Monday, November 30, 2015

క్యారెట్ రైస్ హెల్తీ అండ్ న్యూట్రీషియన్ బ్రేక్ ఫాస్ట్ !!!

కావలసినపదార్థాలు: బియ్యం: 1cup ఉల్లిపాయలు: రెండు క్యారట్: 2 లేదా 3 నెయ్యి: 2tsp దాల్చినచెక్క: చిన్న ముక్క మినప్పప్పు: 1tsp లవంగాలు: 2 ఆవాలు: 1tsp శనగపప్పు: 1tsp బఠాణి: 2tsp టొమాటో: 1 క్యాప్సికమ్: 1 ఉప్పు: రుచికి తగినంత చక్కెర: చిటికెడు కొత్తిమీర: చిన్న కట్ట (సన్నగా తరగాలి)

తయారు చేయు విధానం: 1. ముందుగా అన్నం వండి వేరే పాత్రలోకి తీసి చల్లారనివ్వాలి. 2. తర్వాత క్యాప్సికమ్, క్యారట్‌ను కడిగి చిన్న ముక్కలుగా తరిగి ఉడికించాలి. వీటిని కలిపి లేదా విడిగా ఉడికించుకోవచ్చు. 3. తర్వాత బఠాణిలలో చక్కెర వేసి ఉడికించాలి (చక్కెర వేసి ఉడికిస్తే బఠాణి రంగు ఆకర్షణీయంగా ఉంటుంది, రుచి పెరుగుతుంది. బఠాణీలకు స్వతహాగా ఉండే వెగటు వాసన పోతుంది). 4. అలాగే టొమాటోలను కూడా ముక్కలుగా తరగాలి. 5. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ లో నెయ్యి వేడి చేసి లవంగాలు, దాల్చిన చెక్క, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి, అవి మగ్గిన తరువాత టొమాటో ముక్కలు వేయించాలి. 6. తర్వాత అందులోనే క్యారట్, క్యాప్సికమ్, బఠాణి వేసి రెండు నిమిషాల సేపు వేయించాలి. 7. ఇప్పుడు మంట తగ్గించి పై మిశ్రమంలో ఉప్పు వేసి కలిపిన తర్వాత అన్నం, కొత్తిమీర వేసి కలిపితే క్యారట్ రైస్ రెడీ. కారంగా తినడానికిఇష్టపడేవాళ్లు పోపులో రెండు పచ్చిమిర్చిని వేసుకోవచ్చు.

0 comments:

Post a Comment