Monday, April 29, 2013

సున్నుండలు



సున్నుండలు

కావలసిన పదార్దాలు :

 మినపప్పుహాఫ్ కేజీ 
నెయ్యిముప్పావ్ కేజీ 
చక్కర లేదా బెల్లం : హాఫ్ కేజీ 

ఇప్పుడు ఎలా చెయ్యాలో  చూద్దామా  మరి :
ముందుగ  స్టవ్ వెలిగించి  గుండు మినపప్పును  ఒక కడాయిలోకి  తీసుకొని లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి .(కొంచెం వేడి తగ్గినా తర్వాత గుండు మినపప్పు ను గ్రయిండ్ చేసుకోవాలి )
పంచదారని గ్రయిండ్  చేసి పక్కన పెట్టుకోవాలి .
ఇప్పుడు  గుండు మినపప్పు పొడి  , పంచదార  పొడి కలిపి నెయ్యి  వేసికొని  బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి .... అంతే తియ్యగా వుండే సున్నుండలు తినడానికి రెడీ .......

బియ్యపిండి గారెలు



బియ్యపిండి గారెలు

బియ్యం పిండి  :    4 కప్పులు 
పెరుగు            :     2 కప్పులు 
ఉల్లిపాయలు    :     2
అల్లం              :      కొంచెం 
నూనె             :     డీప్ ఫ్రై  చేయటానికి తగినంత 
కరివేపాకు      :      కొంచెం 
పచ్చిమిర్చి     :      5
ఉప్పు            :     తగినంత    

తయారి విధానము:
బియ్యపిండి బరకగా వుండాలి.  బియ్యపిండిని  ఒక గిన్నెలోకి తీసుకోని అందులో  పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు తగినంత , జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు అన్ని వేసి బాగా  గారెల  పిండిలా కలుపుకోవాలి.  15 నిమిషాలు పిండిని పక్కన పెట్టి ఆతరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె పోసి బాగా నూనె వేడెక్కిన తరువాత కలిపి పెట్టుకున్న పిండిని గారేలుగా వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఉంఛి సెర్వింగ్ బోవేల్ లోకి తీసుకోవాలి.

Thursday, April 25, 2013

చింత చిగురు పప్పు




కావలసిన పదార్ధాలు :


చింత చిగురు : వంద గ్రాములు 

కందిపప్పు : కప్పు 

పచ్చిమిర్చి : ఏడు
కారం : స్పూన్
పసుపు : కొద్దిగా
ఉప్పు : సరిపడ
నూనె : సరిపడ
పోపు గింజలు : రెండు  స్పూన్స్ 

 

తయారుచేసే విధానం :


1)  పప్పును కడిగి కుక్కర్లో వేసి సరిపడ నీళ్ళు పోసి కొంచం పలుకుగ ఉడికించాలి.
 2) ఇప్పుడు చింత చిగురు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి పప్పులో వేసి ఉడికించాలి.
3) పప్పు, ఆకు బాగా ఉడికిన తరువాత దించి, పప్పులోని నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి.
 4) ఇప్పుడు పప్పులో  సరిపడా ఉప్పువేసి పప్పుగుత్తితో మెత్తగా మెదుపుకోవాలి.
5) తరువాత పక్కన పెట్టుకున్న పప్పు నీటికీ కారం, పసుపు వేసి పప్పు లో కలపాలి.
6) ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టాలి.
7) ఇప్పుడు  పోపు బాగా వేగిన తరువాత మెదిపి ఉంచుకున్న పప్పును ఇందులో కలపాలిఅంతే వేడి వేడి చింత చిగురు పప్పు రేడి.


Friday, April 19, 2013

చింతపండు చట్నీ



చింతపండు చట్నీ

కావలసినవి: చింతపండు - 200 గ్రాములు, బెల్లం తురుము - 300 గ్రాములు, వేగించిన జీలకర్రపొడి, కారం - ఒక్కోటి రెండు టీ స్పూన్ల చొప్పున, ఉప్పు - రుచికి సరిపడా, నల్ల ఉప్పు, గరం మసాలా - ఒక్కోటి ఒక టీస్పూన్ చొప్పున, నీళ్లు - తగినన్ని.

తయారీ: చింతపండులో ఐదు కప్పుల నీళ్లు పోసి పదినిమిషాల పాటు ఉడికించాలి. తరువాత వడకట్టి బెల్లం తురుము, కారం, జీలకర్రపొడి, ఉప్పు, గరంమసాలా వేసి బాగా కలియపెట్టాలి. మళ్లీ సన్నటి మంటమీద బెల్లం కరిగేవరకు ఉడికించాలి. చట్నీ కాస్త చిక్కబడగానే దింపేయాలి. చల్లబడితే చట్నీ చిక్కబడుతుంది. అందుకని వాడుకునేప్పుడు నీళ్లుకలుపుకోవచ్చు.

* పాప్‌డి



* పాప్డి
కావలసినవి:
మైదా - ఒక కప్పు, వాము - ఒకటిన్నర టీస్పూన్, నెయ్యి లేదా నూనె - ఒక టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేగించడానికి సరిపడా, నీళ్లు- తగినన్ని. తయారీ: మైదా, నెయ్యి, వాము, ఉప్పుల్ని ఒక గిన్నెలోకి తీసుకుని కలిపి తరువాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ గట్టి ముద్దలా చేయాలి. మూతపెట్టి అరగంట పాటు పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల మెత్తగా అవుతుంది. ప్లాస్టిక్ కవర్ మీద ముద్దను ఉంచి చపాతీ కర్రతో చపాతీల్లా ఒత్తాలి.

తరువాత ఒక చిన్న మూత తీసుకుని చిన్న చిన్న పూరీల్లా గుండ్రంగా కట్ చేసుకోవాలి. వీటిని వేగించేటప్పుడు ఉబ్బకుండా ఉండేందుకు ఫోర్క్తో చిల్లులు పెట్టాలి. కడాయిలో నూనె పోసి అది వేడెక్కాక ఒక్కో వాయికి ఆరు పాప్డీల చొప్పన వేస్తూ లేత బంగారు రంగు వచ్చే వరకు రెండు వైపులా వేగించాలి. వేగిన తరువాత టిష్యూ మీద వేస్తే నూనె పీల్చుకుంటుంది. చల్లారిన తరువాత గాలి సోకని డబ్బాలో పెట్టి నిల్వ చేయాలి. రకం చాట్లో అయినా వీటిని ఉపయోగించొచ్చు.