బేబీ
క్యాప్సికం-10,
ఆలు-4,
ఉల్లిపాయ తరుగు-ఒక కప్పు,
అల్లం తరుగు-ఒక టీ స్పూను,
పచ్చిమిర్చి తరుగు-ఒక టీ స్పూను,
పుదీనా తరుగు-అర కప్పు,
ఉప్పు-రుచికి సరిపడా,
శనగపిండి-ఒక కప్పు,
వాము- అర టీ స్పూను,
నూనె- వేయించడానికి సరిపడా,
నిమ్మరసం-ఒక టేబుల్ స్పూను
.
(తయారీ)
ఆలుని మెత్తగా ఉడికించి తొక్క తీసి మెదపాలి. కడాయిలో ఒక టేబుల్ స్పూను నూనె వేసి ఉల్లి, అల్లం, పచ్చి మిర్చి, పుదీనా తరుగుల్ని వేగించాలి. మెదిపిన ఆలు, తగినంత ఉప్పు కూడా కలిపి దించి, చల్లారాక నిమ్మరసం చల్లాలి. శనగపిండిలో వాము చిటికెడు ఉప్పు వేసి తగినంత నీటితో చిక్కగా కలుపుకోవాలి. క్యాప్సికం తొడిమల్ని, లోపలి గింజల్ని తీసేసి అందులో ఆలు మిశ్రమాన్ని కూరి, శనగపిండి జారులో ముంచి నూనెలో దోరగా వేగించాలి. ఈ బోండాలు టమోటో సాస్‌తో చాలా రుచిగా ఉంటాయి.

0 comments:
Post a Comment