Saturday, April 13, 2013

ఆకుకూరల పెరుగు వడ


ఆకుకూరల పెరుగు వడ 
కావలసినవి :


తోటకూర , పాలకూర , చుక్కకూర , గోంగూర , పుదీనా ,కొత్తిమీర : ఒక్కో కట్ట చొప్పున
మినపప్పు : అరకిలో
పెరుగు : లీటరు
పచ్చిమిరపకాయలు : ఎనిమిది
నూనె : వేయించడానికి సరిపడా

తాలింపు కోసం :

సెనగపప్పు : టీ స్పూను

జీలకర్ర :టీ స్పూను

మినపప్పు : అరటీ స్పూను
ఆవాలు : టీ స్పూను
అల్లం వెల్లుల్లి : 2 టీ స్పూన్లు
ఉప్పు : తగినంత
ఎండుమిర్చి : ఆరు
కరివేపాకు : రెండు రెబ్బలు

తయారు చేయు విధానం:

మినప్పప్పుని రాత్రే నానబెట్టుకోవాలి .
బాణలిలో కొద్దిగా నూనె వేసి సెనగపప్పు , మినప్పప్పు , జీలకర్ర , ఆవాలు , అల్లంవెల్లుల్లి , ఎండుమిర్చి , కరివేపాకు వేసి తాలింపుచేసి పెరుగులో కలపాలి . ఉప్పు కూడా వేసి కలిపి ఉంచాలి .
ఆకుకూరలన్ని సన్నగా తరగాలి . పచ్చిమిర్చి సన్నగా తరగాలి .
పిండిలో ఉప్పు , ఆకుకూరల తురుము , పచ్చిమిర్చి తురుము వేసి కలిపి వడల్లా చేసి కాగిన నూనెలో వేయించి తీసి పెరుగులో వేస్తె ఆకుకూరల పెరుగువడలు రెడీ

0 comments:

Post a Comment