Saturday, April 13, 2013

నాన్


నాన్ 
కావలసినవి :


మైదా : పావుకిలో
నూనె : టేబుల్ స్పూను
పెరుగు : కప్పు
పాలు : కప్పు
డ్రై ఈస్ట్ : టీ స్పూను
బేకింగ్ పౌడర్ : అర టీ స్పూను
సోడా : పావు టీ స్పూను
పంచదార : టీ స్పూను
వెల్లుల్లి ముద్ద : టీ స్పూను
తాజా మెంతి తురుము : కప్పు
ఉప్పు : సరిపడా

తయారు చేసే విధానం :

మైదా లో ఉప్పు , బేకింగ్ పౌడర్ వేసి కలిపి పక్కన ఉంచాలి .
గోరువెచ్చని పాలల్లో పెరుగు , ఈస్ట్ , పంచదార కలిపి పది నిమిషాలు పక్కన ఉంచాలి .
మెంతి కూర తురుము , వెల్లుల్లి ముద్ద , నూనెలను మైదాలో వేసి కలపాలి .తరవాత ఈస్ట్ కలిపి ఉంచిన పాలు , పెరుగు మిశ్రమాన్ని కూడా కలపాలి .
అవసరమైతే తగినన్ని నీళ్లు చిలకరించి చపాతీ పిండిలా కలిపి మూతపెట్టి గంటసేపు పక్కన ఉంచాలి .
తరవాత పిండిని ముద్దలుగా చేసుకుని మందపాటి చపాతీల్లా వత్తి పెనం మీద రెండు వైపులా నెయ్యి లేదా వెన్న తో కాల్చి తీయాలి .

0 comments:

Post a Comment