Thursday, November 14, 2013

* మసాలా ఇడ్లీ

కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ - పావు కేజీ, వేరుశనగలు - 25గ్రా, జీడిపప్పు - 15గ్రా, పెరుగు - ఒక కప్పు, వంటసోడా - చిటికెడు, నూనె - సరిపడా, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - ఒక కట్ట, ఆవాలు - అర స్పూన్, జీలకర్ర - అర స్పూన్, శనగపప్పు- అర స్పూన్, మినపపప్పు - అర స్పూన్, ఉప్పు - తగినంత.

తయారుచేయు విధానం
ముందుగా ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక పోపు దినుసులు, పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. తరువాత జీడిపప్పు, పల్లీలు వేసి వేయించుకోవాలి. తరువాత రవ్వ కూడా వేసి వేయించి దింపుకోవాలి. ఇందులో పెరుగు, ఉప్పు, వంట సోడా, కొద్దిగా నీళ్లు పోసి ఇడ్లీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని గరిటెతో మిశ్రమాన్ని వేసుకోవాలి. నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతే... మసాలా ఇడ్లీ రెడీ. పల్లీల చట్నీతో గానీ, కొబ్బరి చట్నీతో గానీ తింటే ఈ ఇడ్లీలు రుచిగా ఉంటాయి.

0 comments:

Post a Comment