చింతపండు చట్నీ
కావలసినవి: చింతపండు - 200 గ్రాములు, బెల్లం తురుము - 300 గ్రాములు, వేగించిన జీలకర్రపొడి, కారం - ఒక్కోటి రెండు టీ స్పూన్ల చొప్పున, ఉప్పు - రుచికి సరిపడా, నల్ల ఉప్పు, గరం మసాలా - ఒక్కోటి ఒక టీస్పూన్ చొప్పున, నీళ్లు - తగినన్ని.
తయారీ: చింతపండులో ఐదు కప్పుల నీళ్లు పోసి పదినిమిషాల పాటు ఉడికించాలి. తరువాత వడకట్టి బెల్లం తురుము, కారం, జీలకర్రపొడి, ఉప్పు, గరంమసాలా వేసి బాగా కలియపెట్టాలి. మళ్లీ సన్నటి మంటమీద బెల్లం కరిగేవరకు ఉడికించాలి. చట్నీ కాస్త చిక్కబడగానే దింపేయాలి. చల్లబడితే ఈ చట్నీ చిక్కబడుతుంది. అందుకని వాడుకునేప్పుడు నీళ్లుకలుపుకోవచ్చు.

0 comments:
Post a Comment