• రాగుల ఇడ్లీ
కావలసిన పదార్థాలు : రాగి పిండి - 2 కప్పులు, ఇడ్లీ రవ్వ - ఒక కప్పు, మినపప్పు - అర కప్పు,
మెంతులు - ఒక టీ స్పూన్, ఉప్పు - తగినంత
తయారుచేసే విధానం :
ఇడ్లీ రవ్వ, మెంతులు, మినపప్పు విడివిడిగా 6గంటల పాటు నానబెట్టాలి. మూడు కలిపి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో రాగి పిండి, కొన్ని నీళ్లు పోసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కూడా ఆరు గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్‌కు నూనె రాసి మిశ్రమాన్ని కొద్ది, కొద్దిగా వేయాలి. ఆవిరి మీద పదినిమిషాల పాటు ఉడికించాలి. ఈ ఇడ్లీలు కొత్తిమీర చట్నీతో తింటే బాగుంటాయి.
0 comments:
Post a Comment