Saturday, June 4, 2016

• రాగి వూతప్పం

కావలసినవి 
రాగిపిండి: 2 కప్పులు, జీలకర్ర: టీస్పూను, పెరుగు: అరకప్పు, అల్లంతురుము: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి: రెండు, ఉప్పు: రుచికి సరిపడా, టొమాటోముక్కలు: కప్పు, ఉల్లికాడలు, క్యాప్సికమ్‌ ముక్కలు: కప్పు

తయారుచేసే విధానం 
* రాగిపిండిలో జీలకర్ర, పెరుగు, అల్లంతురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు... అన్నీ వేసి కలపాలి. తరవాత తగినన్ని నీళ్లు పోసి దోసెపిండిలా కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని పెనంమీద వూతప్పంలా వేసి దానిమీద కూరగాయల ముక్కలు వేసి రెండువైపులా కాల్చి తీయాలి. వీటిని ఏదైనా చట్నీతో తింటే సరి.

0 comments:

Post a Comment