Sunday, November 15, 2015

సగ్గుబియ్యం పొంగనాలు

కావలసిన పదార్థాలు:

 సగ్గుబియ్యం- 1/2, కప్పు, బియ్యం - 3/4 కప్పు, మినప్పప్పు - 1/4 కప్పు, మెంతులు - చిటికెడు, పెరుగు -3 టేబుల్‌ స్పూన్లు, శనగపప్పు- 1 టేబుల్‌ స్పూను, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, అల్లం తరుగు - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, ఉల్లి తరుగు - కప్పు. 

తయారుచేసే విధానం: సగ్గుబియ్యం, మినప్పప్పు, బియ్యం, మెంతులు కలిపి 6 గంటలు నానబెట్టాలి. తర్వాత నీరు వడకట్టి పెరుగు, ఉప్పు కలుపుతూ చిక్కగా రుబ్బి (అవసరమైతే కొద్ది నీరు వాడొచ్చు) 8 గంటల సేపు పక్కనుంచాలి. తర్వాత కొత్తిమీర, ఉల్లి తరుగు, (5 గంటలపాటు నానబెట్టిన) శనగపప్పుని కలపాలి. చిన్న కడాయిలో కొద్ది నూనె వేసి ఆవాలు, అల్లం, పచ్చిమిర్చి తరుగు తాలింపు వేసి చల్లారాక రుబ్బిన పిండిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని (స్పూను చొప్పున నూనె వేసిన) పెనం గుంతల్లో మూడు వంతులు నింపి మూతపెట్టాలి. వేగాక సన్న కాడతో తిప్పుతూ అన్నివైపులా దోరగా వేగించాలి. ఈ పొంగనాలని కొబ్బరిచట్నీతో తింటే చాలా బాగుంటాయి.

0 comments:

Post a Comment