Friday, May 13, 2016

కాకరకాయ కాయ పలంగా కూర :::

ఈ గుత్తి కాకరకాయకు పొట్టి కాకరకాయలైతే బాగుంటుంది.అవి దొరకని పక్షంలో పొడుగు కాకరకాయల్ని వేలెడంత ముక్కలుగా కోసుకుని ప్రయత్నించొచ్చు .
కావలసిన పదార్థాలు
కాకరకాయలు – పావుకిలో
శనగపిండి – ఒక కప్పు
కారం – రెండు చెంచాలు
ఉప్పు – ఒక చెంచా
నూనె – ఒక చిన్న కప్పు
కాకరకాయలు నీటితో కడిగి తడి ఆరేదాక ఉంచాలి. ఒక కప్పులో శనగపిండి, ఉప్పు, కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా కలిపాక ఒక రెండు స్పూన్స్ నూనె పోసి మళ్ళీ బాగా కలపాలి.తడి ఆరిన కాయల్ని గుత్తిగా కోసుకోవచ్చు లేదా కాయ పొట్ట మీద నిలువుగా గాటులా పెట్టి చీల్చుకోవచ్చు . ఇలా తరిగిన కాయల్లో శనగపిండి మిశ్రమాన్ని కూరుకోవాలి. మిగిలిన పిండిని అలా ఉంచాలి.మూకుడులో ఒక గరిట లో సగానికి నూనె పోసి కాకరకాయల్ని వేసి మూత పెట్టాలి. మధ్య మధ్య లో మూత తీసి జాగ్రత్తగా కలపాలి.కాయలు బాగా వేగాక మిగిలిన పిండి వేసి సరిపడా నూనె పోసి తిప్పి ఒక ఐదు నిమిషాలకి స్టవ్ ఆపేయచ్చు. కాయలు క్రిస్పీ గా రావాలంటే మూకుట్లో కాకరకాయ వేస్తున్నప్పుడు సరిపడా నూనె పోసేసుకోవాలి. కాయలు వేగాక మిగిలిన పిండి పైన వేసాక ఇక నూనె పోయకూడదు.

0 comments:

Post a Comment