బాస్మతి బియ్యం - ఒక కప్పు
స్వీట్ కార్న్ - పావు కప్పు
అల్లం - ఐదు చిన్న ముక్కలు
వెల్లుల్లి - 10 పాయలు
పూదీన - కొంచెం
కొత్తిమీర - కొంచెం
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చిమిర్చి - 3
పట్టా, లవంగం, యాలకులు - తగినన్ని
కొబ్బరి పాలు - ఒకటిన్నర కప్పు
నెయ్యి - రెండు స్పూన్లు
పెరుగు - అరకప్పు
తయారుచేసే పద్ధతి:
- ముందుగా బియ్యం, మొక్కజొన్న గింజలు కలిపి నానబెట్టుకోవాలి.
- స్టవ్ మీద పెనం పెట్టి అందులో మూడు స్పూన్ల నూనె వేసి పట్టా, లవంగం, యాలకులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి పాయలు, పుదీనా, కొత్తిమీర కలిపి వేయించాలి. తర్వాత అందులో కొబ్బరి పాలు, కొంచెం నీళ్ళు పోసి బాగా ఉడికించాలి. తగినంత ఉప్పును కలపాలి. ఈ మిశ్రమం బాగా తెర్లిన తర్వాత అందులో నానబెట్టిన బియ్యం, స్వీట్ కార్న్ వేసి ఉడికించాలి. బియ్యం బాగా ఉడికిన తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసి కలిపి దించుకోవాలి. అంతే మొక్కజొన్న పులావ్ రెడీ.
0 comments:
Post a Comment