Tuesday, June 7, 2016

అలసందలు మసాలా కర్రీ::

కావల్సిన పదార్థాలు:
అలసందలు: 1cup
టమోటో పేస్ట్ : 1cup
ధనియాలా పొడి: 1tsp
పోపు దినుసులు: 1tsp
గరం మసాలా: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
పుదీనా : కొద్దిగా
తరిగిన ఉల్లిపాయ ముక్కలు: 1/4cup
కొత్తిమీర : కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
కరివేపాకు : రెండు రెమ్మలు
ఎండు మిరిపకాయలు : 2
తరిగిన పచ్చిమిర్చి: 2
పసుపు : చిటికెడు
నూనె: 3tbps
తయారుచేయు విధానం:
1. ముందుగా అలసందలను రెండు గంటల పాటు నానబెట్టి, కుకర్ లో ఒక విజిల్ వచ్చేవరకు. ఉడికించాలి. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు , జీలకర్ర వేసి వేసి చిటపటాలాడించాలి.
2. తర్వాత అందులోనే ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు: తరిగిన పచ్చిమిర్చి వేసి వేగించాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకొన్న అలసందలు వేసి ఫ్రై చేయాలి.
4. పోపుతో అలసందులు బాగా మిక్స్ అయిన తర్వాత అందులో చిటికెడు పసుపు వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
5. కొద్దిసేపు వేగిన తరవ్ాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకూ వేగించాలి.
6. తర్వాత టమోటో పేస్ట్ , కొద్దిగా అవసరం అయితే నీళ్ళు కూడా పోసి మిక్స్ చేయాలి.
7. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం మిశ్రమం కలగలుపుకోవాలి. మీడియం మంట మీద మూత పెట్టి కర్రీ చిక్కబడే వరకూ ఉడికించాలి.
8. చిక్కబడుతున్న సమయంలో ధనియాల పొడి, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేసి, కర్రీ దగ్గర పడే వరకూ ఉడికించాలి. అంతే అలసందలు మసాలా కర్రీ రెడీ . గార్నిషింగ్ గా కొత్తిమీర చిలకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే అలసందల కర్రీ రెడీ..

0 comments:

Post a Comment