Wednesday, March 19, 2014

బెల్లం మిఠాయి

కావలసిన పదార్ధాలు:

శెనగపిండి - 1 కప్పు , బియ్యంపిండి - 1/2 కప్పు , బెల్లం తురుము  - 1 కప్పు , నూనె - వేయించడానికి సరిపోయినంత , నెయ్యి- 
2 టీ స్పూన్లు . 

తయారు చేసే పధ్ధతి:

 వెడల్పుగా ఉన్న బేసిన్ లో శెనగపిండి , బియ్యంపిండి వేసి సరిపోయిన్ని నీళ్ళు పోస్తూ ఉండలు లేకుండా మరీ చిక్కగా మరీ పల్చగా కాకుండా గరిటజారుగా కలపాలి . స్టవ్ వెలిగించి వెడల్పుగా మందంగా ఉన్న బాణలి పెట్టి  నూనె పోసి వేడెక్కాకా లోతుగా ఉన్న చిల్లుల చట్రం లో కలిపిన పిండిని చిన్న కప్పుతో వేసి చుట్టూ తిప్పాలి . బూంది ఎర్రగా వేగాకా  వేరే చిల్లుల గరిటతో తీసి నూనె వోడ్చి ప్లేట్ లోకి తీసుకోవాలి . స్టవ్ మీద దళసరిగా ఉన్న గిన్నె / బాణలి పెట్టి బెల్లం తురుము , 1 చిన్న గ్లాసునీళ్ళుకలిపి సన్నటి సెగ మీద ఉడకనివ్వాలి . ఉండ పాకం( చిన్నకప్పు నీళ్ళల్లో 1 చెంచా పాకం వేసి వేళ్ళతో పట్టుకుంటే ఉండలా అవ్వాలి.) వచ్చాకా  బూంది వేసి దించి బాగా కలపాలి . ఒక ప్లేట్ కి నెయ్యి రాసి బెల్లంమిఠాయిని వేసి పరిచి ముక్కలుగా కోయాలి / ఒక కప్పులోకి నీళ్ళు తీసుకుని చేతికి నీళ్ళ తడి చేసుకుంటూ ఉండలు కట్టాలి . ముక్కలు కోయడమైనా  ఉండలు కట్టడమైనా వేడిగా ఉన్నప్పుడే చేయాలి .   

0 comments:

Post a Comment