చింతచిగురు - కప్పు
సెనగ పప్పు - టేబుల్ స్పూన్
మినప్పప్పు - టేబుల్ స్పూన్
ధనియాలు - టేబుల్ స్పూన్
ఎండు మిర్చి - 4
నువ్వులు - టేబుల్ స్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - తగినంత
కరివేపాకు - 2 రెమ్మలు
పోపు కోసం
వేరుసెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండు మిర్చి -కొద్దిగా
తయారుచేసే పద్ధతి :
- చింతచిగురును శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. వీలైతే కాస్త ఎండలో పెడితే మంచిది. తరవాత కాస్త నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
- బాణలిలో నువ్వులు, మినప్పప్పు, ధనియాలు, సెనగ పప్పు వేసి వేయించాలి. చివరగా ఎండు మిర్చి కూడా వేసి వేయించి దించాలి. చల్లారిన తర్వాత వీటితో పాటు చింతచిగురు కూడా మిక్సీలో వేసి పొడి చేసి ఉంచాలి.
- అన్నం ఉడికించి ఉంచాలి. బాణలిలో నూనె పోసి కాగాక పోపు దినుసులన్నీ వేసి వేగాక చింతచిగురు పొడి, ఉప్పు, కరివేపాకు వేసి ఓ నిమిషం కాగాక ఉడికించిన అన్నం వేసి కలిపి దించాలి.
0 comments:
Post a Comment