Tuesday, June 7, 2016

Chana Masala curry

కావల్సిన పదార్థాలు: 

శెనగలు - 300 gms (soaked) 
పచ్చిమిర్చి - 4 to 5 
ఉల్లిపాయలు - 1 cup
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1/2 teaspoon
ధనియాల పొడి - 1/4th teaspoon
టమోటోలు - 2
గరం మసాలా పౌడర్ - 1/2 teaspoon
రెడ్ చిల్లీ పౌడర్ -1/2 teaspoon
జీలకర్ర - 1/4th teaspoon
ఆవాలు - 1/4th teaspoon
కొత్తిమీర - 4 to 5
నూనె: సరిపడా
ఉప్పు: రుచికి తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒకటి రెండు గంటలు ముందు నానబెట్టిన శెనగలు వేసి, అందులోనే కొన్ని నీళ్ళు పోసి, 3నుండి 4విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి.
2. చెన్నా పూర్తిగా మెత్తగా ఉడికిన తర్వాత, ఎక్సెస్ వాటర్ వంపేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత మిక్సీ జార్లో 2 టమోటోలు ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి.
4. ఇప్పుడు పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించుకోవాలి.
5. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, కారం, టమోటో గుజ్జుగా వేసి మిక్స్ చేయాలి.
6. ఉప్పు తర్వాత మిక్స్ చేసి ఉడికించాలి, చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

0 comments:

Post a Comment