Thursday, April 4, 2013

ఓట్స్ మసాలా హెల్తా వెయిట్ లాస్ బ్రేక్ ఫాస్ట్


ఓట్స్ మసాలా హెల్తా వెయిట్ లాస్ బ్రేక్ ఫాస్ట్

బ్రేక్ ఫాస్ట్ రిసిపిలలో చాలా రకాలు ఉన్నాయి. అయితే రొటీన్ గా చేసేవాటికి కొంచెం బిన్నంగా తయారు చేసుకొంటే రుచిగా ఉంటుంది. అయితే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అంధిస్తే మరింత ఆనందం. ఓట్స్ చాలా వరకూ పాలల్లో మిక్స్ చేసుకొని తింటారు. ప్లేయిన్ ఓట్స్ ను కొంచెం వెరైటీగా కొన్ని మసాలాలు దంటించి ఉప్మాలా తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది

రుచి మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా...పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఈ మసాలో ఓట్స్ లో వేసే క్యారెట్, క్యాప్సికమ్, పొటాటో, కొంచెం వెరైటీ టేస్ట్ ను అందిస్తాయి.

మరి మసాలా ఓట్స్ ఎలా తయారు చేయాలో చూద్దామా???

కావల్సిన పదార్థాలు

ఓట్స్: 1 cup(రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి) సెమోలిన : 1/2 cup(ఐదునిముషాల పాటు ఫ్రై చేసుకోవాలి) కరివేపాకు : 2రెమ్మలు ఉల్లిపాయ : 1 పచ్చిమిర్చి : 2మద్యలోకి కట్ చేపుకోవాలి క్యారెట్ : 1(పై స్కిన్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) బంగాళదుంపు : 1(పై స్కిన్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) క్యాప్సికమ్ : 1(చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) టమోటో: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 tsp చెక్క : చిన్నముక్క యాలకలు: 1 లేదా 2 గరం మసాలా పౌడర్ : 1/4 tsp కొత్తిమీర తరుగు: 2 tbsps(చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) నూనె: 1 tbsp నెయ్యి: 1 1/2 tbsps నిమ్మరసం : 1 tbsp

తయారు చేయు విధానం:

1.
ముందుగా డీప్ బాటమ్ పాన్ లో స్టౌ మీద పెట్టి నూనె మరియు ఒక చెంచా నెయ్యి వేసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో చెక్క, యాలకలు మరియు లవంగాలు వేసి రెండు 1నిముషం వేగిన తర్వాత కరివేపాకు వేయాలి, వెంటనే పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఐదు నిముషాల పాటు వేగించుకోవాలి
. 2.
ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో రెండు మూడు నిముషా వేగించాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకొన్న క్యారెట్, పొటాటో మరియు క్యాప్సికమ్ ముక్కలు వేసిగి 5నిముషాలు వేగించాలి. మంట తగ్గించి మరో రెండు మూడు నిముషాలు వేగించాలి . తర్వాత టమటో ముక్కలు కూడా వేసి మరో 5నిముషాలు వేగించాలి.
3.
ఇప్పడు అందులో ఉప్పు, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేస్తూ వేగించాలి. తర్వాత 3కప్పుల నీళ్ళు పోసి మీడియం మంట మీద బాగా ఉడికించాలి. తర్వాత మంట తగ్గిచి వేగించి పెట్టుకొన్న సెమోలినా వేసి నిదానంగా మిక్స్ చేయాలి.
4.
తర్వాత అందులోనే ఓట్స్ వేసి అర చెంచా నెయ్యి వేసి బాగా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి. మూడు నిముషాల పాటు ఉడికించుకోవాలి. స్టౌ ఆఫ్ చేసి నిమ్మరసం చిలకరించి మిక్స్ చేసుకోవాలి. 5. చివరగా స్టౌ మీద నుండి సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే హెల్తీ లోఫ్యాట్ ఓట్స్ మసాలా రెడీ.

0 comments:

Post a Comment