Sunday, March 9, 2014

వంకాయ పచ్చికారం కూర

కావలసిన పదార్ధాలు:

లేత వంకాయలు- 8 , సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు - 1 కప్పు , ఎండుమిర్చి - 6 , (కారం-1/4 టీ స్పూను) ,
పసుపు - చిటికెడు , ఉప్పు - రుచికి తగినంత , ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు , జీలకర్ర - 1 టేబుల్ స్పూను ,
నూనె - 1/2 కప్పు

తయారు చేసే పధ్ధతి :

ఒక బేసిన్ లో 1 చెంచా ఉప్పు వేసి నీళ్ళు పోసి వంకాయలని  తొడిమ తీసి రెండు వైపులా తరిగి బేసిన్ లో వేయాలి .
  ధనియాలు , జీలకర్ర , ఎండుమిర్చి కలిపి మిక్సీ జార్ లో వేసి మెత్తటి పొడిలా చేయాలి . ప్లేట్  లో  ఉల్లిపాయముక్కలు , పసుపు , ఉప్పు , (కారం) , .గ్రైండ్ చేసిన పొడి వేసి కలిపి వంకాయలలో కూరాలి .  . స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి వేడెక్కాకా  వంకాయలని పేర్చి మూత పెట్టి చిన్న ప్లేటులో నీళ్ళు పోసి మూత మీద పెట్టి
సన్నటి సెగ మీద వంకాయలని మగ్గించాలి . రెండో వైపు తిప్పి కూర మెత్తబడ్డాకా డిష్ లోకి తీసుకోవాలి .

0 comments:

Post a Comment