అల్లం పేస్టు : టీ స్పూన్
జీలకర్ర : టీ స్పూన్
ఉప్పు : సరిపడ
నూనె : అర కప్పు
రవ్వ : పావుకప్పు

తయారుచేయు విధానం :
1) గోధుమ పిండి,మైదా,రవ్వ,ఉప్పు కలిపి నీళ్ళు పోసి జారుగా కలిపి గంట పక్కన పెట్టాలి.
2) స్టవ్ మీద పాన్ పెట్టాలి.ఈ పిండిలో పచ్చిమిర్చి,అల్లం పేస్టు కలిపి పాన్ వేడెక్కిన తరువాత లోతు గరిటతో అట్టులా రౌండుగా వేసి చుట్టూ నూనె వేయాలి.ఉల్లి ముక్కలు,జీలకర్ర ఫైన చల్లాలి.
3) ఒక ప్రక్క కాలాక, రెండో ప్రక్క కూడా కాలనివ్వాలి.
4) అంతే గోధుమ అట్లు రెడీ. ఇవి వేడి వేడిగా కొబ్బరి చెట్నీతో తింటే చాలా బాగుంటాయి.

జీరా రైస్ ::

కావలిసినవి:
బియ్యం - నాలుగు కప్పులు
జీలకర్ర - ఒక చిన్న కప్పు
కరివేపాకు - రెండు కట్టలు
పచ్చిమిర్చి - పది
ఉప్పు, నూనె - తగినంత
తయారుచేసే విధానం:
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లలో పది నిమిషాలు నానబెట్టాలి. ఈ లోపు ఎసరు పెట్టి అది బాగా కాగిన తర్వాత బియ్యం పోసి అన్నం ఉడికిన తర్వాత పూర్తిగా వార్చేసి చల్లార్చాలి. ఒక బాణలిలో నూనె పోసి కాగిన తరువాత దాంట్లో జీలకర్రను ముందుగా వేసి దాన్ని వేగనిచ్చి కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు ముక్కలను వేసి అవి కూడా వేగిన తర్వాత అన్నాన్ని చేర్చి బాగా ఫ్రై చేయ్యాలి. ఈ మిశ్రమంలో ఉప్పును కూడా వేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన జీరా రైస్ రెడీ. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది.

Saturday, June 4, 2016

• ఓక్రా టొమాటో కర్రీ

కావలసినవి:
బెండ‌కాయ‌లు: అర‌కిలో, ఆలివ్‌ నూనె: 2 టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ: ఒకటి,
వెల్లుల్లి: 8 రెబ్బలు, కొత్తిమీర‌ తురుము: 4 టేబుల్‌స్పూన్లు, 
టొమాటోలు: పావుకిలో, మంచినీళ్లు: 2 కప్పులు, వెజిటబుల్‌ స్టాక్‌: 2 టేబుల్‌స్పూన్లు, దనియాలపొడి: అరటీస్పూను, దాల్చిన చెక్కపొడి: పావుటీస్పూను,
మిరియాలపొడి: అరటీస్పూను, ఉప్పు: తగినంత,
పప్పులనూనె: ముక్కలు వేయించడానికి సరిపడా.

• తయారుచేసే విధానం

* వెల్లుల్లి సన్నగా తరగాలి. టొమాటోలు మెత్తని గుజ్జులా చేయాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక ముక్కలుగా కోసిన బేండకాయ ముక్కల్ని వేయించి తీయాలి.
* విడిగా ఓ బాణలిలో ఆలివ్‌ నూనె వేసి ఉల్లిముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీరతురుము వేసి వేయించాలి. ఇప్పుడు వేయించిన బేండకాయ ముక్కలు, టొమాటో గుజ్జు, మంచినీళ్లు, వెజిటబుల్‌ స్టాక్‌ పోసి, ఉప్పు వేసి మరిగించాలి.
* తరవాత సిమ్‌లో పెట్టి దనియాలపొడి, మిరియాలపొడి, దాల్చినచెక్క పొడి వేసి దగ్గరగా అయ్యే వరకూ ఉడికించి తీయాలి.

• మెంతి మిస్సీ రోటి

కావలసినవి 
సెనగపిండి: కప్పు, బియ్యప్పిండి: పావుకప్పు, గోధుమపిండి: ముప్పావు కప్పు, ఉల్లిముక్కలు: అరకప్పు, మెంతికూర: అరకప్పు, పచ్చిమిర్చి: టీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: తగినంత

తయారుచేసే విధానం 
* ఓ గిన్నెలో అన్నీ వేసి బాగా కలపాలి. తరవాత సరిపడా గోరువెచ్చని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి తడిబట్ట కప్పి అరగంటసేపు పక్కన ఉంచాలి. 
* తరవాత మళ్లీ ఓసారి పిండిని మెత్తగా పిసికి చిన్న చిన్న ఉండల్లా చేయాలి. 
* ఇప్పుడు పిండి ముద్దని గోధుమపిండి అద్దుతూ పలుచని రొట్టెలా చేయాలి. దీన్ని వేడెక్కిన పెనంమీద నూనె లేకుండానే పొంగుతూ చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు వచ్చేవరకూ రెండు వైపులా కాల్చి తీయాలి. ఇప్పుడు దీన్ని స్టవ్‌మంట మీద ఆ మచ్చలు ముదురు రంగులోకి మారేవరకూ రెండువైపులా కాల్చి తీయాలి. ఇలాగే అన్నీ చేసి ఏదైనా కూరతో వడ్డించండి.

• రాగి వూతప్పం

కావలసినవి 
రాగిపిండి: 2 కప్పులు, జీలకర్ర: టీస్పూను, పెరుగు: అరకప్పు, అల్లంతురుము: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి: రెండు, ఉప్పు: రుచికి సరిపడా, టొమాటోముక్కలు: కప్పు, ఉల్లికాడలు, క్యాప్సికమ్‌ ముక్కలు: కప్పు

తయారుచేసే విధానం 
* రాగిపిండిలో జీలకర్ర, పెరుగు, అల్లంతురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు... అన్నీ వేసి కలపాలి. తరవాత తగినన్ని నీళ్లు పోసి దోసెపిండిలా కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని పెనంమీద వూతప్పంలా వేసి దానిమీద కూరగాయల ముక్కలు వేసి రెండువైపులా కాల్చి తీయాలి. వీటిని ఏదైనా చట్నీతో తింటే సరి.

ఓట్స్‌ మట్కి

కావలసినవి 
రోల్డ్‌ ఓట్స్‌: అరకప్పు, అలసందలు: గుప్పెడు (ఓ రాత్రంతా నానబెట్టాలి), ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: ఒకటి, కరివేపాకు: కట్ట, నూనె లేదా నెయ్యి: 2 టీస్పూన్లు, కొబ్బరితురుము: టీస్పూను, క్యారెట్‌ తురుము: 2 టీస్పూన్లు, కొత్తిమీర తురుము: టీస్పూను, ఆవాలు: చిటికెడు, జీలకర్ర: అరటీస్పూను, నిమ్మరసం: టేబుల్‌స్పూను

• తయారుచేసే విధానం

* కుక్కర్లో అలసందలు వేసి, కొద్దిగా నీళ్లుపోసి ఉప్పు వేసి రెండు విజిల్స్‌ రానివ్వాలి.

* ఓట్స్‌ శుభ్రంగా కడిగి ఆవిరిమీద ఇడ్లీల మాదిరిగా ఐదు నిమిషాలపాటు ఉడికించాలి.

* తరవాత ఓట్స్ ‌లో కొద్దిగా ఉప్పు చల్లి టీస్పూను నూనె లేదా నెయ్యి వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల అది ముద్దలా అతుక్కోకుండా ఉంటుంది.

* ఇప్పుడు పాన్‌లో మిగిలిన నూనె లేదా నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం తురుము అన్నీ వేసి వేగాక ఉడికించిన అలసందలు వేసి కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి అవి ఆవిరైపోయేవరకూ ఉడికించాలి. తరవాత ఉడికించిన ఓట్స్‌, పసుపు వేసి ఓ నిమిషం వేయించి దించాలి. ఇప్పుడు క్యారెట్‌, కొబ్బరి, కొత్తిమీర తురుములతోబాటు నిమ్మరసం కూడా కలిపి అందించాలి.

Thursday, June 2, 2016

రవ్వ కేక్

వేయించిన బొంబాయి రవ్వ -ఒక కప్ 
జీడిపప్పు పొడి ,పాలు ,నీళ్ళు -ఒక్కోటి అరకప్పు చొప్పున 
బేకింగ్ పౌడర్ -పావు టీ స్పూన్ 
కాందేన్సేడ్ మిల్క్,పందార-ఒక్కోటిముప్పావుకప్పుచొప్పున
కార్న్ఫ్లోర్-అరటీస్పూన్
రోజ్వాటర్-ఒకటీస్పూన్
జీడిపప్పులు-పది
ఒకగిన్నెలోబొంబాయిరవ్వ,జీడిపప్పు పొడి,బేకింగ్ పౌడర్,పాలు,కాందేన్సుద్ మిల్క్
వేసిబాగాకలిపిదానినికేక్ కుక్కర్ లోఅరగంట(ఓవెన్ లోఅయితే పావుగంట)
ఉడికించాలి.తరువాతబయటకుతీసి ముక్కలుకోసిజీడిపప్పులు
అతికించితిరిగిమరోఅరగంటచిన్నమంటపై(ఓవెన్లోఅయితేపావుగంట)
ఉడికించితీయాలి.తర్వాతఒకగిన్నెలోపంచదార,కార్న్ఫ్లోర్,నీళ్ళుపోసిపంచదారకరిగేవరకుమరిగించాక మంటతగ్గించి రోజ్ వాటర్,నిమ్మరసంవేసిస్టవ్ఆఫ్ చేయాలి
ఈపాకాన్నిరవ్వకేక్ముక్కలపై పోసిఆపాకం పీల్చుకునాకసర్వ్ చేయాలి

Monday, May 30, 2016

సర్వపిండి

బియ్యంపిండి-అరకేజీ
వేరుసెనగపప్పు-వందగ్రాములు
పచ్చిసెనగపప్పు-వందగ్రాములు
నువ్వులు-వందగ్రాములు
జీలకర్ర-ఒకటేబుల్స్పూన్
పచ్చిమిరపకాయలు-రెండు,చిన్నగాతరగాలి
ఉల్లిపాయలు-రెండు,సన్నగాతరిగినవి
కొత్తిమీర-ఒకకట్ట-చిన్నగాకట్చేసి పెట్టుకోవాలి
కరివేపాకు-అయిదురెమ్మలు,చిన్నగాకట్చేసిపెట్టుకోవాలి
నూనె-వేయించుకోడానికి సరిపడా
అల్లంవెల్లుల్లిపేస్టు-ఒకటేబుల్స్పూన్
కారం-ఒకటీస్పూన్
ఉప్పు-రుచికిసరిపడా
గోరువెచ్చనినీరు-పిండితడుపుకోడానికితగినన్ని
స్టవ్వెలిగించికడాయి పెట్టివేడిచేయాలి.నువ్వులువేసిఅయిదు నిముషాలులోఫ్లమేలోవేయించాలి.బాగావేగినతరువాతవాటిని తీసిఒకగిన్నెలోకితీసుకోవాలి.అదేకడాయిలోవేరుసెనగగుండ్లువేసిలోఫ్లేమ్లోఅయిదు
లేకఆరునిముషాలువేయించాలివీటినిఒకప్లేట్లోకితీసుకోవాలి.చల్లారినతరువాతచేత్తో
మెత్తగానలగ్గోట్టుకోవాలి.అప్పుడుఅవిరెండుగావిడిపోతాయి.
ఒకగిన్నెలోనీళ్ళుపోసివేరుసేనగాపప్పును,పచ్చిసెనగపప్పునుపదినిముషాలు
వేరువేరుగానానబెట్టుకోవాలి.
ఒకగిన్నెలోబియ్యంపిండితీసుకోవాలి.అందులోసన్నగాతరిగిన ఉల్లిపాయలు,
కొత్తిమీర,పచ్చిమిర్చి,కరివేపాకువేసుకోవాలి.వీటితోపాటుజీలకర్రవేసుకోవాలి
వేయించుకున్ననువ్వులువేసుకోవాలి.నానబెట్టినపచ్చిసెనగపప్పువేసుకోవాలి
నీటిలోనానబెట్టినవేరుసేనగాగుండ్లు వేయాలి.తర్వాతకారం,ఉప్పువేసుకోవాలి.
పిండిలోబాగాఇవిఅన్నికలిసేలా కలుపుకోవాలి.అందులోగోరువేహ్హనినీళ్ళుపోసుకుంటూ చపాతీపిండిలకలుపుకోవాలి.అందులోఅల్లంవెల్లుల్లిపేస్టువేసుకోవాలి.పిండినిబాగా
కలుపుకునిపెట్టుకోవాలి.నాన్ స్టిక్కడాయితీసుకునిండులోనూనెకొద్దిగావేసిమొత్తంకడాయిఅంతపూసుకోవాలి
తయారుచేసుకున్నపిండినికొంచెంతీసుకునికడాయిమద్యలోపెట్టిచేతికినూనెతడి చేసుకుని పలుచని రొట్టెల కడాయిఅంతవచేట్టు చేసుకోవాలి.సర్వపిండి కి
అక్కడక్కడ చిన్నరంధ్రాలుపెట్టుకోవాలిఎందుకంటెనూనెకిందికిదిగికాలుతుందికాబట్టి
స్టవ్వెలిగించిమనంచేసుకున్నసర్వపిండికడాయిపెట్టుకోవాలి.కాస్తవేడిఅయ్యాకసర్వపిండిమునిగేవరకుఅరకప్పునూనెపోసుకోవాలిహైఫ్లేమ్ లోపెట్టిబంగారు
గోధుమ రంగులోకివచ్చేంతవరకువేయించాలి.highflame లోపెట్టటంవల్ల
ఎక్కువనూనెపీల్చాడుఇలాబంగారు రంగులోకివచ్చాకఒకప్లేట్లోకితీసుకోవాలి

Friday, May 27, 2016

అల్లం పచ్చడి

అల్లం పచ్చడి
ఎండు మిరపకాయలు -పది
ఆవాలు -ఒక స్పూన్
వెల్లుల్లి -మూడు రెబ్బలు
చింతపండు -చిన్న నిమ్మకాయ సైజు 
అల్లం-యాభయి గ్రాములుబెల్లం -యాభయి గ్రాములు
మినపప్పు -రెండు స్పూన్స్
ముందుగ ఎండుమిరపకాయలను చిన్నగా చేసుకోవాలి.
అల్లం ను చిన్న ముక్కలుగా చేసుకోవాలి .బెల్లంనుకూడా చిన్నగా ముక్కలుగా చేసుకోవాలి .చింతపండును రెండు నిమిషాలపాటు నీటిలో వేడి చేయాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి రెండు స్పూన్స్ నూనె వేసి కాగాక ఒక స్పూన్ ఆవాలు
ముందుగ వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయాలి .తర్వాత మినపప్పు వేసుకోవాలి .ఎండు మిర్చిని వేసుకోవాలి.ఇవన్ని బాగా కలిసేలా కలపాలి ఇవి చల్లారిన తరువాత మిక్షి జర్లోకి తీసుకుని అల్లం ముక్కలు,బెల్లంముక్కలువడగట్టినచింతపండువేసుకోవాలి.అందులోఉప్పుతగినంతవేసుకోవాలి.మెత్తగపొడిఅయినతర్వాతకొంచెంనీరుచేర్చిమరలమిక్షిపట్టండి

Thursday, May 26, 2016

చనా పరాటా

గోధుమపిండి-ఒకటిన్నరకప్పు
నూనె-మూడుటేబుల్స్పూన్స్
ఉప్పు-రుచికిసరిపడా
నాన బెట్టినతెల్లశనగలు-ఒకకప్పు
ఉల్లిపాయముక్కలు-అరకప్పు
పచ్చిమిర్చి-నాలుగు
అల్లంతరుగు-పావుటీస్పూన్
కొత్తిమీర,కరివేపాకుతరుగు-అరటీస్పూన్
కారం-అరటీస్పూన్
గరంమసాలఅరటీస్పూన్
పసుపు-చిటికెడు
గోధుమ పిండిలోఉప్పు,రెండుస్పూన్స్నూనెవేసిసరిపడానీళ్ళతోచపాతిపిండిలాకలుపుకోవాలి.దానికినూనెపట్టించిఒకగంటసేపునాననివ్వాలి.తర్వాత శనగలు,పచ్చిమిర్చి
కరివేపాకు,కొత్తిమీరఅల్లంతరుగులనుమిక్షిలొ వేసికొద్దిగానీళ్ళుపోసిబరకగా 
ముద్దచేసుకోవాలి.తర్వాతకడాయిలోటేబుల్స్పూన్నూనెవేసిఉల్లిపాయముక్కలనుదోరగా వేయించుకోవాలి.
తర్వాత శనగల ముద్దవేసిపచ్చివాసనపోయేవరకు వేయించికారం,పసుపు,గరంమసాలవేసిమరో రెండునిముషాలు వేయించిదించేయాలి.తర్వాత నిమ్మకాయపరిమాణంలో చపాతిపిండితీసుకునిదానిమధ్యలోఉసిరికాయంతశనగల మిశ్రమాన్నిపెట్టి
మూసేసి,చపాతీలుగాఒత్తుకోవాలి.ఈచపాతీలను రెండువైపులానూనెవేస్తూ
దోరగాకాల్చుకోవాలి

బెల్లం ఉండలు

బియ్యం పిండి-గ్లాస్
బెల్లం-గ్లాస్
పచ్చికొబ్బరిముక్కలు-అరకప్పు
నువ్వులు-టీస్పూన్
ఏలకుల పొడి-చిటికెడు
బెల్లంలోనీళ్ళుపోసిలేతపాకంపట్టుకోవాలి.స్టవ్వెలిగించికడాయిపెట్టినువ్వులనువేయించిప్లేట్ లోకి తీసుకోవాలి.పచ్చికొబ్బరిముక్కలనుఅదేకడాయిలోవేసి వేయించాలి.బెల్లంపాకంలోనువ్వులు,పచ్చికొబ్బరి,ఏలకులపొడి,బియ్యంపిండి
ఒకదానితర్వాతఒకటివేసికలపాలి.
చల్లారినతరువాతచిన్నచిన్నపిండిముద్దలుతీసుకునిఉండలుగా చేసిపక్కనపెట్టాలి
ఇప్పుడుస్టవ్వెలిగించిబాణలిపెట్టినెయ్యిలేదానూనెవేసికాగాకముందుగా చేసిపెట్టుకున్నఉండలనుఅందులో వేసిరెండువైపులావేయించుకోవాలి

నల్లకారం

ధనియాలు-యాభయి గ్రాములు
తొడిమలుతీసినఎండుమిర్చి-యాబై గ్రాములు
పెద్దనిమ్మకాయ సైజుపరిమాణంలో చింతపండు
కరివేపాకు-రెండురెమ్మలు
మినుములు-చిటికెడు
వెల్లుల్లిరెబ్బలు-నాలుగు
జీలకర్ర-ఒకటీస్పూన్
ఉప్పు-రుచికిసరిపడా
నూనె-ఒకటేబుల్స్పూన్
స్టవ్వెలిగించిఒకకడాయిపెట్టివేడిచేయాలి.కడాయి వేడిఅయ్యాకఅందులోనూనెవేసికాగాబెట్టుకోవాలి.నూనెకాగాకముందుగా
జీలకర్ర,మెంతులు వేసిలోఫ్లేమ్లోపెట్టివేయించాలి.జీలకర్రచిటపట లాదాకతర్వాత
అందులోకరివేపాకు,ఎండుమిర్చివేసుకోవాలి.కరివేపాకును,ఎండుమిర్చినిలోఫ్లేమ్లోపెట్టిమరోరెండునిముషాలువేగనివ్వాలి.ధనియాలువేసుకోవాలి.దాదాపుఅయిదు
నిముషాలులోఫ్లేమ్లోవేయించాలి.తర్వాతఇందులోవెల్లుల్లిరెబ్బలువేసివేయించాలి.కొద్దిగాకలర్మారెంతవరకువేయించుకోవాలికలర్మారకస్టవ్ఆఫ్ చేసుకోవాలి
దీనిని పదినిముషాలుచల్లారనివ్వాలి.చల్లారినఈమిస్రమంను మిక్షిజార్ లోకితీసుకోవాలి.అందులోచింతపండు,తగినంతఉప్పువేసుకోవాలి.ఇవన్నివేసిమూతపెట్టిబాగామెత్తగాపొడిఅయ్యేంతవరకుgrind చేసుకోవాలి.