Saturday, March 22, 2014

ఆలుగడ్డ పిట్టు

ఆలుగడ్డ(బంగాళదుంప)  ఆరోగ్యానికి చాల మంచిది. మంచి పోషకవిలున్నాయి. వాతవ వున్నావారు, షుగర్ వున్నావారు అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఆలుగడ్డ పిట్టు చాల తోందరగా అయిపోతుంది. పూరితో ఆలుగడ్డ పిట్టు తింటే చాల బావుంటుంది.
కావలసిన దినుసులు:
ఆలుగడ్డ – 500 గ్రాములు
ఉల్లిపాయలు – రెండు
పచ్చిమిరపకాయలు – ఆరు
కారం – టీ స్పూన్
కొత్తిమీర – చిన్న స్పూన్
నూనే – రెండు స్పూన్స్
పసుపు – చిటికెడు
పోపు దినుసులు:
ఆవాలు – టేబుల్ స్పూన్
జీలకర్ర -  టేబుల్ స్పూన్
పచ్చిశెనగపప్పు -  టేబుల్ స్పూన్
మినప గుళ్ళు – టేబుల్ స్పూన్
కరివేపాకు – కొంచెం
ఎండుమిర్చి – రెండు
తయారుచేయ విధానము:
ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరిగి ప్రక్కన పెట్టుకోవాలి. ఆలుగడ్డల పై పెచ్చు తీసి శుబ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి. కుక్కర్,లో కొంచెం నీళ్ళు పోసి ఒక గిన్నెలో ఆలుగడ్డలను పెట్టి ఒక గ్లాసు నీళ్ళు పోసి ఆరు వీజిల్స్ వచ్చేవరకు పెట్టుకోవాలి. కుక్కర్ చల్లారిన తరవాత గుత్తితో ఆలుగడ్డలను  బాగా మెదిపి ప్రక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిని పోయ్యి మీద పెట్టి నూనె వేసి అది వేడెక్కిన తరవాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశెనగపప్పు, మినపగుళ్ళు,  ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కరవేపాకు వేసి బాగా వేగనివ్వాలి. పోపు వేగిన తరవాత, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తరవాత ఆలుగడ్డను వేసి బాగా కలిపి పసుపు, ఉప్పు, కారం వేసి నాలుగు వైపుల కలిపి రెండు నిమషాలు మూత పెట్టుకోవాలి. చివరిగా రుచి చూసి, కొత్తిమీర వేసి దించుకోవాలి. అంతే! ఎంతో రుచిగా వుండే ఆలుగడ్డ పిట్టు రెడీ!

0 comments:

Post a Comment