Friday, April 19, 2013

* పాప్‌డి



* పాప్డి
కావలసినవి:
మైదా - ఒక కప్పు, వాము - ఒకటిన్నర టీస్పూన్, నెయ్యి లేదా నూనె - ఒక టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేగించడానికి సరిపడా, నీళ్లు- తగినన్ని. తయారీ: మైదా, నెయ్యి, వాము, ఉప్పుల్ని ఒక గిన్నెలోకి తీసుకుని కలిపి తరువాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ గట్టి ముద్దలా చేయాలి. మూతపెట్టి అరగంట పాటు పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల మెత్తగా అవుతుంది. ప్లాస్టిక్ కవర్ మీద ముద్దను ఉంచి చపాతీ కర్రతో చపాతీల్లా ఒత్తాలి.

తరువాత ఒక చిన్న మూత తీసుకుని చిన్న చిన్న పూరీల్లా గుండ్రంగా కట్ చేసుకోవాలి. వీటిని వేగించేటప్పుడు ఉబ్బకుండా ఉండేందుకు ఫోర్క్తో చిల్లులు పెట్టాలి. కడాయిలో నూనె పోసి అది వేడెక్కాక ఒక్కో వాయికి ఆరు పాప్డీల చొప్పన వేస్తూ లేత బంగారు రంగు వచ్చే వరకు రెండు వైపులా వేగించాలి. వేగిన తరువాత టిష్యూ మీద వేస్తే నూనె పీల్చుకుంటుంది. చల్లారిన తరువాత గాలి సోకని డబ్బాలో పెట్టి నిల్వ చేయాలి. రకం చాట్లో అయినా వీటిని ఉపయోగించొచ్చు.

0 comments:

Post a Comment