Saturday, June 4, 2016

• మెంతి మిస్సీ రోటి

కావలసినవి 
సెనగపిండి: కప్పు, బియ్యప్పిండి: పావుకప్పు, గోధుమపిండి: ముప్పావు కప్పు, ఉల్లిముక్కలు: అరకప్పు, మెంతికూర: అరకప్పు, పచ్చిమిర్చి: టీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: తగినంత

తయారుచేసే విధానం 
* ఓ గిన్నెలో అన్నీ వేసి బాగా కలపాలి. తరవాత సరిపడా గోరువెచ్చని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి తడిబట్ట కప్పి అరగంటసేపు పక్కన ఉంచాలి. 
* తరవాత మళ్లీ ఓసారి పిండిని మెత్తగా పిసికి చిన్న చిన్న ఉండల్లా చేయాలి. 
* ఇప్పుడు పిండి ముద్దని గోధుమపిండి అద్దుతూ పలుచని రొట్టెలా చేయాలి. దీన్ని వేడెక్కిన పెనంమీద నూనె లేకుండానే పొంగుతూ చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు వచ్చేవరకూ రెండు వైపులా కాల్చి తీయాలి. ఇప్పుడు దీన్ని స్టవ్‌మంట మీద ఆ మచ్చలు ముదురు రంగులోకి మారేవరకూ రెండువైపులా కాల్చి తీయాలి. ఇలాగే అన్నీ చేసి ఏదైనా కూరతో వడ్డించండి.

0 comments:

Post a Comment