Monday, June 6, 2016

జీరా రైస్ ::

కావలిసినవి:
బియ్యం - నాలుగు కప్పులు
జీలకర్ర - ఒక చిన్న కప్పు
కరివేపాకు - రెండు కట్టలు
పచ్చిమిర్చి - పది
ఉప్పు, నూనె - తగినంత
తయారుచేసే విధానం:
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లలో పది నిమిషాలు నానబెట్టాలి. ఈ లోపు ఎసరు పెట్టి అది బాగా కాగిన తర్వాత బియ్యం పోసి అన్నం ఉడికిన తర్వాత పూర్తిగా వార్చేసి చల్లార్చాలి. ఒక బాణలిలో నూనె పోసి కాగిన తరువాత దాంట్లో జీలకర్రను ముందుగా వేసి దాన్ని వేగనిచ్చి కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు ముక్కలను వేసి అవి కూడా వేగిన తర్వాత అన్నాన్ని చేర్చి బాగా ఫ్రై చేయ్యాలి. ఈ మిశ్రమంలో ఉప్పును కూడా వేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన జీరా రైస్ రెడీ. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది.

0 comments:

Post a Comment