Thursday, March 17, 2016

'' ఓట్స్ '' పరాటా

ఫ్యాట్ తగ్గించే '' ఓట్స్ '' పరాటా
కావలసిన వస్తువులు :
గోధుమపిండి : 1 కప్పు
ఓట్స్ : 1/2 కప్పు
ఉప్పు : తగినంత
పసుపు : చిటికెడు
కారం పొడి : 1/2 tsp
గరం మసాలాపొడి : 1/4 tsp
సన్నగా తరిగిన మెంతికూర : 2 tbsp
నూనె : కాల్చడానికి సరిపడినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా మెంతికూర శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఓట్స్ ని గ్రైండర్ లో పొడి చేసుకోవాలి.
2. ఈ పొడి గోధుమపిండిలో వేసి కలపాలి. ఇందులో మెంతికూర, ఉప్పు,పసుపు, కారం పొడి, గరం మసాలాపొడి వేసి బాగా కలియబెట్టి, కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా తడిపి పెట్టుకోవాలి.
3. ఈ పిండి పది నిమిషాలు నానిన తర్వాత మళ్లీ చేతులతో మర్ధనా చేసి చిన్న బత్తాయి సైజులోఉండలు చేసుకోవాలి. దానిని చపాతీలా వత్తుకుని పలుచగా నూనె రాసి కొద్దిగా పొడిపిండి చల్లి మడత పెట్టాలి.
4. తర్వాత మళ్లీ దీనిని చపాతీలా వత్తుకుని వేడి పెనంపై కొద్దిగా నూనె లేదా వెన్న వేసి రెండువైపులా ఎర్రగా అయ్యేలా కాల్చుకోవాలి. వేడివేడి పరాటాలను ఉల్లిపాయ రింగులు, పెరుగు పచ్చడి, ఆవకాయతో సర్వ్ చేయాలి. 
* అంతే ఓట్స్ పరాటా రెడీ.

0 comments:

Post a Comment