Monday, November 30, 2015

హెల్దీ ఫ్రూట్ సలాడ్

కావలసిన పండ్లు :

మామిడిపండు ముక్కలు - 1 కప్పు 
ఆపిల్ పండు ముక్కలు - 1 కప్పు
కమలాతొనలు - 1 కప్పు
దానిమ్మ గింజలు - 1 కప్పు
ద్రాక్షపళ్ళు - 1 కప్పు
పైనాపిల్ ముక్కలు - 1 కప్పు
ఉప్పు - కొంచెం
తేనె - 1/4 కప్పు
నిమ్మ రసం - 2 స్పూన్లు
అరటిపండు ముక్కలు - 1 కప్పు
చెర్రీ పండ్లు - 1/2 కప్పు
మిరియాలపొడి - 1/2 స్పూన్

తయారీ విధానం :
ముందుగా పైన చెప్పిన పండ్లన్నింటినీ శుభ్రంచేసి చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. వీటి మీద మిరియాల పొడి, ఉప్పు వేసి నిమ్మరసం పిండి పైన తేనె వేసి నాలుగు గంటలపాటు ప్రిజ్‌లో ఉంచితే చాలు ఫ్రూట్ సలాడ్ సిద్ధమైనట్లే.

క్యారెట్ రైస్ హెల్తీ అండ్ న్యూట్రీషియన్ బ్రేక్ ఫాస్ట్ !!!

కావలసినపదార్థాలు: బియ్యం: 1cup ఉల్లిపాయలు: రెండు క్యారట్: 2 లేదా 3 నెయ్యి: 2tsp దాల్చినచెక్క: చిన్న ముక్క మినప్పప్పు: 1tsp లవంగాలు: 2 ఆవాలు: 1tsp శనగపప్పు: 1tsp బఠాణి: 2tsp టొమాటో: 1 క్యాప్సికమ్: 1 ఉప్పు: రుచికి తగినంత చక్కెర: చిటికెడు కొత్తిమీర: చిన్న కట్ట (సన్నగా తరగాలి)

తయారు చేయు విధానం: 1. ముందుగా అన్నం వండి వేరే పాత్రలోకి తీసి చల్లారనివ్వాలి. 2. తర్వాత క్యాప్సికమ్, క్యారట్‌ను కడిగి చిన్న ముక్కలుగా తరిగి ఉడికించాలి. వీటిని కలిపి లేదా విడిగా ఉడికించుకోవచ్చు. 3. తర్వాత బఠాణిలలో చక్కెర వేసి ఉడికించాలి (చక్కెర వేసి ఉడికిస్తే బఠాణి రంగు ఆకర్షణీయంగా ఉంటుంది, రుచి పెరుగుతుంది. బఠాణీలకు స్వతహాగా ఉండే వెగటు వాసన పోతుంది). 4. అలాగే టొమాటోలను కూడా ముక్కలుగా తరగాలి. 5. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ లో నెయ్యి వేడి చేసి లవంగాలు, దాల్చిన చెక్క, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి, అవి మగ్గిన తరువాత టొమాటో ముక్కలు వేయించాలి. 6. తర్వాత అందులోనే క్యారట్, క్యాప్సికమ్, బఠాణి వేసి రెండు నిమిషాల సేపు వేయించాలి. 7. ఇప్పుడు మంట తగ్గించి పై మిశ్రమంలో ఉప్పు వేసి కలిపిన తర్వాత అన్నం, కొత్తిమీర వేసి కలిపితే క్యారట్ రైస్ రెడీ. కారంగా తినడానికిఇష్టపడేవాళ్లు పోపులో రెండు పచ్చిమిర్చిని వేసుకోవచ్చు.

హెల్తీ అండ్ టేస్టీ మేతి టమోటో రైస్ బాత్ రిసిపి

కావల్సిన పదార్థాలు: టమోటోలు: 3 (chopped) మేతి(మెంతి ఆకులు): 3 cups (chopped) అన్నం: 3 cups (cooked) ఉల్లిపాయ పేస్ట్: 1/4 cup వెల్లుల్లి పేస్ట్: 2tsp పచ్చిమిర్చి పేస్ట్: 2 (slit) పసుపు: 1tsp కారం: 1tsp జీలకర్ర: 1tsp ధనియాలపొడి: 1tsp ఉప్పు: రుచికి సరిపడా జీలకర్ర: 1tsp ఆవాలు: 1tsp కరివేపాకు : రెండు రెమ్మలు నూనె: 2tbsp
తయారుచేయు విధానం: 1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి. 2. పోపు వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్, వెల్లుల్లిపేస్ట్ వేసి మరో 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి. 3. ఇప్పుడు అందులో టమోటోలు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మిక్స్ చేస్తూ మీడియం మంట మీద మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి. 4. ఇప్పుడు అందులో మెంతిఆకు కూడా వేసి మరో 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి. 5. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేయాలి. మెంతి ఆకు మెత్తగా ఉడికే వరకూ ఫ్రై చేసుకోవాలి. 6. ఇప్పుడు అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం వేసి నిధానంగా మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రం కలగలిసేలా ఉండి, తర్వాత స్టౌ ఆఫ్ చేసి తర్వాత వేడి వేడిగా సర్వ్ చేయాలి. 7. అంతే హెల్తీ అండ్ టేస్టీ ఐరన్ రిచ్, మేతి, టమోటో రైస్ బాత్ రిసిపి రెడీ. ఈ హెల్తీ మీల్ ను పెరుగు మరియు మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేయవచ్చు

Tuesday, November 24, 2015

• మంచూరియా

కావలసినవి 
మంచూరియాలకోసం: సొరకాయతురుము: కప్పు, అల్లంవెల్లుల్లిముద్ద: అరటీస్పూను, కారం: టీస్పూను, గోధుమపిండి: 3 టేబుల్‌స్పూన్లు, మైదా: 4 టేబుల్‌స్పూన్లు, కార్న్‌ఫ్లోర్: టేబుల్‌స్పూను, జీలకర్ర: అరటీస్పూను, వంటసోడా: పావుటీస్పూను, ఉప్పు: తగినంత, మంచూరియాలు వేయించేందుకు: ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: ఒకటి, ఉల్లికాడలు: రెండు, కరివేపాకు: 5 రెబ్బలు, కొత్తిమీర: తగినంత, చిల్లీసాస్: టీస్పూను, టొమాటోసాస్: 2 టీస్పూన్లు, నూనె: తగినంత

తయారుచేసే విధానం

* సొరకాయ తొక్కు తీసి సన్నగా తరగాలి. తరవాత అందులో గోధుమపిండి, మైదాపిండి, కార్న్‌ఫ్లోర్, జీలకర్ర, వంటసోడా, ఉప్పు, అల్లంవెల్లుల్లిముద్ద, కారం అన్నీ వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరించి మిశ్రమాన్ని ఉండలుగా చేయాలి. ఇలాగే అన్నీ చేసుకుని కాగిన నూనెలో వేయించి తీయాలి.

* ఇప్పుడు బాణలిలో నూనె అంతా వంపేసి అడుగున కొద్దిగా ఉంచి, ఉల్లిముక్కలు, ఉల్లికాడల ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తరవాత చిల్లీసాస్, టొమాటోసాస్, కొత్తిమీర తురుము వేసి కలిపి అందులోనే మంచూరియాలను వేసి ఓ నిమిషం ఉడికించి దించాలి.

• ఉల్లికారం కూర

• ఉల్లికారం కూర

కావలసినవి
ఉల్లిముక్కలు(సన్నగా తరిగినవి): 2 కప్పులు, ఎండుమిర్చి: 15, దనియాలు: అరటీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, ఆవాలు: టీస్పూను, సొరకాయముక్కలు: 4 కప్పులు, టొమాటోలు: రెండు, బెల్లంతురుము: 2 టీస్పూన్లు, చింతపండు: నిమ్మకాయంత, మినప్పప్పు: 2 టీస్పూన్లు, సెనగపప్పు: 4 టీస్పూన్లు, నూనె: అరకప్పు, కొత్తిమీరతురుము: అరకప్పు, ఉప్పు: 2 టీస్పూన్లు, పసుపు: అరటీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు

తయారుచేసే విధానం

* ముందుగా లేత ఆనపకాయ తీసుకుని తొక్కు తీసి చిన్నముక్కలుగా కోయాలి. అందులోనే ఓ టీస్పూను ఉప్పు, పసుపు వేసి కలిపి పక్కనపెట్టాలి.

* బాణలిలో కొద్దిగా నూనె వేసి పప్పులన్నీ వేసి వేయించి తీయాలి. అదే బాణలిలో ఉల్లిముక్కలు కూడా వేసి వేయించి తీయాలి. తరవాత ఎండుమిర్చి కూడా వేయించి తీయాలి. ఇప్పుడు వేయించిన పప్పులు, ఉల్లిముక్కలు, బెల్లం తురుము, చింతపండు, ఎండుమిర్చి అన్నీ కలిపి ముద్దలా నూరి పక్కన ఉంచాలి.

* బాణలిలో మిగిలిన నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఉప్పూ పసుపూ వేసి ఉంచిన సొరకాయ ముక్కల నీళ్లు పిండేసి వేసి, మూతపెట్టి సన్న సెగమీద మగ్గనివ్వాలి. ముక్కలు ఉడికిన తరవాత నూరి ఉంచిన ఉల్లికారం వేసి కాసేపు వేయించాలి. తరవాత మూతపెట్టి సిమ్‌లోనే ఉడికించి దించేముందు కొత్తిమీర తురుము చల్లాలి.

Sunday, November 15, 2015

చామదుంపలు పుట్నాల వేపుడు

కావలసిన పదార్థాలు: 

చామదుంపలు - పావు కేజీ, పుట్నాల పప్పు - అర కప్పు, పల్లీలు - అర కప్పు, జీడి పప్పు - కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి - మూడు టేబుల్‌ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, ఎండుమిరపకాయలు - మూడు, జీలకర్ర - మూడు టేబుల్‌ స్పూన్లు, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, మినప్పప్పు - మూడు టేబుల్‌ స్పూన్లు, కారం - టీస్పూను, నూనె - తగింత.

తయారుచేసే విధానం: ఒక కడాయిలో మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు కొద్దిగా నూనె వేసి వేగించి, చల్లారాక అందులో పుట్నాల పప్పు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మరో కడాయిలో నూనె పోసి ఉడికించిన చామదుంప ముక్కలను దోరగా వేగించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ వేగించిన ముక్కల్లో పుట్నాల మిశ్రమం పొడి, ఎండుకొబ్బరి పొడి, పసుపు, కారం, వే గించిన జీడిపప్పు వేసి కొత్తిమీర చల్లుకోవాలి.

పొట్లకాయ మసాలా కర్రీ

కావలసిన పదార్థాలు:

 పొట్లకాయ- 1, ఉల్లిపాయ- 1, వేరుశెనగపప్పు- 1/2 కప్పు, కొబ్బరి ముక్కలు- 1/2 కప్పు, పసుపు- 1/4 టీ స్పూను, ఆవాలు- 1/2 టీ స్పూను, జీలకర్ర- 1/2 టీ స్పూను, నూనె- 3 టీ స్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- 1 టేబుల్‌ స్పూను, గరం మసాలా- 1 టీ స్పూను, కారం- 1 టీ స్పూను, ఉప్పు- రుచికి సరిపడా, నీళ్ళు- ఒక కప్పు.

తయారీ విధానం: పొట్లకాయ పైపొట్టు గీసి గుండ్రంగా ముక్కలు కోసుకోవాలి. వేరుశెనగపప్పులు వేగించుకొని కొబ్బరితో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్టు వేగించాలి. తరువాత పొట్లకాయ ముక్కలు వేసి అవి కొంచెం ఉడికాక వేరుశెనగ- కొబ్బరి పేస్టు, ఉప్పు, పసుపు, కారం వేసి నీళ్ళు పోసి ఉడికించాలి. కూర దగ్గర పడ్డాక గరం మసాలా జల్లి దించేయాలి.

కాప్సికమ్‌ వేపుడు

కావలసిన పదార్థాలు: 

కాప్సికమ్‌: రెండు(ముక్కలుగా చేసుకోవాలి), శనగపిండి: మూడు టేబుల్‌ స్పూన్లు, బియ్యం పిండి: టేబుల్‌ స్పూను, మొక్కజొన్న పిండి: టేబుల్‌ స్పూను, అల్లం వెల్లుల్లి ముద్ద: టేబుల్‌ స్పూను, కారం: పావు టీస్పూను, పచ్చిమిరపకాయలు: ఒకటి, ఉప్పు: రుచికి సరిపడ, నూనె: తగినంత 

తయారీ విధానం: పచ్చిమిరపకాయను ముద్దగా నూరుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న గిన్నెలో శనగపిండి, బియ్యంపిండి, మొక్కజొన్న పిండి, పచ్చిమిరపకాయ ముద్ద, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా నీరు పోసి కొద్దిగా గట్టిగా తడుపుకోవాలి. ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న కాప్సికమ్‌ ముక్కలు వేసి బాగా కలపాలి. కొద్దిసేపు ముక్కలను బాగా నాననిచ్చి అనం తరం బాండీలో నూనె పోసి కొన్ని కొన్ని ముక్కలు వేసి వేయించుకోవాలి. ముక్కలు ఎరుపు రంగులోకి వచ్చే వరకూ వేయించుకోవాలి. పకోడీల్లాగా కరకరలాడుతూ బాగుంటాయి.

గోరు చిక్కుడు మసాలా కర్రీ

కావలసిన పదార్థాలు: గోరు చిక్కుడుకాయ ముక్కలు: ఒకటిన్నర కప్పు: పెరుగు: రెండు టేబుల్‌ స్పూన్లు, ధనియాల పొడి: అర టీస్పూను, పసుపు: చిటికెడంత, కారం: టేబుల్‌ స్పూను, ఉప్పు, రుచికి సరిపడ, ఆవాలు, జీలకర్ర: చెరో టేబుల్‌ స్పూను, పచ్చిశనగపప్పు: టేబుల్‌ స్పూను, కరివేపాకు, కొత్తిమీర: కొద్దిగా, నూనె: తగినంత 

మసాలా కోసం: ఉల్లిపాయ: ఒకటి (ముక్కలు చేసుకోవాలి), పచ్చిమిరపకాయలు: మూడు, అల్లం: చిన్న ముక్క, వెల్లుల్లి: మూడు రెబ్బలు, దాసించెక్క: చిన్నముక్క, లవంగాలు: మూడు లేక నాలుగు, ధనియాలు: స్పూను, కొబ్బరిపొడి: స్పూను, కొత్తిమీర: కొన్ని ఆకులు 

తయారీ విధానం: గోరు చిక్కుడు కాయలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మసాలా దినుసుల్లో ధనియాలను నూనె లేకుండా, ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో వేయించి మిగతా మసాలా దినుసులతో కలిపి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నె లేదా బాండీ తీసుకుని నూనె కాగిన తరువాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తరువాత చిక్కుడు కాయ ముక్కల్ని వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి కొద్దిసేపు వేగిన తరువాత మసాలా ముద్దను, పెరుగు జత చేసి అవసరం అనుకుంటే కొద్దిగా నీరు కలిపి ఉడికించాలి. దించేముందు కొత్తిమీర చల్లుకుని దింపేయాలి.

సగ్గుబియ్యం పొంగనాలు

కావలసిన పదార్థాలు:

 సగ్గుబియ్యం- 1/2, కప్పు, బియ్యం - 3/4 కప్పు, మినప్పప్పు - 1/4 కప్పు, మెంతులు - చిటికెడు, పెరుగు -3 టేబుల్‌ స్పూన్లు, శనగపప్పు- 1 టేబుల్‌ స్పూను, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, అల్లం తరుగు - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, ఉల్లి తరుగు - కప్పు. 

తయారుచేసే విధానం: సగ్గుబియ్యం, మినప్పప్పు, బియ్యం, మెంతులు కలిపి 6 గంటలు నానబెట్టాలి. తర్వాత నీరు వడకట్టి పెరుగు, ఉప్పు కలుపుతూ చిక్కగా రుబ్బి (అవసరమైతే కొద్ది నీరు వాడొచ్చు) 8 గంటల సేపు పక్కనుంచాలి. తర్వాత కొత్తిమీర, ఉల్లి తరుగు, (5 గంటలపాటు నానబెట్టిన) శనగపప్పుని కలపాలి. చిన్న కడాయిలో కొద్ది నూనె వేసి ఆవాలు, అల్లం, పచ్చిమిర్చి తరుగు తాలింపు వేసి చల్లారాక రుబ్బిన పిండిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని (స్పూను చొప్పున నూనె వేసిన) పెనం గుంతల్లో మూడు వంతులు నింపి మూతపెట్టాలి. వేగాక సన్న కాడతో తిప్పుతూ అన్నివైపులా దోరగా వేగించాలి. ఈ పొంగనాలని కొబ్బరిచట్నీతో తింటే చాలా బాగుంటాయి.

సగ్గుబియ్యం కిచిడీ

కావలసిన పదార్థాలు:

 సగ్గుబియ్యం - 1 కప్పు, వేగించిన పల్లీ పొడి - పావు కప్పు, పచ్చిబఠాణి - పావు కప్పు, మొక్కజొన్న గింజలు - పావు కప్పు, తరిగిన పచ్చికొబ్బరి - 2 టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి - 4, ఉప్పు - రుచికి తగినంత, నిమ్మరసం - 1 టేబుల్‌ స్పూను, తాలింపు గింజలు - తగినన్ని, నూనె + నెయ్యి - టీ స్పూను చొప్పున.

తయారుచేసే విధానం: సగ్గుబియ్యాన్ని గంటసేపు నానబెట్టి, నీరు వంచేసి బట్టమీద నెరిపి మరో గంట ఆరబెట్టాలి. పచ్చిబఠాణి, మొక్కజొన్నగింజల్ని కొద్ది నీటిలో 3 నిమిషాలు ఉడికించాలి. కడాయిలో తాలింపు వేశాక పచ్చిమిర్చి, బఠాణి, మొక్కజొన్న గింజలు వేగించాలి. నిమిషం తర్వాత సగ్గుబియ్యం వేసి ఉప్పు చల్లాలి. పదినిమిషాలు సన్నని మంటపై ఉడికించాక పల్లీపొడి, కొబ్బరితురుము, నిమ్మరసం కలిపి దించేయాలి. వేడి వేడి కిచిడీని మీ కిష్టమైన పచ్చడితో తినండి.

సగ్గుబియ్యం మురుకులు

కావలసిన పదార్థాలు:

 బియ్యప్పిండి - 3 కప్పులు, సగ్గుబియ్యం - ఒక కప్పు, కారం - 2 టీ స్పూన్లు, నువ్వులు - అరకప్పు, వెన్న - 4 టేబుల్‌ స్పూన్లు, నూనె - వేగించడానికి సరిపడా.


తయారుచేసే విధానం: సగ్గుబియ్యాన్ని ఆవిరిమీద కుక్కర్లో 5 విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. తర్వాత ఒక వెడల్పాటి పాత్రలో ఉడికిన సగ్గుబియ్యానికి కారం, నువ్వులు, ఉప్పు, బియ్యప్పిండి చేర్చి సరిపడా నీరు కలుపుతూ ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పనిముట్టు సాయంతో మురుకులు వేసుకుని దోరగా వేగించుకోవాలి.

సగ్గుబియ్యం మురుకులు

కావలసిన పదార్థాలు: 

బియ్యప్పిండి - 3 కప్పులు, సగ్గుబియ్యం - 1 కప్పు, కారం - 2 టీ స్పూన్లు, నువ్వులు - అర కప్పు, వెన్న -4 టేబుల్‌ స్పూన్లు, నూనె - వేగించడానికి సరిపడా, నీరు - 2 కప్పులు.

తయారుచేసే విధానం: ఒక గిన్నెలో తగినన్ని నీటిలో సగ్గుబియ్యం వేసి కుక్కరులో ఉంచి, ఆవిరిపై 5 విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. తర్వాత ఒక వెడల్పాటి పాత్రలోకి ఉడికిన సగ్గుబియ్యం తీసుకుని అందులో కారం, నువ్వులు, ఉప్పు, బియ్యప్పిండి చేర్చి నీరు కలుపుతూ ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మురుకుల యంత్రం సహాయంతో తిప్పుకుంటూ, నూనెలో దోరగా వేగించుకోవాలి.

సగ్గుబియ్యం వడలు

కావలసిన పదార్థాలు:

 సగ్గుబియ్యం - 2 కప్పులు, ఆలుగడ్డ (పెద్దది) - 1, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 3, కరివేపాకు - 4 రెబ్బలు, కొత్తిమీర తరుగు - పావు కప్పు, అల్లం తరుగు - 1 టీ స్పూను, నూనె - వేగించడానికి సరిపడా, ఉప్పు - రుచికి తగినంత.

తయారుచేసే విధానం: ఒక రాత్రంతా సగ్గుబియ్యం నానబెట్టి నీళ్లు వడగట్టాలి. ఉడికించి మెదిపిన ఆలులో సగ్గుబియ్యం, పచ్చిమిర్చి, ఉల్లి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకుని వడల్లా (పలచగా) వత్తి నూనెలో దోరగా వేగించుకోవాలి. ఇవి పుదీనా చట్నీతో బాగుంటాయి.

సగ్గుబియ్యం పకోడీ



కావలసిన పదార్థాలు 

 సగ్గుబియ్యం - ఒక గ్లాసు, మైదాపిండి - ఒక గ్లాసు, బియ్యంపిండి - అర గ్లాసు, పెరుగు - ఒక గ్లాసు, ఉల్లిపాయలు - నాలుగు, ఉప్పు - తగినంత, కారం - తగినంత, జీలకర్ర - ఒక చెంచా, కరివేపాకు - రెండు రెబ్బలు, నూనె - వేయించడానికి సరిపడా.

తయారీ విధానం :
ముందుగా సగ్గుబియ్యాన్ని ఆరు గంటలపాటు పెరుగులో నాననివ్వాలి. ఆ తరువాత ఉల్లిపాయలను సన్నగా, పొడవుగా తరగాలి. కరివేపాకును కూడా సన్నగా తరగాలి. ఆ తరువాత బాణలిని పొయ్యి మీద పెట్టి, నూనె సరిపడా పోయాలి. ఇప్పుడు నానపెట్టిన సగ్గుబియ్యంలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి బాగా కలిపి కొంచెం వేడి నూనె పోసి కలపాలి. దాన్ని పకోడీల్లా వేయించుకోవాలి. అంతే కరకరలాడే వేడి వేడి సగ్గుబియ్యం పకోడీలు రెడీ.

ఉల్లి మురుకులు

కావలసినవి : బియ్యం - 4 కప్పులు, కందిపప్పు -1 కప్పు, ఉల్లిపాయలు (చిన్నవి ) - 6, వేడి నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, కారం - 2 టీస్పూన్లు, ఉప్పు - 2 టీ స్పూన్లు, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం : బియ్యం, కందిపప్పులను బాండిలో దోరగా వేగించి మరపట్టించాలి. ఉల్లిపాయల్ని ముక్కలుగా కోసుకుని మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. జల్లించిన మరపిండిలో ఉల్లిపేస్టు, వేడి నూనె, కారం, ఉప్పు వేసి ముద్దలా కలుపుకోవాలి (అవసరం అయితే నీరు కలుపుకోవచ్చు). మురుకుల గొట్టానికి నూనె రాసి, స్టార్‌గుర్తు బిళ్ల ని సెట్‌ చేసుకుని నూనెలో దోరగా వేగించుకోవాలి. ఇవి కూడా 15 రోజులదాకా నిలువ ఉంటాయి.

Saturday, November 14, 2015

ఉసిరి పెరుగు పచ్చడి


కావలసినవి: ఉసిరి కాయలు - 5; కొబ్బరి తురుము - టీ స్పూను; గడ్డ పెరుగు - 2 కప్పులు; నూనె - టీ స్పూను; ఆవాలు - 2 టీ స్పూన్లు; సెనగ పప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; ఎండు మిర్చి - 6; కారం - అర టీ స్పూను; పచ్చి మిర్చి - 4; ఉప్పు - తగినంత; పసుపు - పావు టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు
తయారీ: ఉసిరి కాయలను శుభ్రంగా కడిగి గింజలు వేరు చేసి, ముక్కలుగా కట్ చేయాలి బాణలిలో నూనె వేసి, కాగాక ఉసిరి కాయ ముక్కలు వేసి కొద్దిగా వేగాక తీసి, చల్లారాక, పచ్చి మిర్చి, కొబ్బరి తురుము జత చేసి మిక్సీలో వేసి కొద్దిగా మెత్తగా చేయాలి అదే బాణలిలో సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండు మిర్చి వరసగా ఒకదాని తరవాత ఒకటి వేసి బాగా వేయించాక, ఉసిరి ముద్ద వేసి వేయించి రెండు నిమిషాలు ఉడికించి దింపి, చల్లార్చాలి పెరుగులో ఉప్పు, పసుపు, కారం వేసి గిలక్కొట్టాక, ఉసిరి మిశ్రమం వేసి కలపాలి చివరగా కరివేపాకుతో అలంకరించాలి.

ఉసిరి అన్నం

కావలసినవి: అన్నం - 3 కప్పులు; ఉసిరి కాయలు - 6; పచ్చి మిర్చి - 6; ఉల్లిపాయ - 1; నూనె - 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; మినప్పప్పు - 2 టీ స్పూన్లు; ఇంగువ - కొద్దిగా; పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత; కరివేపాకు - 2 రెమ్మలు
తయారీ: పచ్చి మిర్చి, ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఉసిరికాయల నుంచి గింజలు వేరు చేసి, ముక్కలుగా కట్ చేసి, పచ్చి మిర్చి జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి ఉల్లి తరుగు జత చేసి మరో మారు వేయించాలి మెత్తగా చే సి ఉంచుకున్న ఉసిరి ముద్ద, పసుపు, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలియబెట్టి దించి చల్లార్చాలి పెద్ద పాత్రలో అన్నం వేసి, దాని మీద ఉసిరి మిశ్రమం వేసి బాగా కలిపి, కరివేపాకుతో అలంకరించి వేడివేడిగా వడ్డించాలి..

Tuesday, November 10, 2015

• రాగి పులిహోర


కావలసినవి:
రాగులు ఒక కప్పు
ఆవాలు పావు చెంచా 
జిలకర అర చెంచా
శనగపప్పు, మినపపప్పు అర చెంచా చింతపండు పులిహోర పులుసు తగినంత
కరివేపాకు, ఉప్పు తగినంత
నూనె 15 ఎం.ఎల్.

తయారీ విధానం:రాగులను అన్నంలా బిరుసుగా వండుకొని పక్కన పెట్టుకోవాలి. మరోవైపు చింతపండు గుజ్జును పొయ్యి మీద పెట్టి కొంచెం సేపు ఉడికించి పులిహోర పులుసు తయారు చేసుకోవాలి. నూనెలో తాళింపు దినుసులు వేసి పులుసులో కలుపుకోవాలి. దీన్ని రాగి అన్నంలో వేసి కలిపితే పులిహోర సిద్ధం. కొర్రలు, జొన్నలతోనూ ఈ పులిహోర చేసుకోవచ్చు.

• సజ్జ నూనె పోలెలు

కావలసినవి:
సజ్జ పిండి 1 కిలో 
సోంపు 25 గ్రాములు 
నువ్వులు 25 గ్రాములు
గసగసాలు 25 గ్రాములు
యాలకులు 4
బెల్లం అర కిలో
నూనె అర కిలో

తయారీ విధానం:బెల్లాన్ని ముదురు పాకం పట్టాలి. ఇందులో సజ్జ పిండిని ఉండ కట్టకుండా నెమ్మదిగా కలపాలి. తర్వాత సోంపు, నువ్వులు, యాలకులు, గసాలు వేయాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి.. పలుచగా, గుండ్రంగా ఒత్తుకొని నూనెలో వేయించాలి.

• కొర్ర పాయసం

కావలసినవి:
కొర్రలు అర కిలో 
బెల్లం అర కిలో 
నీరు 1 లీటరు
యాలకులు, గసాలు,
ఎండు కొబ్బరి, సోంపు
రుచికి తగినంత

తయారీ విధానం:శుభ్రం చేసిన కొర్రలను అర గంట సేపు నానబెట్టి నీటిని ఒంపేయాలి. తర్వాత పొయ్యి మీద పాత్ర పెట్టి లీటరు నీటిని పోయాలి. నీరు మరిగిన తర్వాత అందులో నెమ్మదిగా కొర్రలు వేస్తూ.. ఉండ కట్టకుండా కలుపుతుండాలి. మరో పాత్రలో నీరు తీసుకొని బెల్లాన్ని కరిగించాలి. అన్నం ఉడికిన తర్వాత బెల్లం నీళ్లను అందులో పోయాలి. అనంతరం కొబ్బరి, సోంపు, యాలకులు, గసాలు వేసి కలపి దించాలి.

వెజిటబుల్స్ ఊతప్పాలు

కావలసిన పదార్థాలు:

దోసల పిండి
కాస్త పులిసిన పెరుగు
సన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు
తురిమిన క్యారెట్
సన్నగా తరిగిన ఉల్లిపాయలు
సన్నగా తరిగిన క్యాప్సికం
సన్నగా తరిగిన టమాటో

తయారు చేసే విధానం:

ముందుగా పెరుగును బాగా చెంచాతో కలియబెట్టండి. చిక్కగా కావాలి. దీనిని దోసెల పిండిలో కలపండి. మొత్తం మీద పిండి ఎక్కువ పలుచగా ఉండకూడదు. ఈ పిండిని ఒక గంట-రెండు గంటలు (ఋతువును బట్టి, ఎండాకాలం అయితే కాసేపు చాలు, శీతాకాలం కాస్త ఎక్కువ సమయం పడుతుంది) సేపు అలా ఫ్రిజ్ బయట ఉంచండి. పెరుగు-పిండి మిశ్రమం కొంచెం పులిసి పొంగినట్లు అవుతుంది.

పొయ్యి మీద పెనం పెట్టి శుభ్రంగా నూనెతో పెనం అంతా ఒక తలకోసిన బంగాళ దుంప లేదా ఉల్లిపాయతోనో రుద్దండి. నూనె పెనం అంతా సమతుల్యంగా వ్యాపిస్తుంది. దానిపై నాలుగు అంగుళాల వ్యాసంలో పిండిని వేసుకోండి. ఉల్లిపాయ-పచ్చిమిరపకాయల ముక్కలను దానిపై చల్లండి. మొత్తం ఊతప్పం మీద అర చెంచా నూనె వేయండి. ఊతప్పం తిప్పటానికి సిద్ధంగా ఉంది అనటానికి సంకేతం పిండిలోని పచ్చి పోయి చిల్లులుగా ఏర్పడి ఆవిరి వస్తుంది. అప్పుడు దానిని తిరగవేసి అట్లకాడతో అద్దుతూ ఒక రెండు నిమిషాలు ఉంచండి. కిందవైపు కూడా పిండి ఉడికి ఉల్లిపాయ-పచ్చిమిరపకాయ ముక్కలు రంగు మారుతున్నప్పుడు తీసి ఒక ప్లేటులో వేసుకోండి. ఇలాగే రెండో ఊతప్పంపై క్యాప్సికం-పచ్చిమిరప, మూడో ఊతప్పంపై క్యారెట్-పచ్చిమిరప వేసుకోండి. నాలుగో ఊతప్పం టమాటోత్-పచ్చిమిరపతో వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి. టమాటోలో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త నూనె ఎక్కువ వేసుకొని విరిగిపోకుండా జాగ్రత్తగా తిప్పాలి. టమాటోలు కూడా బాగా రంగుమారి నీరు ఇంకేంతవరకు ఉంచాలి. ఈ టమాటో ఊతప్పాన్ని సన్న సెగలో చేసుకుంటే మాడ కుండా ఉంటుంది.

ఈ నాలు రకాల ఊతప్పలను వేరుశనగపచ్చడి, కారప్పొడి, సాంబార్ లేదా తాజా కూరగాయ చట్నీ దేనితోనైనా తినవచ్చు. వేడి వేడిగా తినాలి. నూనె లేకుండా కూడా ఇవి చేసుకోవచ్చు కానీ జాగ్రత్తగా, చాకచక్యంగా తిరగవేయాలి, శ్రద్ధగా గమనించాలి.

Monday, November 9, 2015

ఉల్లిపాయ మజ్జిగ పులుసు:

 చిక్కగా కావాలనుకున్న వాళ్లు మరింత బియ్యప్పిండి-శనగపిండి మిశ్రమం, కొబ్బరి వేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:
పెరుగు (పావులీటరు పాలు కాచి తోడుపెట్టినవి) - కొద్దిగా పులిస్తేనే రుచి.
ఒక అర స్పూను మెంతులు, స్పూను ధనియాలు, స్పూను జీలకర్ర
రెండు స్పూన్ల శనగపిండి, రెండు స్పూన్ల బియ్యప్పిండి
కొబ్బరి 7-8 ముక్కలు
ఒక టమాటో (కోసిన ముక్కలు)
రెండు పచ్చిమిరప కాయలు, కాస్త తురిమిన అల్లం
కరివేపాకు, కొత్తిమీర
తగినంత ఉప్పు, పసుపు, పోపుకు నూనె, ఆవాలు, ఇంగువ
తయారు చేసే విధానం:
ముందుగా మెంతులు, ధనియాలు, జీలకర్ర, కొబ్బరిని వేయించి మెత్తగా డ్రై గ్రైండర్లో మిక్సీ వేయాలి. కొబ్బరి మెత్తగా నలిగిపోవాలి. తరువాత టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, పెరుగు, శనగపిండి, బియ్యప్పిండి, పెరుగు వేసి వెట్ గ్రైండర్లో మిక్సీ వేయాలి. అన్నీ కలిసి చక్కగా, చిక్కని మిశ్రమం కావాలి. పలుకులు ఉండకూడదు.
ఉల్లిపాయలను నిలువుగా పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. పాత్రలో నూనె కాస్త వేసి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి పోపు పెట్టాలి. ఆవాలు చిటపటలాడిన తరువాత అందులో కరివేపాకు వేసి, ఒక నిమిషం తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి రంగు మారి మెత్త బడే వరకు వేయించాలి. తరువాత మిక్సీలో వేసుకున్న మజ్జిగపులుసు మిశ్రమాన్ని వేయాలి. ఒక పెద్దగ్లాసు నీళ్లు, తగినంత ఉప్పు, పసుపు వేసి ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. దించేముందు కొత్తిమీర తరిగి వేసుకోవాలి. వేడి వేడి అన్నంలో ఈ మజ్జిగ పులుసు తింటే భలే. నంజుకోవడానికి బూడిద గుమ్మడి లేదా మినప వడియాలు, ఊరు మిరపకాయలు ఉంటే అద్భుతః.
ఉల్లిపాయల బదులు మంచి గుమ్మడి/బూడిద గుమ్మడి/సొరకాయ/క్యారట్ ముక్కలు ఏవైనా వేసుకోవచ్చు.