Sunday, November 17, 2013

మిరియం, నిమ్మ పులిహోర

మిరియం, నిమ్మ పులిహోర
అన్నం - 3 కప్పులు
నిమ్మకాయ - 1
పసుపు - 1/4 టీ.స్పూ.

పచ్చిమిర్చి - 3
మిరియాలు - 6
ఆవాలు, జీలకర్ర - 1/4 టీ.స్పూ.
ఇంగువ - చిటికెడు
కరివేపాకు - 1 రెబ్బ
మినప్పప్పు - 1 టీ.స్పూ.
పల్లీలు - 2 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
నూనె - 3 టీ.స్పూ.
తయారు చేసేదిలా
అన్నం పొడి పొడిగా ఉండేట్టు వండి చల్లార్చుకోవాలి. మిరియాలను బరకగా పొడి చేసుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. అది కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక మినప్పప్పు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, పల్లీలు వేసి కొద్దిగా వేపాలి. తర్వాత దింపి నిమ్మరసం, మిరియాల పొడి వేసి కలిపి అన్నంలో వేయాలి. తగినంత ఉప్పు వేసి మొత్తం కలియబెట్టి మూత పెట్టాలి. పది నిమిషాల తర్వాత సర్వ్ చేయాలి. ఇందులో మిరియాల పొడి నచ్చినట్టుగా ఎక్కువ తక్కువా వేసుకోవచ్చు. నిమ్మరసంతో కాకుండా చింతపండు పులుసుతో చేసే పులిహోరలో కూడ కొంచెం ఎండుమిరపకాయలు తగ్గించి మిరియాలు పొడి చేసి కలిపి మిరియం పులిహోర చేసుకోవచ్చు.

0 comments:

Post a Comment