Saturday, June 4, 2016

ఓట్స్‌ మట్కి

కావలసినవి 
రోల్డ్‌ ఓట్స్‌: అరకప్పు, అలసందలు: గుప్పెడు (ఓ రాత్రంతా నానబెట్టాలి), ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: ఒకటి, కరివేపాకు: కట్ట, నూనె లేదా నెయ్యి: 2 టీస్పూన్లు, కొబ్బరితురుము: టీస్పూను, క్యారెట్‌ తురుము: 2 టీస్పూన్లు, కొత్తిమీర తురుము: టీస్పూను, ఆవాలు: చిటికెడు, జీలకర్ర: అరటీస్పూను, నిమ్మరసం: టేబుల్‌స్పూను

• తయారుచేసే విధానం

* కుక్కర్లో అలసందలు వేసి, కొద్దిగా నీళ్లుపోసి ఉప్పు వేసి రెండు విజిల్స్‌ రానివ్వాలి.

* ఓట్స్‌ శుభ్రంగా కడిగి ఆవిరిమీద ఇడ్లీల మాదిరిగా ఐదు నిమిషాలపాటు ఉడికించాలి.

* తరవాత ఓట్స్ ‌లో కొద్దిగా ఉప్పు చల్లి టీస్పూను నూనె లేదా నెయ్యి వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల అది ముద్దలా అతుక్కోకుండా ఉంటుంది.

* ఇప్పుడు పాన్‌లో మిగిలిన నూనె లేదా నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం తురుము అన్నీ వేసి వేగాక ఉడికించిన అలసందలు వేసి కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి అవి ఆవిరైపోయేవరకూ ఉడికించాలి. తరవాత ఉడికించిన ఓట్స్‌, పసుపు వేసి ఓ నిమిషం వేయించి దించాలి. ఇప్పుడు క్యారెట్‌, కొబ్బరి, కొత్తిమీర తురుములతోబాటు నిమ్మరసం కూడా కలిపి అందించాలి.

0 comments:

Post a Comment