Thursday, November 14, 2013

'' బీరకాయ '' తొక్కు పచ్చడి


కావలసిన పదార్ధాలు:
బీరకాయ పొట్టు: 1 కప్పు
మినపపప్పు- 2 టీస్పూన్లు
జీలకర్ర -1/2 స్పూను
ధనియాలు- 1/2 స్పూను
ఎండుమిర్చి - 6 నుంచి 8వరకు
వెల్లుల్లి రెబ్బలు- 2
చింతపండు- కొద్దిగా నీళ్ళలో నానేసి
ఉప్పు- సరిపడినంత
తయారు చేసే విధానం:
బీరకాయలను బాగా కడిగి చివర్లు కోసేసి తొక్కు తీసి పెట్టుకోవాలి. బాణలిలో ఒక టీస్పూన్‌ నూనె వేసి మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి దోరగా వేయించుకోవాలి. అవి తీసి పక్కన పెట్టుకొని బాణలిలో మరో రెండు టీస్పూన్ల నూనె వేసి బీరకాయ తొక్కులను మెత్తబడే వరకూ వేయించాలి. మిక్సర్‌లో వేయించిపెట్టుకున్న పోపు గింజలను వేసి పొడి చేసుకోవాలి. ఆ పొడిలో వేయించిన బీర పొట్టునుచ చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మెత్తగా చేసుకోవాలి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తింటే రుచిగా ఉంటుంది.

0 comments:

Post a Comment