Friday, May 13, 2016

కాకరకాయ నువ్వుల పులుసు:::

కావలసిన పదార్థాలు
కాకరకాయలు - 5, బెల్లం - 2 స్పూన్స్క, రివేపాకు - కొద్దిగా, పచ్చిమిర్చి - 3, పసుపు - 1/4 స్పూన్నూ, నె - 5 స్పూన్స్ను, వ్వుల పొడి - 4 స్పూన్స్, ఉప్పు, కారం - సరిపడ, ధనియాల పొడి - 1 స్పూన్ , చింతపండు - కొద్దిగా, పోపు గింజలు - 1 స్పూన్
*********************
ఇలా చేసుకుందాము :
ముందుగా కాకరకాయల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
చింతపండు నానపెట్టి బాగా గుజ్జు తయారు చేసుకోవాలి.
అర కప్పు నీళ్ళలో వేసి నానబెట్టాలి. తరువాత నువ్వులను వేయించి పొడి చేసుకోవాలి.
తరువాత బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగిన తరువాత కాకరకాయ ముక్కలు వేసి 10 నిముషాలు వేయించిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు బాణలిలో పోపు పెట్టి, వేగాక చింతపండు గుజ్జు, అరకప్పు నీళ్ళు పోసి బాగా కలపాలి. తరువాత అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి మూత పెట్టి బాగా ఉడికించాలి.
ఇప్పుడు అందులో బెల్లం కలిపిన నీళ్ళు మరియు నువ్వుల పొడి వేసి మూత పెట్టి ముక్కలు బాగా మెత్తగా అయ్యేవరకు ఉంచి దించెయ్యాలి.
అంతే రుచికరమైన కాకరకాయ నువ్వుల పులుసు

0 comments:

Post a Comment