కావలసిన పదార్థాలు: మినపప్పు - ఒక కప్పు, బొంబాయి రవ్వ - ఒక కప్పు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిరపకాయలు - రెండు, జీలకర్ర - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, సోడా - చిటికెడు, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: మినపప్పుని ముందురోజు నానబెట్టుకుని మర్నాడు పొద్దుటే మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, బొంబాయి రవ్వ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఓ గంట తర్వాత పొయ్యి మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె వేసి బాగా కాగాక పునుగుల్లా వేసుకోవాలి. కరకరలాడుతూ చాలా రుచిగా ఉండే ఈ పునుగులను పల్లీ పచ్చడితో తింటే ఇంకా బాగుంటాయి.
0 comments:
Post a Comment