Saturday, January 9, 2016

సెనగల సొరకాయ కర్రీ

సొరకాయ-అరకిలో
మొలకెత్తినసెనగలు-వందగ్రాములు
ఉల్లిపాయలు-రెండు
పచ్చిమిరపకాయలు-అయిదు
కరివేపాకు-రెండురెబ్బలు
జీలకర్రఆవాలు-ఒకటీ స్పూన్
వెల్లుల్లిరేకలు-నాలుగు
కొత్తిమీర-ఒకకట్ట
మొలకెత్తినసెనగలను ఉడికించిపక్కన పెట్టుకోవాలి.సోరకాయని చిన్నచిన్నముక్కలుగా
చేసుకోవాలి.స్టవ్మీద గిన్నెపెట్టి నూనెపోయాలి.బాగావేడిఅయ్యాక జీలకర్ర,ఆవాలు,కరివేపాకు
వెల్లుల్లిరేకులు,ఉల్లిపాయముక్కలు,పచ్చిమిర్చిముక్కలువేసివేఇంచాలి.తరువాత
సొరకాయ ముక్కలువేసిరెండునిమిషాలుమగ్గనివ్వాలి.ముక్కలుమెత్తపడ్డాక ఉడికించి
పెట్టుకున్న సెనగలు,ఉప్పుకూడావేసిసన్ననిమంటమీదఓపదినిమిషాలు ఉడికించాలి
చివర్లోకొత్తిమీరవేసి దించేయాలి

0 comments:

Post a Comment