* కావలసినవి:
బొంబాయిరవ్వ: రెండున్నర కప్పులు, మజ్జిగ: 4 కప్పులు, నూనె: 3 టేబుల్‌స్పూన్లు,
ఉప్పు: రుచికి సరిపడా, మినపప్పు: టీస్పూను, సెనగపప్పు: టీస్పూను, ఆవాలు: టీస్పూను, తాజా కొబ్బరితురుము: 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి: రెండు(సన్నగా తరగాలి), కరివేపాకు: 2 రెబ్బలు, ఇనో ఫ్రూట్ సాల్ట్: టేబుల్‌స్పూను.

* తయారుచేసే విధానం:
* ఓ గిన్నెలో బొంబాయిరవ్వ, మజ్జిగ, 2 టేబుల్‌స్పూన్ల నూనె, ఉప్పు వేసి కలిపి అరగంటసేపు పక్కన ఉంచాలి.
* చిన్న పాన్‌లో మిగిలిన నూనె వేసి కాగాక, మినప్పప్పు, సెనగపప్పు, ఆవాలు వేసి వేయించాలి. ఇప్పుడు కొబ్బరితురుము, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఓ నిమిషం వేయించి రవ్వ మిశ్రమంలో కలపాలి. ఇష్టమైతే క్యారెట్ తురుము, జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోవచ్చు. చివరగా ఫ్రూట్‌సాల్ట్ వేసి దానిమీద కొద్దిగా నీళ్లు పోయాలి. బుడగలు రాగానే పిండిమిశ్రమంలో కలిసేలా మృదువుగా కలపాలి.
ఇప్పుడు మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి ఇడ్లీ కుక్కర్‌లో సుమారు 8 నుంచి 10 నిమిషాలు ఆవిరిమీద ఉడికించి దించాలి.
0 comments:
Post a Comment