Wednesday, July 13, 2016

వేరుశెనగ '' పాయసం ''

కావలసినవి: వేరుశెనగపప్పు వందగ్రాములు, పాలు అరలీటరు, కి స్‌మిస్ 25గ్రాములు, తెల్లగోధుమలు వందగ్రాములు, నెయ్యి రెండుస్పూన్లు, పెసలు యాభైగ్రాములు, పంచదార రెండువందల గ్రాములు, జీడిపప్పు పలుకులు తగినన్ని.

తయారీ: ముందుగా వేరుశెనగపప్పును మిక్సీలో వేసి తగినన్ని నీళ్లుపోస్తూ మెత్తగా రుబ్బుకుని వడగట్టి పాలు తయారుచేసుకోవాలి. ఇలా ఒక కప్పు పాలు తీయాలి. గోధుమలు, పెసలు కుక్కర్‌లో ఉడి కించి చల్లారనివ్వాలి. జీడిపప్పును కొద్దిగా నెయ్యి వేసి వేగించాలి. మిగతా నెయ్యిలో ఉడికించిన గోధుమలు, పెసలు వేసి కొద్దిగా వేగించి అందులో వేరుశెనగపాలు, మామూలు పాలు, చక్కెర వేసి బాగా మరిగించాలి. చివరగా వేగించిన జీడిపప్పు, యాలకులపొడి, కిస్‌మిస్‌లు వేసి బాగా కలిపిదించుకోవాలి.

0 comments:

Post a Comment