Monday, May 23, 2016

రాజ్మ పనీర్ గ్రేవి

రాజ్మ -ఒక కప్పు 
పనీర్ -ఒక కప్పు 
ఉల్లిపాయ -ఒకటి 
పచ్చిమిర్చి -రెండు 
టొమాటోలు -మూడు 
కరివేపాకు -ఒక రెమ్మ 
కొత్తిమీర -కొద్దిగా 
మీగడ -రెండు స్పూన్స్ 
అల్లం వెల్లుల్లి ముక్కలు -ఒక టీ స్పూన్ 
గరం మసాల పొడి -ఒక టీ స్పూన్ 
ఉప్పు -రుచికి సరిపడా 
కారం -ఒక టీ స్పూన్ 
పసుపు -చిటికెడు 
రాజ్మను నానబెట్టి ఉడికించాలి .రెండు టీ స్పూన్స్ నూనె వేడి చేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లి,మిర్చిముక్కలు ,కరివేపాకు వేసి వేయించాలి ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి వేసి వేగనివ్వాలి .తర్వాత టమాటో ముక్కలు వేసి మెత్తగా ఉడికించాలి .పసుపు ,కారం తగినంత ఉప్పు వేసి కలిపి రాజ్మా ,పనీర్ ముక్కలు కూడా వేసి కలిపి కొద్దిగా నీరు పోసి ఉడికించాలి.గ్రేవీ చిక్కగాఅయ్యాకగరంమసాలపొడిచల్లిమీగడకూడావేసికలపాలి.చివరగాతరిగినకొత్తిమీరచల్లివేడివేడిగాచపాతీల్లోకితీసుకుంటేబాగుంటుంది

0 comments:

Post a Comment