Wednesday, November 20, 2013

బెంగాలీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ

బెంగాలీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కావల్సిన పదార్థాలు:
బంగాళ దుంపలు : 2 (పొట్టు తొతలగించి మీడియం సైజ్ లో కట్ చేసి పెట్టుకోవాలి)
ఆకుకూర: కొద్దిగా (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
క్యారెట్: 1 (సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
వంకాయ: 1 (మీడియం సైజ్, కట్ చేసుకోవాలి )
మునక్కాడలు: 2 (మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి)
పచ్చి బటానీలు: ½cup
అల్లం: 1 మీడియం సైజ్ (తురుముకోవాలి)
కళా జీర (ఉల్లిపాయ విత్తనాలు) : 2tbsp(పొడి చేసుకోవాలి)
ఉల్లిపాయ విత్తనాలు: 1tsp
పసుపు: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: 2tbsp
నీళ్ళు: ½cup
తయారుచేయు విధానం:
1. ముందుగా కట్ చేసి పెట్టుకొన్న కూరగాయ ముక్కలన్నింటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే బంగాళదుంప ముక్కలను ఉప్పునీటిలో కొద్దిసేపు నానబెట్టుకోవాలి .
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో ఒక చెంచా ఉల్లిపాయ విత్తనాలు వేయాలి.
3. ఈ విత్తనాలు వేగడం మొదలుపెట్టాక అందులో అల్లం తురుము వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
4. తర్వాత కూరగాయ ముక్కలను ఒక దాని తర్వాత ఒకటి వేస్తూ 4-5నిముషాలు మీడియం మంట మీద వేగించుకవోాలి.
5. ఇప్పుడు అందులో కట్ చేసిన ఆకుకూర తరుగు, పసుపు పౌడర్ మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.
6. మీడియం మంట పెట్టి 5-10నిముషాలు ఉడికించుకోవాలి.
7. తర్వాత అవసరం అయినంత మేర నీళ్ళు పోసి, మూతపెట్టి 10నిముషాలు ఉడికించుకోవాలి.
8. వెజిటేబుల్ ముక్కలు మెత్తగా ఉడికినవలో లేదో నిర్ధారించుకొని, పూర్తిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే బెంగాలీ స్టైల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ . ఈ అద్భుతమైన వంటను రోటీ లేదా పరాటాలో సర్వ్ చేయండి.

0 comments:

Post a Comment