Friday, May 13, 2016

ఉల్లిపాయ చెట్నీ

: కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయలు - మూడు, పచ్చిమిరపకాయలు - ఆరు, జీలకర్ర - ఒక టీ స్పూను, కొత్తిమీర - ఒక కట్ట, మినప్పప్పు - రెండు టీ స్పూన్లు, వెల్లుల్లి రేకలు - నాలుగు, శెనగపప్పు - రెండు టీ స్పూన్లు, కరివేపాకు - రెండు రెబ్బలు, ఎండు మిరపకాయలు - నాలుగు, ఆవాలు - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: పొయ్యిమీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రేకలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి వేగించాలి. వేగాక దించేసి, చల్లారిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. పొయ్యిమీద మరో గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి ఆవాలు, మినప్పప్పు, శెనగపప్పు,కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి వేగించి ఈ పోపుని పచ్చడిలో కలుపుకోవాలి.
పూరిల్లోకి చపాతీలోకి ఈ పచ్చడి చాలా బావుంటుంది .

0 comments:

Post a Comment