Thursday, November 14, 2013

* కార్న్‌ మంచూరియా

* కార్న్‌ మంచూరియా
సాయంత్రం సమయంలో లేదా బయట వర్షం పడుతు న్నప్పుడు ఏదైనా తింటుం టే... ఆహా ఆ అనుభూతిని చెప్పడానికి మాటలు రావనుకోండి. సాధారణంగా ఇలాంటప్పుడు అందరూ పకోడీలు, బజ్జీల వంటి స్నాక్‌ ఫుడ్‌కు ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాంటిదే కొంచెం కొత్తగా, వెరైటీగా ఇంకొంచెం భిన్నంగా బేబి కార్న్‌తో మంచూరియా ఎలా చేయాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్ధాలు: తాజా బేబి కార్న్‌ 5
మొక్కజోన్న పిండి - అరకప్పు
బియ్యం పిండి - పావు కప్పు
కారం సరిపడా
అల్లంవెల్లుల్లి పేస్టు - 2 స్పూన్లు
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి సరిపడా
ఉల్లిపొర కట్ట - ఒకటి
ఉల్లిపాయ ఒకటి (సన్నగా తరగాలి)
వెల్లుల్లి పాయ ముక్కలు
సోయాసాస్‌
టొమాటో సాస్‌
తయారు చేసే విధానం: ముందుగా తాజా బేబి కార్న్‌ను చిన్న చిన్న ముక్కలుగా ఒకే సైజులో తరిగి, ఉప్పు నీటితో ఉడికించి తర్వాత నీరు మొత్తం ఇంకిపోయేలా వడకట్టి పక్కడ ఆరబెట్టు కోవాలి. ఈలోగా... ఓపాత్రలో మొక్కజొన్న పిండి, బియ్యంపిండి, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద సరిపడా ఉప్పును వేసి బజ్జీల పిండికి ఉపయోగించే మిశ్రమంలా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టౌ పై బాణలి పెట్టి ఈ మిశ్రమంలో నానబెట్టుకున్న బేబి కార్న్‌ను మంచి బజ్జీల మాదిరి వేయించుకోవాలి. స్టౌ పై మరో బాణలి పెట్టి తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉల్లి పొర ముక్కలు దోరగా వేయించుకోవాలి.
ఇప్పుడు ముందుగా బజ్జీలుగా వేయించి పెట్టుకున్న బేబికార్న్‌ ముక్కలను ఒక్కోటిగా వేసి అటూ ఇటూ కలియ బెట్టాలి. ఆ తర్వాత దీనిని వేరే ప్లేట్‌లోకి తీసుకొని వాటి పై సో యాసాస్‌, చిల్లీసాస్‌, టొమాటో సాస్‌ చల్లి వేడి వేడిగా సర్వ చేసుకోవాలి. దీని పైన తరిగిన ఉల్లిపాయలు వేసి, కొద్దిగా నిమ్మరసం చల్లి తింటే చాలా రుచికరంగా ఉంటుంది.

0 comments:

Post a Comment