Sunday, November 15, 2015

గోరు చిక్కుడు మసాలా కర్రీ

కావలసిన పదార్థాలు: గోరు చిక్కుడుకాయ ముక్కలు: ఒకటిన్నర కప్పు: పెరుగు: రెండు టేబుల్‌ స్పూన్లు, ధనియాల పొడి: అర టీస్పూను, పసుపు: చిటికెడంత, కారం: టేబుల్‌ స్పూను, ఉప్పు, రుచికి సరిపడ, ఆవాలు, జీలకర్ర: చెరో టేబుల్‌ స్పూను, పచ్చిశనగపప్పు: టేబుల్‌ స్పూను, కరివేపాకు, కొత్తిమీర: కొద్దిగా, నూనె: తగినంత 

మసాలా కోసం: ఉల్లిపాయ: ఒకటి (ముక్కలు చేసుకోవాలి), పచ్చిమిరపకాయలు: మూడు, అల్లం: చిన్న ముక్క, వెల్లుల్లి: మూడు రెబ్బలు, దాసించెక్క: చిన్నముక్క, లవంగాలు: మూడు లేక నాలుగు, ధనియాలు: స్పూను, కొబ్బరిపొడి: స్పూను, కొత్తిమీర: కొన్ని ఆకులు 

తయారీ విధానం: గోరు చిక్కుడు కాయలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మసాలా దినుసుల్లో ధనియాలను నూనె లేకుండా, ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో వేయించి మిగతా మసాలా దినుసులతో కలిపి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నె లేదా బాండీ తీసుకుని నూనె కాగిన తరువాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తరువాత చిక్కుడు కాయ ముక్కల్ని వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి కొద్దిసేపు వేగిన తరువాత మసాలా ముద్దను, పెరుగు జత చేసి అవసరం అనుకుంటే కొద్దిగా నీరు కలిపి ఉడికించాలి. దించేముందు కొత్తిమీర చల్లుకుని దింపేయాలి.

0 comments:

Post a Comment