Friday, May 13, 2016

కాకరకాయ పచ్చడి , (Bitter guard pickle)

కావలసిన పదార్ధాలు:
పెద్దగా తరిగిన కాకరకాయముక్కలు - 1 కిలో , చింతపండు గుజ్జు - 150 గ్రామ్స్ , ఉప్పు - 200 గ్రామ్స్ , కారం - 15౦ గ్రామ్స్ , బెల్లం - 5౦ గ్రామ్స్ , మెంతిపొడి - 5౦ గ్రామ్స్ , పసుపు - 1 టీ స్పూను , నూనె - 15౦ గ్రామ్స్ , ఆవాలు - 1/4 కప్పు , ఇంగువ - 1/2 టీ స్పూను .
తయారు చేసే పధ్ధతి:
స్టవ్ వెలిగించి వెడల్పు గిన్నె పెట్టి నీళ్ళు పోసి మరుగుతున్నప్పుడు 2 చెంచాల ఉప్పు , కొంచెం చింతపండు వేసి కాకరకాయ ముక్కలు వేసి 1౦ నిమిషాలు ఉడికించి నీళ్ళు వోడ్చాలి . ముక్కలు చల్లారాకా వెడల్పు బేసిన్ లో వేసిఉప్పు , పసుపు , చింతపండు గుజ్జు , బెల్లం , మెంతిపొడి , వేసి కలిపి మూత పెట్టి 3 రోజులు ఉంచాలి . తరవాత బాగా కలిపి , స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి వేడెక్కాకా ఇంగువ , ఆవాలు వేసి చిటపటలాడాకా దించి చల్లారాకా పచ్చడిలో కలిపి మూత పెట్టి ఒక రోజు ఉంచాలి .
(ఒంపిన నీటిని కాకరకాయ పులుసులో కలపి వాడండి)

0 comments:

Post a Comment