Friday, November 29, 2013

మసాలా మిర్చి


కావల్సిన పదార్థాలు:
పొడవాటి పచ్చిమిర్చి : 5-6
పసుపు: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి :1tsp
చిన్న పచ్చిమిర్చి : 2
ఆమ్చూర్ పొడి: 1tsp
ఆవాలు : ½tsp
ఉప్పు: రుచికిసరిపడా
నిమ్మరసం: 1tsp
నూనె: 2tsp
తయారుచేయు విధానం:
1. ముందుగా పొడవాటి పచ్చిమిర్చి మరియు చిన్న పచ్చిమిర్చిను మీకు కావల్సిన సైజ్ లో కట్ చేసుకోండి. ఇంకా మీకు అవసరం అయితే వాటిని మద్యకు కట్ చేసుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు వేసి చిటపటలాడాకా అందులో కట్ చేసి పెట్టుకొన్న పచ్చిమిర్చిని కూడా వేయండి.
3. మీడియం మంట పెట్టి వేగించాలి. వేగించేటప్పుడే అందులో ఉప్పు మరియు పుసు కూడా వేయాలి.
4. ఇవి వేసిన తర్వాత మరో 5నిముషాలు పచ్చిమిర్చి మెత్తబడే వరకూ వేగించుకోవాలి.
5. పచ్చిమిర్చి మెత్తగా వేగిన తర్వాత అందులో కారం, ధనియాల పొడి, ఆమ్చూర్(మామిడి పొడి) వేసి బాగా మిక్స్ చేయాలి.
6. ఇప్పుడు అందులో నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేస్తూ వేగించడం వల్ల మిర్చికీ మసాలాలన్ని బాగా పడుతాయి.
7. ఇప్పుడు మిర్చీ పూర్తిగాఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే మిర్చి మసాలా రెడీ. ఈ మిర్చి మాసాలాను రోటీ లేదా రైస్ తో పాటు తినవచ్చు.

Wednesday, November 27, 2013

గ్రీన్ బీన్స్... పచ్చిబఠాణి, క్యారెట్‌లతో

కావలసిన పదార్థాలు: బీన్స్ - పావుకేజీ, క్యారెట్స్ - వందగ్రాములు, పచ్చిబఠాణి - వంద గ్రాములు, పచ్చిమిర్చి - 2, మిరియాలపొడి - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, నూనె - 1 టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు - అరకప్పు, కరివేపాకు - 4 రెబ్బలు, (తాలింపుకోసం) మినప్పప్పు + ఆవాలు + జీలకర్ర - 1 టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, పచ్చికొబ్బరి కోరు - అరకప్పు.

తయారుచేసే విధానం: బీన్స్, క్యారెట్ సన్నని ముక్కలుగా తరగాలి. కడాయిలో నూనె వేసి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేగించాలి. తర్వాత బీన్స్, క్యారెట్ తరుగు, పచ్చిబఠాణి కూడా వేసి సన్నని మంటపై మగ్గనివ్వాలి. ఉప్పు, మిరియాలపొడి వేసి రెండు నిమిషాల తర్వాత కొబ్బరికోరు, కొత్తిమీర తరుగు కలిపి దించేయాలి. ఈ కూర పరాటాల్లో చాల బాగుంటుంది.
గ్రీన్ బీన్స్... చిన్న మెంతికూరతో
కావలసిన పదార్థాలు:బీన్స్ - పావుకేజీ, చిన్నమెంతికూర తరుగు - అర కప్పు, అల్లం తరుగు -1 టీ స్పూను, పచ్చిమిర్చి (నిలువుగా తరగాలి) - 2, కారం - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, నూనె - 2 టీ స్పూన్లు. గరం మసాల - అర టీ స్పూను.

తయారుచేసే విధానం:బీన్స్‌ని సన్నని ముక్కలుగా తరిగి, ఒక కప్పు నీటిలో 5 నిమిషాలు ఉడికించి వార్చేయాలి. కడాయిలో నూనె వేసి అల్లం, కరివేపాకు, మిర్చి, మెంతికూర తరుగు వేగించాలి. తర్వాత ఉప్పు, కారం, ఉడికించిన బీన్స్ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటేసి సన్నని మంటపై రెండు నిమిషాలు ఉంచాలి. మసాలపొడి, కొత్తిమీర తరుగు వేసి దించేయాలి. ఈ కూర మెంతి సువాసనతో ఉండి, అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

గ్రీన్ బీన్స్... నువ్వులతో

కావలసిన పదార్థాలు:బీన్స్ - పావుకేజీ, వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, వేగించిన నువ్వులు - వందగ్రాములు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్ స్పూను, మిరియాలపొడి - అర టీ స్పూను, మసాలపొడి - అర టీ స్పూను.
తయారుచేసే విధానం:బీన్స్‌ని కట్ చేయకుండా తొడిమల్ని , ఈనెల్ని తీసి ఉప్పు కలిపిన నీటిలో కొద్దిసేపు (హాఫ్ బాయిల్) ఉడికించి, నీరు ఓడ్చి ఆరబెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసి వెల్లుల్లి పేస్టు వేగించి సగం ఉడికిన బీన్స్‌ని వేసి సన్నని మంటపై మూతపెట్టి మగ్గనివ్వాలి. ముప్పావుభాగం వేగాక (మరికొద్ది) ఉప్పు, మిరియాలపొడి వేసి కలపాలి. తర్వాత నువ్వులు వేసి మూతపెట్టి రెండు నిమిషాలయ్యాక మసాలపొడి చల్లి దించేయాలి. బీన్స్‌నువ్వుల వేపుడు అన్నంతో నంజుకున్నా, కలుపుకున్నా చాలా రుచిగా ఉంటుంది.

Friday, November 22, 2013

సజ్జముద్దలు


సజ్జముద్దలు
కావలసినవి:
సజ్జ పిండి - 2 కప్పులు
బెల్లం తరుగు - కప్పు
నీళ్లు - ముద్ద చేయడానికి

తగినన్ని
ఏలకుల పొడి - చిటికెడు
డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, కిస్‌మిస్) - 2 టీ స్పూన్లు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
తయారి:
నీళ్లు వేడి చేసి, సజ్జ పిండిలో కలిపి ముద్ద చేయాలి. కావల్సిన పరిమాణంలో ముద్ద తీసుకొని, రొట్టె చేసి, పెనం మీద రెండువైపులా కాల్చాలి.
వేడిగా ఉన్నప్పుడే నీళ్లు అద్దుకుంటూ చేత్తో ముక్కలు ముక్కలు చేయాలి. తర్వాత రోట్లో వేసి దంచాలి.
పెనం మీద నెయ్యి, బెల్లం, ఏలకుల పొడి, రొట్టె ముక్కల పొడి వేసి కొద్దిగా వేయించి, దించాలి.
కావలసిన పరిమాణం రొట్టెముక్కల పొడిని తీసుకొని, బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌లు అద్దుకుంటూ ముద్దలు చేయాలి.


వెజ్ మంచూరియా

కావలసినవి:
క్యాబేజీ తురుము, క్యారట్ తురుము, పచ్చిమిర్చి తరుగు - 2 కప్పులు, ఉల్లికాడల తరుగు - 1 కప్పు, అల్లం, వెల్లుల్లి తరుగు, సోయాసాస్ - 2 టీస్పూన్లు, కార్న్‌ఫ్లోర్ - 6 టీ స్పూన్లు, మిరియాలపొడి, పంచదార - టీ స్పూన్, అజినమోటో - చిటికెడు, నూనె - డీప్ ఫ్రై కి సరిపడా, టోమాటో సాస్ - రెండు స్పూన్లు, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత
తయారి:
ఒక గిన్నెలో క్యాబేజీ తురుము, క్యారట్ తురుము, ఉల్లికాడలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కార్న్‌ఫ్లోర్, ఉప్పు వేసి ముద్దలా కలుపుకోవాలి. బాణలిలో నూనె కాగాక మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసి నూనెలో వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. వేరే బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగాక అందులో అల్లం వెల్లుల్లి తరుగు వేసి కలపాలి. తరవాత వేయించుకున్న మంచూరియాలను వేసి కలుపుతూ పంచదార, అజినమోటో, మిరియాలపొడి, రెండు స్పూన్ల కార్న ఫ్లోర్ (నీళ్లల్లో కలిపినది), సోయాసాస్, చిటికెడు ఉప్పు వేసి అయిదారు నిమిషాలు స్టౌ మీద వుంచి దించేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చెయ్యాలి. ఇది టొమాటో సాస్‌తో తింటే బావుంటుంది.

మిర్చి కా సాలన్

మిర్చి కా సాలన్
కావలసిన వస్తువులు:
మిరపకాయలు – 250 గ్రాములు
చింతపండు పులుసు – 1/4 కప్పు
పసుపు – 1/4 టీస్పూన్
కారం పొడి – 1 టీస్పూన్
ఉప్పు – తగినంత
కొబ్బరి పొడి – 3 టేబుల్ స్పూన్స్
జీలకర్ర పొడి – 1/2 టీస్పూన్
మెంతి పొడి – 1/4 టీస్పూన్
పల్లీల పొడి – 2 టేబుల్ స్పూన్స్
నువ్వుల పొడి – 2 టేబుల్ స్పూన్స్
ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు – 2 టేబుల్ స్పూన్స్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
జీలకర్ర – 1/4 టీస్పూన్
గరం మసాలా పొడి – 1 టీస్పూన్
మెంతులు – చిటికెడు
నూనె – 4 టేబుల్ స్పూన్స్
ఈ కూర కోసం బజ్జీ మిరపకాయలను వాడాలి. రుచి బావుంటుంది. మిరపకాయలను మధ్యలో చాకుతో కాటు పెట్టి గింజలు తీసేయాలి. ఇలా చేయడం వల్ల మిరపకాయలలో కారం తగ్గుతుంది. ప్యాన్‌లో నూనె వేడి చేసి మిరపకాయలను కొద్దిగా మెత్తబడేవరకు వేయించాలి. ఒక గిన్నెలో చింతపండు పులుసు, వేయించిన ఉల్లిపాయలు,అల్లం వెల్లుల్లి పేస్ట్, కారంపొడి, కొబ్బరి పొడి, పసుపు, ఉప్పు, పల్లీలపొడి, నువ్వుల పొడి, జీలకర్ర , మెంతిపొడి వేసి బాగా కలిపి ఉంచాలి. ఇందాక మిరపకాయలు వేయించిన ప్యాన్ లోనే నూనె వేడి చేసి జీలకర్ర, మెంతులు వేసి ఎర్రబడ్డాక పొడులన్నీ కలిపిన చింతపండు పులుసు కప్పుడు నీళ్లు పోసి నిదానంగా మరిగించాలి. పులుసు, పొడులు ఉడికి కమ్మటి వాసన వస్తుండగా వేయించిన మిరపకాయలు, గరం మసాలా పొడి వేసి మరో ఐదునిమిషాలు మసాలాలో ఉడకనిచ్చి నూనె తేలగానే దింపేయాలి. కమ్మటి , ఘాటైన మిర్చి కా సాలన్ తయారైంది. ఈజీగా ఉంది కదా.. ఈ కూర బిరియాని. వెజ్ ఫ్రైడ్ రైస్, పులావ్ లకు, రొట్టెలకు కూడా బావుంటుంది.

Wednesday, November 20, 2013

బెంగాలీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ

బెంగాలీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కావల్సిన పదార్థాలు:
బంగాళ దుంపలు : 2 (పొట్టు తొతలగించి మీడియం సైజ్ లో కట్ చేసి పెట్టుకోవాలి)
ఆకుకూర: కొద్దిగా (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
క్యారెట్: 1 (సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
వంకాయ: 1 (మీడియం సైజ్, కట్ చేసుకోవాలి )
మునక్కాడలు: 2 (మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి)
పచ్చి బటానీలు: ½cup
అల్లం: 1 మీడియం సైజ్ (తురుముకోవాలి)
కళా జీర (ఉల్లిపాయ విత్తనాలు) : 2tbsp(పొడి చేసుకోవాలి)
ఉల్లిపాయ విత్తనాలు: 1tsp
పసుపు: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: 2tbsp
నీళ్ళు: ½cup
తయారుచేయు విధానం:
1. ముందుగా కట్ చేసి పెట్టుకొన్న కూరగాయ ముక్కలన్నింటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే బంగాళదుంప ముక్కలను ఉప్పునీటిలో కొద్దిసేపు నానబెట్టుకోవాలి .
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో ఒక చెంచా ఉల్లిపాయ విత్తనాలు వేయాలి.
3. ఈ విత్తనాలు వేగడం మొదలుపెట్టాక అందులో అల్లం తురుము వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
4. తర్వాత కూరగాయ ముక్కలను ఒక దాని తర్వాత ఒకటి వేస్తూ 4-5నిముషాలు మీడియం మంట మీద వేగించుకవోాలి.
5. ఇప్పుడు అందులో కట్ చేసిన ఆకుకూర తరుగు, పసుపు పౌడర్ మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.
6. మీడియం మంట పెట్టి 5-10నిముషాలు ఉడికించుకోవాలి.
7. తర్వాత అవసరం అయినంత మేర నీళ్ళు పోసి, మూతపెట్టి 10నిముషాలు ఉడికించుకోవాలి.
8. వెజిటేబుల్ ముక్కలు మెత్తగా ఉడికినవలో లేదో నిర్ధారించుకొని, పూర్తిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే బెంగాలీ స్టైల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ . ఈ అద్భుతమైన వంటను రోటీ లేదా పరాటాలో సర్వ్ చేయండి.

Monday, November 18, 2013

. జీరా రైస్‌



కావలసిన వస్తువులు:
‌‌
అన్నము - అర కిలో.
జీలకర్ర - మూడు టీ స్పూన్లు.
‌‌
పచ్చి మిర్చి - ‌మూడు.
ఉప్పు. - రుచికి తగినంత.
నూనె - ఐదు లేక ఆరు టీ స్పూన్లు.
జీడి పప్పు మరియు బఠాణీ - రుచికి కావాలనుకుంటే వేసుకోవచ్చు.

తయారు చేసే విధానం:

ముందుగా అన్నం వండుకొని చల్లార బెట్టాలి . ఒక బాణీ తీసుకుని అందులో ఐదు లేక ఆరు టీ స్పూన్లు వేసి కాగనివ్వాలి. అందులో మూడు టీస్పూన్ల జీలక్ర్ర వేసి వేగ నివ్వాలి. తరువాత తరిగిం అపచ్చిమిర్చి వేసి వేగ నివ్వాలి. రుచికి కావాలి అనుకుంటే జీడిపప్పు మరియు ఉడికించిన బఠాణి వేసుకోవచ్చు. వాటిని కూడా వేగనిచ్చి, ఇప్పుడు అన్నం అందులో వేసుకోవాలి. అన్ని బాగా కలిసే లాగా కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒక్క నిమిషం గ్యాసు మీద ఉంచి దించుకోవడమే. చూశారా జీరా రైస్చేయడం చాలా సులువు కదా...

Sunday, November 17, 2013

కొత్తిమీర 'క్యూబ్స్'


కావలసిన పదార్థాలు: శనగపిండి - 1 కప్పు, కొత్తిమీర తరుగు - ముప్పావు కప్పు, నీరు - 1 కప్పు, బియ్యప్పిండి, నిమ్మరసం - 1 టేబుల్ స్పూను చొప్పున, పంచదార - అర టీ స్పూను, అల్లం పచ్చిమిర్చి పేస్టు - 1 టీ స్పూను, వేగించిన నువ్వులు - 2 టీ స్పూన్లు, పసుపు - పావు టీ స్పూను, గరం మసాల - పావు టీ స్పూను, ఇంగువ - చిటికెడు, నూనె - వేగించడానికి సరిపడా, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో శనగపిండి, కొత్తిమీర తరుగు, పసుపు, పంచదార, నిమ్మరసం, అల్లంమిర్చి పేస్టు, గరం మసాల, ఇంగువ, బియ్యప్పిండి, నువ్వులతో పాటు 2 టీ స్పూన్ల నూనె వేసి బాగా కలపాలి. చిక్కగా ఉండేలా కొంచెమే నీరు పోసి కలుపుకోవాలి. నూనె రాసిన కడాయిలో ఈ మిశ్రమాన్ని దళసరిగా పరిచి, 20 నిమిషాల పాటు (కత్తితో గుచ్చితే తడి అంటనంతవరకు) మంటపై ఉడికించాలి. చల్లబడ్డ తర్వాత కత్తితో క్యూబ్స్‌గా కట్ చేసుకుని పెనంపై అన్ని వైపులా కాల్చుకోవాలి. వీటికి టమోటా సాస్ మంచి కాంబినేషన్.

సొరకాయ అప్పాలు



కావలసిన పదార్థాలు:
బియ్యప్పిండి - 3 కప్పులు, గింజలు లేని సొరకాయ తురుము - 1 కప్పు, పచ్చిమిర్చి పేస్టు - 2 టీ స్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర స్పూను, కరివేపాకు తరుగు - 1 టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు - అరకప్పు, నువ్వులు, జీలకర్ర - 2 స్పూన్ల చొప్పున, ఉప్పు - రుచికి తగినంత, వంటసోడా - చిటికెడు, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం :
ఒక పాత్రలో సొరకాయ తురుము, బియ్యప్పిండి, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, సోడా, నువ్వులు, జీలకర్ర వేసి (అవసరం అనుకుంటే కొద్ది నీరు చిలకరించి) చపాతి పిండిలా ముద్ద చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుని నూనె రాసిన ప్లాస్టిక్ పేపరు మీద పలచగా పూరీల్లా వత్తుకుని నూనెలో దోరగా వేగించాలి. కమ్మని రుచి గల ఈ అప్పాలు పది రోజుల వరకు నిలువ ఉంటాయి.

మిరియం, నిమ్మ పులిహోర

మిరియం, నిమ్మ పులిహోర
అన్నం - 3 కప్పులు
నిమ్మకాయ - 1
పసుపు - 1/4 టీ.స్పూ.

పచ్చిమిర్చి - 3
మిరియాలు - 6
ఆవాలు, జీలకర్ర - 1/4 టీ.స్పూ.
ఇంగువ - చిటికెడు
కరివేపాకు - 1 రెబ్బ
మినప్పప్పు - 1 టీ.స్పూ.
పల్లీలు - 2 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
నూనె - 3 టీ.స్పూ.
తయారు చేసేదిలా
అన్నం పొడి పొడిగా ఉండేట్టు వండి చల్లార్చుకోవాలి. మిరియాలను బరకగా పొడి చేసుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. అది కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక మినప్పప్పు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, పల్లీలు వేసి కొద్దిగా వేపాలి. తర్వాత దింపి నిమ్మరసం, మిరియాల పొడి వేసి కలిపి అన్నంలో వేయాలి. తగినంత ఉప్పు వేసి మొత్తం కలియబెట్టి మూత పెట్టాలి. పది నిమిషాల తర్వాత సర్వ్ చేయాలి. ఇందులో మిరియాల పొడి నచ్చినట్టుగా ఎక్కువ తక్కువా వేసుకోవచ్చు. నిమ్మరసంతో కాకుండా చింతపండు పులుసుతో చేసే పులిహోరలో కూడ కొంచెం ఎండుమిరపకాయలు తగ్గించి మిరియాలు పొడి చేసి కలిపి మిరియం పులిహోర చేసుకోవచ్చు.

Thursday, November 14, 2013

మసాలా ఇడ్లీ


మిగిలిన ఇడ్లీలు: 8
పచ్చి మిరపకాయలు: 2(మద్యకు కట్ చేసుకోవాలి)
అల్లం: చిన్న ముక్క(తురుము)
ఉల్లిపాయ: 1(చిన్న ముక్కలుగా కత్తిరించాలి)

టమోటా: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీర: (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పసుపు: 1/4tsp
రెడ్ చిల్లి పౌడర్: 1/2tsp
కొత్తిమీర పొడి: 1tsp
సోపు గింజలు పొడి: 1/2tsp
గరం మసాలా పొడి : ఒక చిటికెడు (అవసరం అయితే)
నిమ్మరసం: 1/2tbsp(అవసరం అనుకుంటే)
ఆయిల్: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆవాలు:1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి, తర్వాత అందులో ఆవాలు వేసి చిటపటలాడాక, అందులో కరివేపాకు కూడా వేసి రెండు నిముషాలు వేగించాలి.

2. తర్వాత అందులో పచ్చిమిర్చి, అల్లం తురుము వేసి ఫ్రై చేయాలి.

3. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీదు ఐదు నిముషాల పాటు వేగించుకోవాలి. తర్వాత వెంటనే పసుపు, కారం, ధనియాలపొడి, సోంపు గింజలు, గరం మసాలా పౌడర్ వేసి మిక్స్ చేస్తూ వేగించాలి. 4. తర్వాత అందులోనే తరిగిన టమోటో ముక్కలు వేసి మరో 5నిముషాలు టమోటోలు మెత్తబడేవరకూ వేగించుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఇడ్లీలను ముక్కలుగా చేసుకోసి అందులో వేయాలి. మసాలా అంతా ఇడ్లీలలకు బాగా పట్టేలా నిధానంగా మిక్స్ చేస్తూ, ఫ్రై చేసుకోవాలి.
5. చివరగా అందులో నిమ్మరసం వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. క్రిందికి దింపుకొనే ముందు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయాలి.

ఉసిరి

కార్తీకంలో ఉసిరిని తప్పకుండా తినాలంటారు.
ఉసిరి ఇంటికి సిరిసంపదలు తీసుకొస్తుందంటారు.
ఉసిరిని అరచేతిలో ఉంచుకుంటే చాలు ఆరోగ్యం వరిస్తుందంటారు.
సరిలేని గొప్పదనం ఉసిరిది!
కార్తీకం స్పెషల్‌గా ఉసిరి వంటలు ఆరగించండి, ఆనందించండి...
ఉసిరి రైస్
కావలసినవి:
బియ్యం - పావు కేజీ
ఉసిరికాయలు - పది
పసుపు - టీ స్పూను
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
నువ్వులపొడి - 2 టీ స్పూన్లు
జీడిపప్పు - 4 టీ స్పూన్లు
ఎండుమిర్చి - 4
పచ్చిమిర్చి - 4
కరివేపాకు - రెండు రెమ్మలు
కొత్తిమీర - కట్ట
శనగపప్పు - టీ స్పూను
మినప్పప్పు - టీ స్పూను
ఆవాలు - టీ స్పూను
ఇంగువ - చిటికెడు
తయారి:
అన్నం వండుకుని బౌల్‌లో ఆరబెట్టాలి. ఉసిరికాయలను చిన్న ముక్కలుగా తరిగి అందులో ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచాలి. బాణలిలో నూనె కాగిన తరువాత పసుపు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి వేగుతుండగా పచ్చిమిర్చి, నువ్వులపొడి, కరివేపాకు, జీడిపప్పు, దంచిన ఉసిరికాయ ముక్కలు, ఇంగువ వేసి దోరగా వేయించాలి. తరవాత దీనిని ఆరబెట్టిన అన్నంలో కలుపుకోవాలి.
ఉసిరి పచ్చడి
కావలసినవి:
ఉసిరికాయలు - పావు కేజీ
పసుపు - టీ స్పూను
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి - 5
ఎండుమిర్చి - 5
కొత్తిమీర - ఒక కట్ట
ఇంగువ - పావు టీ స్పూను
నిమ్మకాయ - సగం చెక్క
ఆవాలు - టీ స్పూను
మెంతులు - టీ స్పూను
జీలకర్ర - టీ స్పూను, నూనె - తగినంత
తయారి:
ముందుగా ఉసిరికాయలను చిన్నచిన్న ముక్కలు చేసుకోవాలి. తరిగేటప్పుడు గింజలు తీసేయాలి. అందులో పసుపు వేసి బాగా కలిపి రెండు రోజులు గట్టి మూత ఉన్న సీసాలో ఉంచేయాలి. మూడవ రోజు వాటిని తీసి మెత్తగా చేసి అందులో ఉప్పు వేసి మిక్సీలో గ్రైండ్ చేయాలి. బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె కాగిన తరవాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించి, చల్లారాక గ్రైండ్ చేయాలి. ఉసిరిముద్దలో ఈ పొడి, నిమ్మరసం, ఇంగువ వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
ఉసిరి జామ్
కావలసినవి:
ఉసిరికాయలు - 100 గ్రా., పంచదార - 50 గ్రా., నూనె - వేయించుకోవడానికి తగినంత, నిమ్మరసం - టీ స్పూను, జీడిపప్పు - 10 గ్రా., బాదంపప్పులు - 10 గ్రా., కిస్‌మిస్ - 10 గ్రా.
తయారి:
ముందుగా ఉసిరికాయలను దోరగా వేయించుకుని చల్లారిన తరువాత గింజలు తీసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పంచదార వేసి కొద్దిగా నీరు పోసి తీగపాకం పట్టాలి. అది కొంచెం దగ్గర పడ్డాక ఉసిరి పేస్ట్ వేసి గట్టిపడేవరకు కలుపుతూ ఉండాలి. తరువాత నిమ్మరసం వేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చివరగా జీడిపప్పు, బాదంపప్పు, కిస్‌మిస్‌లతో గార్నిష్ చేయాలి.
ఉసిరికాయపప్పు
కావలసినవి:
కందిపప్పు - 100 గ్రా.
ఉసిరికాయలు - 10, నూనె - తగినంత
పసుపు - చిటికెడు, ఇంగువ - చిటికెడు
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి - 2
ఎండుమిర్చి - 4
ఆవాలు - టీ స్పూను
జీలకర్ర - టీ స్పూను
మినప్పప్పు - టీ స్పూను
కరివేపాకు - రెండు రెమ్మలు
కొత్తిమీర - రెండు రెమ్మలు
తయారి:
ముందుగా ఉసిరికాయలను ముక్కలు చేసుకోవాలి. కందిపప్పు, ఉసిరిముక్కలను విడివిడిగా ఉడకబెట్టాలి. బాణలిలో నూనె వేడయ్యాక మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేగిన తరవాత పక్కన పెట్టుకున్న ఉడికించుకున్న ఉసిరిముక్కలను అందులో వేసి ఒకసారి దోరగా వేయించాలి. చివరగా ఉడికించుకున్న పప్పు, ఉప్పులను అందులో వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
ఉసిరి ఆవకాయ
కావలసినవి:
ఉసిరికాయలు - పావు కేజీ
కారం - 50 గ్రా.
ఆవపిండి - 50 గ్రా.
ఉప్పు - తగినంత
పల్లీ నూనె లేదా పప్పు నూనె - 100 గ్రా.
నిమ్మరసం - మూడు టీ స్పూన్లు
తయారి:
ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తడి పోయేవరకు ఆరనివ్వాలి. తరవాత వాటికి చిన్నగా గాట్లు పెట్టాలి. స్టౌ మీద బాణలిలో నూనె సన్న సెగ మీద కాగిన తరవాత ఈ ఉసిరికాయలను అందులో వేసి మెత్తబడేవరకు వేయించాలి. తరవాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారిన తరవాత అందులో కారం, ఆవపిండి, ఉప్పు, నిమ్మరసం వేయాలి. అదే బాణలిలో కొద్దిగా నూనె కాగిన తరవాత అందులో ఇంగువ వేసి దింపి, చల్లారిన తరవాత పచ్చడిలో పోసి బాగా కలుపుకోవాలి. ఇది ఒక రోజు ఊరిన తరవాత తింటే బావుంటుంది.
మెంతి ఉసిరి
కావలసినవి:
ఉసిరికాయలు - పావు కేజీ
మెంతులు - రెండు టీ స్పూన్లు
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
ఎండుమిర్చి - 50 గ్రా.
మినప్పప్పు - రెండు టీ స్పూన్లు
పసుపు - చిటికెడు
ఇంగువ - చిటికెడు

తయారి:
ఉసిరికాయలను చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. గింజలు తీసేయాలి. తరువాత స్టౌమీద బాణలిలో నూనె వేడయ్యాక ఎండుమిర్చి, మెంతులు, మినప్పప్పు, పసుపు, ఇంగువ వేసి వేయించిన తరువాత చల్లార్చి పొడి చేసుకోవాలి. తరువాత ఈ పొడిని ఉసిరిముక్కలలో కలపాలి. బాణలిలో నూనె కాగాక జీలకర్ర వేయించి ఇందులో కలపాలి. చివరగా ఉప్పు వేసి మరోమారు కలిపితే మెంతి ఉసిరి బద్దలు తయారయినట్లే.



దహీ(పెరుగు) ఇడ్లీ

ఇడ్లీలు - 20
పెరుగు - 5 కప్పులు
పాలు - 2 కప్
కొత్తిమీర - కొద్దిగా(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
క్యారెట్ - 1 (తురుము)
షుగర్ - 1tbsp
ఉప్పు - రుచికి సరిపడా
పొడి చేయడం కోసం
జీడిపప్పు: 500gms
కొబ్బరి - 3 టేబుల్ స్పూన్లు (తురుము)
పచ్చిమిరపకాయలు - 4 (మద్యకు కట్ చేసుకోవాలి)
పోపుకోసం
ఆవాలు: 1tsp
కరివేపాకు - 8
ఉద్దిపప్పు - 1 స్పూన్
ఎండు మిరపకాయలు - 5
ఇంగువ - ఒక చిటికెడు
నూనె - 2 tblsp
తయారుచేయు విధానం:
1. ముందుగా మన ట్రెడిషనల్ పద్దతిలో చిన్నచిన్న ఇడ్లీలను తయారుచేసుకోవాలి. ఇడ్లీలను తయారుచేసిన తర్వాత వాటిని, మీకు నచ్చిన విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు పెరుగు మరియు పాలు వేసి ఎగ్ బీటర్ తో బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమానికి పంచదార మరియు ఉప్పు వేసి మిక్స్ చేయాలి .
3. ఇప్పుడు ఒక పాన్ లోనూనెవేసి వేడి చేసి వేడయ్యాక అందులో ఆవాలు, ఉద్దిపప్పు, రెడ్ చిల్లీ, మరియు కరివేపాకు వేయాలి. ఇవన్నీ రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులో ముందుగా కలిపి పెట్టుకొన్న పెరుగు మిశ్రమం మరియు ఇంగువ వేసి మిక్స్ చేయాలి.
5. అలాగే జీడిపప్పు పొడి, పచ్చిమిర్చి, మరియు కొబ్బరి తురుము వేసి అన్నింటిని బాగా మిక్స్ చేయాలి.
6. ఇప్పుడు ఈ పెరగు మిశ్రంలో ముందుగా తయారుచేసి పెట్టుకొన్న ఇడ్లీలను వేయాలి. వేసిన తర్వాత 15నిముషాలు నాననివ్వాలి .తర్వాత వీటిని మీ కుటుంబ సభ్యలకు సర్వ్ చేయాలి.

7. మీరు సర్వ్ చేసేటప్పుడు క్యారెట్ తురుము మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

* మసాలా ఇడ్లీ

కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ - పావు కేజీ, వేరుశనగలు - 25గ్రా, జీడిపప్పు - 15గ్రా, పెరుగు - ఒక కప్పు, వంటసోడా - చిటికెడు, నూనె - సరిపడా, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - ఒక కట్ట, ఆవాలు - అర స్పూన్, జీలకర్ర - అర స్పూన్, శనగపప్పు- అర స్పూన్, మినపపప్పు - అర స్పూన్, ఉప్పు - తగినంత.

తయారుచేయు విధానం
ముందుగా ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక పోపు దినుసులు, పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. తరువాత జీడిపప్పు, పల్లీలు వేసి వేయించుకోవాలి. తరువాత రవ్వ కూడా వేసి వేయించి దింపుకోవాలి. ఇందులో పెరుగు, ఉప్పు, వంట సోడా, కొద్దిగా నీళ్లు పోసి ఇడ్లీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని గరిటెతో మిశ్రమాన్ని వేసుకోవాలి. నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతే... మసాలా ఇడ్లీ రెడీ. పల్లీల చట్నీతో గానీ, కొబ్బరి చట్నీతో గానీ తింటే ఈ ఇడ్లీలు రుచిగా ఉంటాయి.

'' బీరకాయ '' తొక్కు పచ్చడి


కావలసిన పదార్ధాలు:
బీరకాయ పొట్టు: 1 కప్పు
మినపపప్పు- 2 టీస్పూన్లు
జీలకర్ర -1/2 స్పూను
ధనియాలు- 1/2 స్పూను
ఎండుమిర్చి - 6 నుంచి 8వరకు
వెల్లుల్లి రెబ్బలు- 2
చింతపండు- కొద్దిగా నీళ్ళలో నానేసి
ఉప్పు- సరిపడినంత
తయారు చేసే విధానం:
బీరకాయలను బాగా కడిగి చివర్లు కోసేసి తొక్కు తీసి పెట్టుకోవాలి. బాణలిలో ఒక టీస్పూన్‌ నూనె వేసి మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి దోరగా వేయించుకోవాలి. అవి తీసి పక్కన పెట్టుకొని బాణలిలో మరో రెండు టీస్పూన్ల నూనె వేసి బీరకాయ తొక్కులను మెత్తబడే వరకూ వేయించాలి. మిక్సర్‌లో వేయించిపెట్టుకున్న పోపు గింజలను వేసి పొడి చేసుకోవాలి. ఆ పొడిలో వేయించిన బీర పొట్టునుచ చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మెత్తగా చేసుకోవాలి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తింటే రుచిగా ఉంటుంది.

* కార్న్‌ మంచూరియా

* కార్న్‌ మంచూరియా
సాయంత్రం సమయంలో లేదా బయట వర్షం పడుతు న్నప్పుడు ఏదైనా తింటుం టే... ఆహా ఆ అనుభూతిని చెప్పడానికి మాటలు రావనుకోండి. సాధారణంగా ఇలాంటప్పుడు అందరూ పకోడీలు, బజ్జీల వంటి స్నాక్‌ ఫుడ్‌కు ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాంటిదే కొంచెం కొత్తగా, వెరైటీగా ఇంకొంచెం భిన్నంగా బేబి కార్న్‌తో మంచూరియా ఎలా చేయాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్ధాలు: తాజా బేబి కార్న్‌ 5
మొక్కజోన్న పిండి - అరకప్పు
బియ్యం పిండి - పావు కప్పు
కారం సరిపడా
అల్లంవెల్లుల్లి పేస్టు - 2 స్పూన్లు
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి సరిపడా
ఉల్లిపొర కట్ట - ఒకటి
ఉల్లిపాయ ఒకటి (సన్నగా తరగాలి)
వెల్లుల్లి పాయ ముక్కలు
సోయాసాస్‌
టొమాటో సాస్‌
తయారు చేసే విధానం: ముందుగా తాజా బేబి కార్న్‌ను చిన్న చిన్న ముక్కలుగా ఒకే సైజులో తరిగి, ఉప్పు నీటితో ఉడికించి తర్వాత నీరు మొత్తం ఇంకిపోయేలా వడకట్టి పక్కడ ఆరబెట్టు కోవాలి. ఈలోగా... ఓపాత్రలో మొక్కజొన్న పిండి, బియ్యంపిండి, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద సరిపడా ఉప్పును వేసి బజ్జీల పిండికి ఉపయోగించే మిశ్రమంలా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టౌ పై బాణలి పెట్టి ఈ మిశ్రమంలో నానబెట్టుకున్న బేబి కార్న్‌ను మంచి బజ్జీల మాదిరి వేయించుకోవాలి. స్టౌ పై మరో బాణలి పెట్టి తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉల్లి పొర ముక్కలు దోరగా వేయించుకోవాలి.
ఇప్పుడు ముందుగా బజ్జీలుగా వేయించి పెట్టుకున్న బేబికార్న్‌ ముక్కలను ఒక్కోటిగా వేసి అటూ ఇటూ కలియ బెట్టాలి. ఆ తర్వాత దీనిని వేరే ప్లేట్‌లోకి తీసుకొని వాటి పై సో యాసాస్‌, చిల్లీసాస్‌, టొమాటో సాస్‌ చల్లి వేడి వేడిగా సర్వ చేసుకోవాలి. దీని పైన తరిగిన ఉల్లిపాయలు వేసి, కొద్దిగా నిమ్మరసం చల్లి తింటే చాలా రుచికరంగా ఉంటుంది.

Monday, November 11, 2013

వంటింటి చిట్కాలు మీ కోసం..

వెల్లుల్లిపాయ పొట్టును తేలికగా తీయాలంటే వాటిని ఒక పాలిథిన్‌ కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో కొంత సేపు ఉంచిన తర్వాత తీస్తే చాలా సులభంగా వచ్చేస్తుంది.
బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడు ఉండ కట్టకుండా ఉండాలంటే నూకకి చెంచా నూనె పట్టిస్తే సరిపోతుంది.
 వెల్లుల్లిపాయ పొట్టును తేలికగా తీయాలంటే వాటిని ఒక పాలిథిన్‌ కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో కొంత సేపు ఉంచిన తర్వాత తీస్తే చాలా సులభంగా వచ్చేస్తుంది.
బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడు ఉండ కట్టకుండా ఉండాలంటే నూకకి చెంచా నూనె పట్టిస్తే సరిపోతుంది.
సాంబార్లో ఉప్పు ఎక్కువైతే ఉడికించిన బంగాళ దుంపలు వేస్తే సరి.
వంకాయ కూరలో రెండు చుక్కలు నిమ్మరసం పిండితే కూర రంగు మారదు, రుచిగా వస్తుంది.
కిలో గోధుమలలో గుప్పెడు సనగలు చేర్చి మరపట్టిస్తే చపాతీలు తెల్లగా మరియు రుచిగా ఉంటాయి.
వంటకాల్లో సుగంధ ద్రవ్యాలను అలాగే వేయటానికి బదులు, పొడి చేసి వేస్తే పదార్థాలు కమ్మటి వాసన వస్తాయి.
snack వంటకాల్లో కారానికి బదులు మిరియాల పొడిని వేస్తే రుచిగా ఉంటుంది.
ఉల్లిపాయ ముక్కల్లో చిటికెడు పంచదార వేస్తే త్వరగా వేగుతాయి.
నిమ్మకాయ తొక్కలను పిండిన తర్వాత వాటిని కుక్కర్ కింద వేయడం వల్ల వాసనరాదు.
పచ్చిమిరపకాయలు ముచ్చికలను తీసి ఫ్రిజ్ లో నిల్వ ఉంచడం వల్ల తొందరగా పాడవవు.
పాలు కాచేటపుడు పొంగకుండా ఉండాలంటే అంచుకు నూనె రాయాలి.
నూనె పొరపాటున ఒలికితే ఆ ప్రాంతంలో కొంచెం మైదాపిండి జల్లితే నూనెను త్వరగా పీల్చేస్తుంది.
క్యాబేజి ఉడికించేటపుడు వాసనరాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వేయ్యాలి.
కత్తిపీటకు ఉప్పురాయడం వల్ల పదునుగా తయారవుతుంది.
చపాతీలు మరింత రుచిగా కావాలనుకుంటే ఈ విధంగా చేసి చూడండి. గోధుమపిండిలో కొద్దిగా బార్లీపిండి, శనగపిండి కలిపితే మంచి రుచిగా ఉంటాయి
అప్పడాల్లో కాస్త నూనె రాసి, దోసె పెనంపై కాల్చి అన్నంలోకి సైడిష్‌గా తీసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. నూనె వాడకం తగ్గుతుంది. ఆరోగ్యానికి మంచిది.
వేరుశనగపప్పు లడ్డు చేసేటప్పుడు బెల్లంతో పాటు కొద్దిగా చక్కెర కలిపితే ఎంతకాలమైనా లడ్డు తాజాగా ఉంటుంది.
పదార్థాలు మాడిపోయి పెనం నల్లగా తయ్యరైతే దానిమీద సబ్బునీళ్ళు పోసి సన్నటి సెగ మీద ఉంచి చల్లారాక రుద్దితే సుబ్రపడుతుంది.
బఠాణీలను ఉడికించేటప్పుడు చిటికెడు తినేసొడా వేస్తే త్వరగా ఉడుకుతాయి. రంగు కూడా ఆకర్షణీయంగా మారుతుంది.
అరటిపండు పువ్వులను fridge లో పెట్టకూడదు. వాటివల్ల లోపలి పదార్ధాల రుచి, వాసన మారిపోతుంది.
కాలిఫ్లోవేర్, పాలకూర వంటి వాటిని శుబ్రం చేయటానికి నీటిలో కొద్దిగా వినేగార్ కలపండి.
ఆకు కూరలు ఉడికించిన నీటిని వృధాగా పారెయ్యకుండా soup ల తయారీలో వాడుకోవచు.
పాలలో మీగడ ఎక్కువగా రావాలంటే కాచడానికి ముందు పాల గిన్నెను చల్లటి నీటిలో ఉంచండి.
అరటి, బంగాళ దుంప ముక్కల మీద ఉప్పు నీళ్ళు చల్లి పావుగంట అయ్యాక వేపుడు చేస్తే ముక్కలు బాగా వేగుతాయి.
ఇడ్లీలు మృదువుగా రావాలంటే ప్లేట్లో పిండి వేసాక తడి చేత్తో అద్దితే సరిపోతుంది.
రాత్రి మిగిలిన చపాతి లు గట్టిగా అయిపోయాయా , వాటి మీద కొంచెం నీళ్ళు చల్లి మరలా పెనం మీద వేడి చేసి చూడండి. అవి మరలా మృదువుగా తయారు అవుతాయి .
మాములుగా చలికాలంలో ఇడ్లి పిండి సరిగా పులవదు. ఇలాంటప్పుడు ఇడ్లి పిండి లో ముందే గనక ఉప్పు వేసి వుంచి నట్లు అయెతే పిండి పులుస్తుంది. అదే ఎండాకాలంలో నైట్ కూడా వేడీ బాగా వుండడం వల్ల పిండి బాగా పుల్లగా అయ్యిపోతు వుంటుంది. ఇలాంటప్పుడు పిండి లో ముందుగా ఉప్పు వెయ్యకుండా వుంటే సరిపోతుంది.
పప్పులు, తృణ ధాన్యాలు పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన డబ్బాలో గుప్పెడు వేపాకులు వేస్తే సరి.
ఒక బంగాళాదుంప ను ముక్కలుగా కోసి పులుసు లో వేసి కాసేపు వుడికిన తరువాత స్టవ్ ఆపుచెయ్యండి.
ఇలా చేస్తే బంగాళాదుంప ముక్కలు కూర లో వున్న ఉప్పు ను పీల్చుకొని కూర లో వున్న ఉప్పు తగ్గుతుంది.
బొబ్బట్లు (భక్ష్యాలు) చేసేటప్పుడు తోపులో కొద్దిగా గోధుమ రవ్వ కలిపితే బొబ్బట్లు చిరగకుండా వస్తాయి.
కాకరకాయ ఆరోగ్యానికి మంచిది అన్న విషయం అందరికి తెలిసే వుంటుంది. కానీ కాకరకాయ లో వున్న చేదు కారణంగా దానిని తినడానికి చాల మంది ఇష్టపడరు .కాకరకాయ లో వున్న చేదు తగ్గాలంటే కాకరకాయను ముక్కలుగా కోసి వాటిని బియ్యం కడిగిన నీళ్ళలో ఒక గంట సేపు వుంచి నట్టు అయెతే చేదు అంతా పోతుంది.
దోసల పిండి బాగా పులిస్తే అందులో రెండు చెంచాల గోధుమ పిండిని కలిపితే అవి రుచిగా వస్తాయి.
ఉప్పు సీసాలో ఒక చెంచా మొక్కజొన్న పిండి వేస్తే ఉప్పు తడిబారి ముద్ద కాదు.
ఎక్కువగా పండిన టమాటలను ఉప్పు కలిపిన చల్లని నీటిలో రాత్రంతా ఉంచితే ఉదయానికల్లా తాజాగా మారుతాయి.
సాంబార్లో ఉప్పు ఎక్కువైతే ఉడికించిన బంగాళ దుంపలు వేస్తే సరి.

Friday, November 8, 2013

పాలకూర పకోడీ

కావలసినవి :
పాలకూర : ఆరు కట్టలు
శనగపిండి : రెండు కప్పులు
బియ్యప్పిండి : కప్పు
కారం : రెండు స్పూన్లు
నూనె : డీప్ ఫ్రై కి సరిపడా
ఉప్పు : తగినంత


తయారి: 


ముందుగా పాలకూరని శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి వేసి కలిపి అందులో పాలకూర, కారం, ఉప్పు, నీరు వేసి గట్టిగా కలుపుకుని పక్కనపెట్టుకోవాలి. బాణలిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి వేడెక్కిన తర్వాత కావలసిన ఆకారాల్లో వేసుకుని బంగారు రంగు వచ్చేవరకు వేయించి టిష్యూ పేపర్ మీదకు తీయాలి. దీనిని టొమాటో సాస్‌తో తింటే బాగుంటుంది.

Saturday, November 2, 2013

వంటింటి చిట్కాలు మీ కోసం..

ఆహారంలోని తడిని కాపాడటంకోసం మూతపెట్టి ఉంచాలి.
ఆహారం తయారైన తరువాత వడ్డనకు ముందు కనీసం రెండు నిమిషాలు మూతపెట్టి ఉంచాలి.
మైక్రోవోవెన్‌లో ఆహారం సమంగా ఉడకదు కాబట్టి ఆహారపు ఉష్ణోగ్రతను వివిధ
ప్రదేశాల్లో చూడటం మంచిది.
 ఆహారాన్ని ఎంత ఉష్ణోగ్రత వరకు వేడి చేయాలనే ఆయా పదార్థాల మీద, వంటకు
వెచ్చించే సమయం మీద ఆధారపడి ఉంటుంది. ఉదా.కు జంతు మాంసాలను మైక్రోఓవెన్లో
వండేటప్పుడు 165 డిగ్రీల ఫా.హీ (73.8 డిగ్రీల సెల్సియస్) ఉండాలి
 సాధారణ పెనంపై ఒక చెంచా ఉప్పును వేయించి ఆ తరువాత దానిపై దోశలు వేస్తే
నాన్‌స్టిక్ పెనంపై వేసినట్టుగా అంటుకోకుండా వస్తాయి.
సలాడ్ కోసం పళ్ళు ముందుగానే కోసి పెట్టుకున్నా అవి నల్లగా మారకుండా
ఉండాలంటే, వాటి మీద నిమ్మకాయ రసం పిండండి. రెండు పళ్లకు సగం నిమ్మకాయ రసం
సరిపోతుంది.
 శనగపిండిలో పెరుగు కలిపితే పకోడీలు మెత్తగా వస్తాయి.
వేరుశనగపప్పు వేయించాక బాగా రుచిగా ఉండాలంటే, బాగా వేడి నీటిలో వాటిని ఒక్క క్షణం ఉంచి తీసేసి, నీరంతా పోయే దాకా స్టెయినర్లో ఉంచి, తర్వాత వీటిని వేయించండి. చాల క్రిస్పీగా ఉంటాయి

వేపుడులో నూనె ఎక్కువైతే కాస్త శనగపిండి చల్లండి. తినడానికి రుచిగా ఉండటమే కాక ఎక్కువయిన నూనె తగ్గుతుంది కూడా.

లేత సొరకాయ తరిగినపుడు లోపల ఉండే మెత్తని గుజ్జును బాగా నానిన బియ్యానికి జోడించి మెత్తగా రుబ్బాలి. అందులో అల్లం, మిర్చి, ఉల్లిపాయముక్కలు, తగినంత ఉప్పు కలిపి దోసెలు పోస్తే రుచిగా ఉంటాయి.

మరుగుతున్న 'టీ' పొడిలో చిటికెడు శొంఠి పొడి, రెండు యాలుకలు వేసి, 'టీ'ఇస్తే చాలా రుచిగా ఉంటుంది.

మిగిలి పోయిన నిమ్మకాయ ఊరగాయను పప్పులో వేస్తే చాలా రుచిగా ఉంటుంది. మిరపకాయ బజ్జీలు వేసి, వేడి వేడిగా తిని చూడండి. ఎంత రుచిగా ఉంటాయో?

బత్తాయి పండ్లని అయిదు నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచితే తొక్క కింద ఉండే తెల్లటి పొరని తేలిగ్గా వలిచేయవచ్చు.

బంగాళదుంప చిప్స్ మెత్తబడితే వాటిని నిముషం పాటు మైక్రోవేవ్ లో ఉంచితే కరకరలాడతాయి. బెండకాయ వేపుతున్నప్పుడు జిగురొచ్చి కూర ముద్దలా అవుతుంది. బాండీలో ముక్కలు వేయగానే కాస్త మజ్జిగకూడా వేసి కలిపితే జిగురు రాదు

బంగాళదుంపల చిప్స్ కరకరలాడాలంటే పసుపు రంగులో కనిపించే దుంపలను ఎంపికచేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి తోలు తీసి, చిప్స్ వేయించేందుకు అనువైన ముక్కలుగా చేయాలి. నీళ్ళలోంచి తీసి వాటిపై మొక్కజొన్న పొడిని చల్లి వేయించాలి.

పూరీ పిండి కలిపేటప్పుడు సాధ్యమైనంత గట్టిగా కలుపుకుంటే పూరీలు నూనె పీల్చుకోవు. పూరీలు బాగా క్రిస్పీగా ఉండాలంటే, పూరీ పిండికి బాగా మరిగించిన ఆయిల్ కలిపి , పూరీ పిండి తయారు చేసుకోండి.

పులుసు, చారు మొదలైన వంటకాలలో పొరపాటున పులుపు ఎక్కువ పడవచ్చు. మజ్జిగ, పెరుగు మొదలైనవి విరివిగా పులిసి పోవచ్చు. అటువంటివాటిలో కొద్దిగా వంట సొడా కలిపితే మనకు కావలిసినంత రుచి తెచ్చుకోవచ్చు.

ప్రూట్ కేక్స్ పై ఒక టీ స్పూను గ్లిజరిన్ వేస్తే తాజాగా ఉంటాయి.

పరమాన్నం మరింత టేస్టీగా ఉండాలంటే, బియ్యాన్ని నెయ్యి వేసి కొంచెం సేపు వేయించి బియ్యంతో పరమాన్నం చేయాలి.

నిమ్మరసం ఎక్కువగా రావాలంటే పది నిముషాలపాటు గోరు వెచ్చటి నీటిలో వేసి ఉంచాలి. ఒకవేళ ఫ్రిజ్ లో ఉంటే రసం తీయటానికి పది నిమిషాల ముందు బయటపెట్టాలి.

దోసె పిండిలో ఒక చెంచా వెనిగర్ వేశారంటే, అట్టు చిల్లు చిల్లులుగా వస్తుంది. ముఖ్యంగా రవ్వట్టుకు ఇది చాల బాగుంటుంది.

టమోటా సూప్ చేసేటప్పుడు క్యారెట్ వేస్తే పులుపు తగ్గటంతోపాటు పోషకవిలువలు వస్తాయి. టమోటాలు ఉడికించేటప్పుడు ఒక టేబుల్ స్పూను పంచదార, ఉప్పు కలిపితే త్వరగా ఉడుకుతాయి.

 ఫ్రైడ్ రైస్ చేసేప్పుడు నీళ్లు బదులుగా పాలు వాడితే అన్నం రుచిగా ఉంటుంది.