Saturday, March 1, 2014

క్యారెట్ పచ్చడి

కావలసిన పదార్థాలు :
క్యారెట్లు            -             పదిహేను (చెక్కు తీసి ముక్కల్లా తరగాలి)
ఉల్లిపాయలు     -             రెండు
ధనియాల పొడి  -             చెంచా
ఆవ పొడి          -             చెంచా
జీలకర్ర పొడి      -             అరచెంచా
మెంతి పొడి       -             పావు చెంచా
కారం               -            రెండు చెంచాలు
ఉప్పు              -            తగినంత
ఇంగువ            -            చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ -           అరచెంచా
ఎండు మిర్చి      -            రెండు
కరివేపాకు         -            రెండు రెబ్బలు
చక్కెర             -             కొద్దిగా
నిమ్మరసం       -             మూడు చెంచాలు
మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర - పావు చెంచా చొప్పున
నూనె             -              కప్పు

తయారుచేసే పద్ధతి :

  • ఉల్లిపాయల్ని తరిగి మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. 
  • ఇప్పుడు బాణలిలో అరకప్పు నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండు మిర్చిని వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు రెబ్బలు కూడా వేసి, అవి వేగాక ఇంగువ, ఉల్లిపాయ మిశ్రమం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయల పచ్చి వాసనా పోయాక దించాలి. అందులో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, నిమ్మరసం, తగినంత ఉప్పుతో పాటు మిగిలిన పదార్థాలన్నీ వేసేయాలి. మిగిలిన నూనె కూడా వేసేస్తే స్పైసీ క్యారెట్ పచ్చడి రెడీ. ఇది వేడివేడి అన్నంలోకే కాదు చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది.

0 comments:

Post a Comment