Monday, March 3, 2014

చింతకాయ పచ్చడి ...

కావాల్సిన పదార్ధాలు ;- చింతకాయ తొక్కు -- ఒక దోసెడు తీసుకోవాలి
మినపపప్పు -- 2టేబుల్ స్పూన్స్
మెంతులు -- ఒక టీ స్పూన్
ఆవాలు -- అర టీ స్పూన్
ఇంగువ -- 2టీ స్పూన్స్
ఎండుమిరపకాయలు -- 30
పచ్చిమిరపకాయలు -- 10
నూనె -- 2 టీ స్పూన్స్
ముందుగ ఒక బాండి తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో నూనె వేసి ఆవాలు,మెంతులు , మినపపప్పు ,ఎండుమిరపకాయలు ,ఇంగువ వేసి పోపును దోరగా వేయించి దించేసి చల్లార నివ్వాలి . ఇప్పుడు ఒక టీ స్పూన్ పోపును పక్కకు తీసి పెట్టి మొత్తం పోపును ,పచ్చిమిరపకాయలను వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి . తరవాత మనము ముందు తీసుకున్న చింతకాయ తోక్కును కూడా వేసి రెండు రౌండ్లు తిప్పి ముందు గ్రైండ్ చేసి పెట్టిన కారపు ముద్దను ఈ చింతకాయ తొక్కులొ వేసి బాగా కలిపి పక్కన పెట్టిన పోపును కూడా వేసి కలపాలి . అంతే రుచికరమైన ఘుమఘుమ లాడే చింతకాయ పచ్చడి రెడీ ....... ఇష్టం వున్నవారు రెండు అంగుళాల బెల్లం ముక్కను కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు .....

తొక్కు కోసం ;-

చింతకాయలు వచ్చే సీజన్ లోనే ఒక 4 కేజీలు కొని వాటిని కడిగి తడి లేకుండా ఆరబెట్టి రోటిలో కొన్ని చింతకాయలు ఒక స్పూన్ పసుపు 3టీ స్పూన్స్ ఉప్పు వేసి గింజ నలగ కుండ దంచుకోవాలి ... మొత్తం చింతకాయ లన్నింటిని ఇలానే దంచి ఒక జాడీ లోకి తీసి పెట్టాలి .. ఇలా చేసిన 3డవ రోజున తొక్కులొని గింజలను పిచును తీసి బాగు చేసి పెట్టుకోవాలి .ఇప్పుదు తొక్కు రెడీ .. మనకు కావలసినప్పుడు కొంచం తీసుకుని పచ్చడి చేసుకుని తినడమే మిగిలింది .....

0 comments:

Post a Comment