Sunday, November 17, 2013

కొత్తిమీర 'క్యూబ్స్'


కావలసిన పదార్థాలు: శనగపిండి - 1 కప్పు, కొత్తిమీర తరుగు - ముప్పావు కప్పు, నీరు - 1 కప్పు, బియ్యప్పిండి, నిమ్మరసం - 1 టేబుల్ స్పూను చొప్పున, పంచదార - అర టీ స్పూను, అల్లం పచ్చిమిర్చి పేస్టు - 1 టీ స్పూను, వేగించిన నువ్వులు - 2 టీ స్పూన్లు, పసుపు - పావు టీ స్పూను, గరం మసాల - పావు టీ స్పూను, ఇంగువ - చిటికెడు, నూనె - వేగించడానికి సరిపడా, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో శనగపిండి, కొత్తిమీర తరుగు, పసుపు, పంచదార, నిమ్మరసం, అల్లంమిర్చి పేస్టు, గరం మసాల, ఇంగువ, బియ్యప్పిండి, నువ్వులతో పాటు 2 టీ స్పూన్ల నూనె వేసి బాగా కలపాలి. చిక్కగా ఉండేలా కొంచెమే నీరు పోసి కలుపుకోవాలి. నూనె రాసిన కడాయిలో ఈ మిశ్రమాన్ని దళసరిగా పరిచి, 20 నిమిషాల పాటు (కత్తితో గుచ్చితే తడి అంటనంతవరకు) మంటపై ఉడికించాలి. చల్లబడ్డ తర్వాత కత్తితో క్యూబ్స్‌గా కట్ చేసుకుని పెనంపై అన్ని వైపులా కాల్చుకోవాలి. వీటికి టమోటా సాస్ మంచి కాంబినేషన్.

0 comments:

Post a Comment