Tuesday, March 1, 2016

బిసీ బెళె బాత్

కావల్సినవి: బియ్యం - పావుకేజీ, కందిపప్పు - కప్పు, క్యారెట్, బంగాళాదుంపలు - రెండు చొప్పున, బఠాణీలు - పావుకప్పు, బీన్స్ - నూటయాభై గ్రా, టమాట - ఒకటి, ఉల్లిపాయలు - నాలుగు, ఉప్పు - రుచికి తగినంత, నెయ్యి - యాభై గ్రా, పసుపు - కొద్దిగా, నూనె - మూడుచెంచాలు, చింతపండు - పాతిక గ్రా, ఆవాలు, జీలకర్ర - అరచెంచా చొప్పున, కరివేపాకు రెబ్బలు - రెండు, ఇంగువ - కొద్దిగా, జీడిపప్పు పలుకులు - పావుకప్పు.మసాలా కోసం: ధనియాలు, మినప్పప్పు, కందిపప్పు - నాలుగుచెంచాల చొప్పున, సెనగపప్పు - రెండు చెంచాలు, ఎండుమిర్చి - పది, మరాఠీమొగ్గ, దాల్చినచెక్క - మూడు చొప్పున, లవంగాలు - నాలుగు, యాలకులు - ఒకటి, కొబ్బరితురుము - కప్పు.

తయారీ: కొబ్బరితురుము తప్ప మసాలా దినుసులన్నింటినీ నూనెలో వేయించుకుని చల్లారాక పొడిచేసుకోవాలి. అందులో కొబ్బరి తురుమును చేర్చాలి. చట్నీలా తయారైన దీన్ని పక్కనపెట్టుకోవాలి. బియ్యం, కందిపప్పు, కూరగాయముక్కలన్నింటినీ కుక్కర్‌లో తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. ఒక కూత వచ్చాక దింపేయాలి. ఆ అన్నాన్ని మళ్లీ పొయ్యిమీద పెట్టి ఉడికించాలి. ఐదునిమిషాలయ్యాక చింతపండు గుజ్జు చేర్చాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేయాలి. సిద్ధంచేసుకున్న మసాలా కూడా చేర్చి బాగా కలపాలి ఇది కాస్త పలుచగానే ఉండాలి కాబట్టి కాసిని నీళ్లు చేర్చుకోవాలి. అన్నం తయారయ్యాక దింపేయాలి. బాణలిలో నెయ్యి కరిగించి ఇంగువ, జీడిపప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేయించి.. ఈ అన్నంపై వేసి బాగా కలిపితే నోట్లో వేసుకోగానే కరిగిపోయే బిసీబెళెబాత్ సిద్ధం.

0 comments:

Post a Comment