Tuesday, April 2, 2013

స్టఫ్డ్ దొండ


దొండకాయ పేరు చెప్పగానే అందరూ మూతి ముడిచేస్తారు. సన్నగా తరిగేసి మూకుడులో వేసి ఎర్రగా వేగించుకోవడం తప్ప మరో వెరైటీ జోలికి వెళ్లడానికి ఇష్టపడరు. కొత్తగా వండాలే గాని దొండలో బోలెడు రుచులు దాగున్నాయి. దొండ పకోడి మొదలు బిర్యానీ వరకూ... రకరకాల దొండ వెరైటీలే ఇవి ....

స్టఫ్డ్ దొండ 

కావలసిన పదార్థాలు: దొండకాయలు - పది, పల్లీపొడి - ఒక టేబుల్ స్పూను, కొబ్బరి పొడి - రెండు టీ స్పూన్లు, ఉల్లిగుజ్జు - ఒక టేబుల్ స్పూను, అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను, కారం - రెండు టీ స్పూన్లు, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.

తయారుచేయు విధానం: దొండకాయల్ని గుత్తికాయల్లా కోసుకోవాలి. ఒక గిన్నెలో ఉల్లిపాయ గుజ్జు, పల్లీపొడి, కొబ్బరి పొడి, అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని దొండకాయల మధ్యలో పెట్టుకోవాలి. పొయ్యిమీద నాన్‌స్టిక్ కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగాక దొండకాయల్ని వేసి సన్ననిమంటపై మగ్గనివ్వాలి. మధ్యలో కాయల్ని తిరగేస్తుండాలి. కాయ బాగా మెత్తబడ్డాక దించేయాలి. వీటిని సాంబారన్నంలో తింటే చాలా రుచిగా ఉంటాయి.

0 comments:

Post a Comment