Monday, April 15, 2013

పెనం చెక్కలు


పెనం చెక్కలు
కావలసినవి :

గోధుమపిండి : కప్పు
బియ్యప్పిండి , సోయా పిండి : అరకప్పు
అవి సెపిండి : టీ స్పూను
రాగిపిండి : టీ స్పూను
కసూరి మెంతి : అరకప్పు
కరివేపాకు : 10 రెబ్బలు
కారం : టీ స్పూను
ఉప్పు : సరిపడా
జీలకర్ర : టీ స్పూను
పసుపు : టీ స్పూను
దాల్చినచెక్కపొడి : టీ స్పూను
మసాలా పొడి : పావు టీ స్పూను
ఇంగువ : చిటికెడు
తయారు చేసే విధానం :
  • ఓ గిన్నెలో పిండిలన్ని వేసి కలపాలి .తరవాత ఉప్పు , జీలకర్ర , కసూరిమెంతి , కారం …అన్ని వేసి కలపాలి .ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి మెత్తని ముద్దలా పిండిని కలపాలి . పిండి ముద్దను చిన్న ఉండలుగా చేసి పాలిధీన్ కవర్ మీద నెయ్యి లేదా నూనె అద్దుతూ చేక్కల్లా వత్తాలి .
  • స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేసి పెనం మెత్తం పరచుకునేలా నూనె రాయాలి . ఇప్పుడు వత్తిన చెక్కల్ని పెనం మీద పరిచినట్లుగా వేసి తక్కువ మంటమీద కాల్చాలి .అవసరమైతే మధ్యలో రెండుమూడు చుక్కలు నూనె వెయ్యాలి . రెండు నిమిషాల తరవాత అన్ని తిప్పి నూనె వేస్తూ కరకరలాడేవరకూ కాల్చి తీయాలి .
 

0 comments:

Post a Comment