Friday, May 13, 2016

ములక్కాయ కూర :-

ములక్కాయ,సొరకాయ ఇలా అన్ని పాలుపోసి చేసే కూరలూ వేడి వేడి అన్నంలో తినడానికి బావుంటాయి.బుజ్జి కుక్కర్ లో చేస్తే అయిదు నిమిషాల్లో చాలా తొందరగా అయిపోతాయి.

కావలసిన పదార్ధాలు :-

ములక్కాయలు రెండు
ఉల్లిపాయలు మూడు
మిర్చి మూడు
కరివేపాకు ఒక రెమ్మ
ఉప్పు,కారం తగినంత
పసుపు కొంచెం
పాలు అర కప్పు
నూనె మూడు టేబుల్ స్పూన్లు
తాలింపుకు శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి

తయారు చేసే విధానం :-

నూనె వేడిచేసి తాలింపు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించాలి. ఇప్పుడు కడిగిన ములక్కాయ ముక్కలు వేసి వేయించాలి రెండునిమిషాల తరువాత ఉప్పు,కారం పసుపు వేసి అరగ్లాసు నీళ్ళు పోసి కలిపి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి స్టీం పోయిన తరువాత తీసి నీరు ఇగిరే వరకు ఉడికించి అప్పుడు ఒక కప్పు పాలుపోసి అవి ఇగిరి కూర చిక్కబడేవరకు ఉంచి దించెయ్యాలి ఇందులో పాలు పోసేటప్పుడు ఒక స్పూన్ శనగపిండి పాలలో కలిపి వేస్తే కూడా కూర చాలా రుచిగా ఉంటుంది.గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది.

0 comments:

Post a Comment