Friday, November 1, 2013

వంటింటి చిట్కాలు

కుక్కర్‌ లో పప్పు ఉడికించినప్పుడు ఒక్కోసారి పప్పులో నీరుఎక్కువైపోతుంది. ఆ వేడి వేడి పప్పుతేరును చపాతి పిండిలో పోసి నానబెడితే
పప్పులో ఉన్న పోషకవిలువలు వృధాకావు, చపాతీలు మృదువుగా వస్తాయి.
కూరగాయలు ఉడికించేటప్పుడు కొంచెం నిమ్మరసం చల్లితే రంగు మారకుండా ఉంటాయి.
సూపుల్లో కొన్ని చుక్కల నిమ్మరసం వేస్తే మంచి రుచి వస్తుంది.
కూరలలో పసుపు ఎక్కువయితే కూర ఉంచిన పాత్రపై ఒక శుభ్రమైన బట్టను
పరచినట్టుగా కడితే అధిక పసుపును అది పీల్చేసుకుంటుంది.
  కూరల్లోగాని, పప్పులోగాని ఉప్పు ఎక్కువయినపుడు కాస్త నిమ్మరసం పిండాలి.
 చపాతీ పిండిని పాలు లేదా గోరువెచ్చని నీళ్ళు లేదా కాస్త నూనె కలిపి
గంటపాటు నానబెడితే చపాతీలు మృదువుగా వస్తాయి.
చపాతి పిండిలో ఉడికిన బంగాళదుంపను బాగా కలిపి, ఆ పిండితో చపాతీలు చేస్తే,
చపాతీలు మృదువుగా ఎక్కువసేపు ఉంటాయి
చపాతీలు వత్తేటప్పుడు మధ్యలో కాస్త నూనెవేసి మడతలతో చేసి హాట్ ప్యాక్‌లో
ఉంచితే ఆరేడుగంటలపాటు మెత్తగా ఉంటాయి.
గులాబ్ జాం తాయారు చేసేందుకు పిండి కలిపేటప్పుడు పిండిలో కాస్త పన్నీరు
కలపండి. అవి మృదువుగా రుచిగా ఉంటాయి.
గులాబ్ జాంలు చేసే సమయంలో కాసిని జీడిపప్పు కూడా గులాబ్ జాంలు చేసే
ఉండలకు కలిపారంటే, అవి మృదువుగా ఉంటాయి. మంచి రుచిగా ఉంటాయి.
గారెల పిండిలో, పులిసిన పెరుగు ఒక కప్పు, లేదా రెండు చెంచాల మైదా
వేశారంటే గారెలు మృదువుగా, టేస్టీగా ఉంటాయి.
గోధుమలు పిండి పట్టించే ముందు శుభ్రంగా కడిగి ఎండబోసి పట్టిస్తే పిండి
మెత్తగా ఉంటుంది. ఆ పిండితో చేసిన రొట్టెలు ఎంతో మృదువుగా ఉంటాయి.

0 comments:

Post a Comment