Saturday, May 7, 2016

• చింత చిగురు పులిహోర

కావలసిన పదార్థాలు: (శుభ్రం చేసిన) చింతచిగురు - 1 కప్పు, పొడి అన్నం - 2 కప్పులు, వేరుశనగ పప్పు - 3 టేబుల్‌ స్పూన్లు, శనగపప్పు - 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు - అర టీ స్పూను, మినప్పప్పు - అర టీ స్పూను, పసుపు - అర టీస్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, ఎండు మిర్చి - 3, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, ఇంగువ - చిటికెడు.
తయారుచేసే విధానం: అన్నం (ఉడుకుతున్నప్పుడే ఒక టీ స్పూను నూనె, చిటికెడు ఉప్పు కలిపి) పొడిగా వండి చల్లార్చాలి. అర టీ స్పూను నూనెలో చింతచిగురును పచ్చివాసన పోయేవరకు చిన్నమంటపై వేగించి పక్కనుంచాలి. అదే కడాయిలో మిగతా నూనె వేసి ఎండుమిర్చి, వేరుశనగలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, పసుపు, ఇంగువ లతో తాలింపు వేసి ఉప్పు, చిగురుతో పాటు అన్నంలో కలపాలి.
ఈ చింత చిగురు పులిహోర వేసవిలో తప్ప మరోకాలంలో చేసుకునే అవకాశం లేదు కాబట్టి వెంటనే చేసేయండి.

0 comments:

Post a Comment