Saturday, April 13, 2013

పోషకాల పుల్కాలు


పోషకాల పుల్కాలు 
కావలసిన పదార్ధాలు :

గోధుములు : 1 kg
సోయా గింజలు :100 grms
రాగులు , జొన్నలు , సజ్జలు : 300 grms చొప్పున



తయారి విధానం :

అన్నిటినీ పిండి పట్టించి జల్లించకుండానే నిల్వచేసుకోవాలి . ఓ గిన్నెలో తగినంత పిండి తీసుకుని నీళ్లతో చపాతీ పిండిలా కలిపి పావుగంట నాననివ్వాలి . వీటిని చపాతీల్లా వత్తుకుని నూనెలేకుండా పెనం పై రెండు వైపులా కాల్చితే సరిపోతుంది .

పోషకాలు :

పొట్టు తీయకుండా పుల్కాలు చేసుకుంటాం కాబట్టి పీచు పదార్ధం అందుతుంది వీటి నుండి మేలు చేసే సంక్లిష్ట పిండి పదార్ధాలు కూడా లభిస్తాయి . మూడు , నాలుగు తిన్న ఇబ్బంది ఉండదు . ఈ పుల్కాలవల్ల విటమిన్ ఇ , ఇనుము , మెగ్నీషియం , బి -కాంప్లెక్స్ , పోషకాలు సమృద్ధిగా అందుతాయి .ఇవి మరింత రుచిగా ఉండాలంటే మెంతి కూర , పాల కూర ,మునగ వంటి ఆకుకూరల్ని తీసుకుని మిక్సి లో మెత్తగా రుబ్బుకుని వాటిని వాడకట్టగా వచ్చే నీటితో పిండి కలపవచ్చు మృదువుగా వస్తాయి , పోషకాలు అందుతాయి . మధుమేహం వల్ల జీవం కోల్పోయిన చర్మం కాంతిమంతంగా మారుతుంది .

0 comments:

Post a Comment